Babli Project

శివాజీ చెప్పినట్లే ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు....కలకలం రేపుతున్న....

Submitted by arun on Fri, 09/14/2018 - 10:30

2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు మరో 15మందిపై మహారాష్ట్రలో కేసు నమోదైంది. ఎనిమిది ఏళ్లుగా ఒక్క నోటీసు ఇవ్వకుండా హఠాత్తుగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కోర్టు నోటీసుల వ్యవహారంలో ఏం చేయాలనే అంశంపై టీడీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఈ నెల 21 న ధర్మాబాద్ కోర్టుకు హాజరు కావాలా లేదంటే మరేం చేయాలనే అంశంపై చర్చలు జరుపుతున్నారు. బాబ్లీ కేసు, నోటీసులపై న్యాయ నిపుణులతో సంప్రదించాలని నిర్ణయించారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు ప్రవాహం

Submitted by arun on Wed, 06/13/2018 - 11:29

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరదనీరు ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 21,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్టు ఏఈఈ మహేందర్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90.313 టీఎంసీలు కాగా వరద వచ్చి చేరడంతో మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటి మట్టం 1053.50 అడుగులు, 8.197 టీఎంసీలకు చేరుకున్నది. ఇప్పటివరకు 2 టీఎంసీల నీరు వచ్చి చేరిందని, బుధవారం ఉదయం వరకు మరో టీఎంసీ నీరు వచ్చే అవకాశం ఉన్నదని ఏఈఈ తెలిపారు.
 

బాబ్లీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

Submitted by arun on Mon, 06/11/2018 - 16:25

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు.. బాబ్లీ ప్రాజెక్ట్ జలకలను సంతరించుకుంది. బాబ్లీ ప్రొజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో.. 2 గేట్లు ఎత్తి దిగువకు 20 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదికి వదిలారు. బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కుతూ శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కు పరుగులు పెడుతున్నాయి. 24 గంటల్లో SRSP లోకి వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. మరో వైపు ఎగువన కురిసిన వర్షాలకు కౌలాస్ నాలా ప్రాజెక్టుకు 393 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.