Atal Bihari Vajpayee

హైదరాబాద్‌లో వాజ్‌పేయి స్మారక భవనం: కేసీఆర్

Submitted by arun on Thu, 09/27/2018 - 14:07

ప్రజలు కోరుకున్న నేత వాజ్ పేయి అని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ అన్నారు. ఇవాళ శాసనమండలిలో వాజపేయి సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...దేశ ప్రధానుల్లో మాజీ ప్రధాని వాజపేయి విలక్షణమైన నేత అన్న కేసీఆర్‌ ఆయన ప్రసంగాలలో స్పష్టత ఉండేదన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాజ్ పేయి నమ్మిన సిద్ధాంతాన్ని ఎన్నడూ వీడలేదన్నారు. విలువలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని అన్నారు. ఆయన జీవితం భావి తరాలకు స్ఫూర్తి అన్నారు. ‘నగరంలో వాజపేయి స్మారకార్థం.. ఎకరా స్థలంలో స్మారక భవనం, విగ్రహాం కూడా నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వాజ్‌పేయి అస్థికలతో బీజేపీ నేత సెల్ఫీలు

Submitted by arun on Sat, 08/25/2018 - 11:16

మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి అస్థికల యాత్రలో బీజేపీ నేత సెల్ఫీ తీసుకుంటూ వివాదంలో చిక్కుకున్నారు. ఔరంగాబాద్‌ డిప్యూటీ మేయర్‌ విజయ్‌ ఔతడే అస్థికల యాత్ర సాగుతుండగా సెల్ఫీ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వాజ్‌పేయి అస్థికల యాత్ర ముంబై నుంచి ఔరంగబాద్‌లోని ఉస్మాన్‌పురాకు చేరుకుని జల్నాకు వెళుతుండగా ఔతడే సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో నెటిజన్లు బీజేపీ నేత చర్యను తప్పుపట్టారు.
 

తాత నుంచి భారమైన ఆఖరి ‘బహుమతి’

Submitted by arun on Sat, 08/18/2018 - 09:38

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి రాజకీయాలకు స్వస్తి చెప్పిన తర్వాత జీవితాన్ని ఎలా గడిపారు ? పూర్తిగా ఇంటి వద్ద ఉంటూనే కుటుంబంతోనే గడిపారా ? వయసు మళ్లిన వాజ్‌పేయిని ఆయన కుటుంబసభ్యులు ఎలా చూసుకున్నారు. దత్తపుత్రిక నమితా భట్టాచార్య అన్ని తానై చూసుకున్నారా ?

వెంకయ్య ఎదుగుదలలో వాజ్‌పేయి కీలకపాత్ర

Submitted by arun on Sat, 08/18/2018 - 09:22

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నాయకత్వంలో ఎన్నో పదవులు అందుకొని ప్రశంసలు అందుకున్నారు. అయితే అటల్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. 

మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయికి లక్షలాది ప్రజలు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు వాజ్‌పేయికి కన్నీటితో వీడ్కొలు పలికారు. వాజ్‌పేయితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. అయితే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాజ్‌పేయి అంత్యక్రియల్లో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

కాలినడకన మోదీ, షా

Submitted by arun on Fri, 08/17/2018 - 15:27

మాజీ ప్రధాని వాజ్ పేయి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ అంతిమయాత్రలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు నేతలు పాల్గొన్నారు. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతకుముందు, వాజ్ పేయి నివాసం నుంచి బీజేపీ కార్యాలయానికి మోదీ, బీజేపీ అగ్రనేతలు అద్వానీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు వెళ్లారు. వాజ్ పేయి భౌతికకాయానికి నివాళులర్పించారు.

వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభం

Submitted by arun on Fri, 08/17/2018 - 14:29

మాజీ ప్రధాని, భారత రత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంతిమయాత్ర ప్రారంభమైంది. దిల్లీలోని దీన్‌దయాళ్‌ మార్గ్‌లోని భాజపా ప్రధాన కార్యాలయం నుంచి అంతిమ కాసేపటి క్రితం ఆరంభమైంది. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌ వద్ద ప్రభుత్వం లాంఛనాలతో వాజ్‌పేయీ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అంతిమయాత్రకు బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.
 

ఒక్క మనిషి.. ఎన్నో విద్యలు

Submitted by arun on Fri, 08/17/2018 - 13:43

దేశం ఒక  అజాత శత్రువును కోల్పోయిందని,

జనం వేదనను వినిపించే ఓ గొంతును కోల్పోయిందని,

ఓ గొప్ప విశిష్ట పాత్రికేయుడిని పోగొట్టుకుందని,

ఓ మహాకవిని మరియు భావుకుడ్ని కోల్పోయిందని,

వాజ్ పేయి గురించి అమిత్ షా తన బాధని వ్యక్తపరిచారు. శ్రీ.కో. 

అమెరికా భారత శాంతి వారధి

Submitted by arun on Fri, 08/17/2018 - 13:39

భారత మాజీ ప్రధాని వాజ్‌పేయీ మృతిపట్ల,

అమెరికా బారతావనికి సంతాపం తెలిపింది,

ఇరు దేశాల అభివృద్ది, ప్రపంచశాంతి పట్ల, 

గొప్ప నేత కృషిని నేడు మరోసారి కొనియాడింది. శ్రీ.కో. 

స్నేహబంధం ఎంత మధురం

Submitted by arun on Fri, 08/17/2018 - 13:35

వాజ్‌పేయితో అద్వానీ సుదీర్ఘ స్నేహబంధం,

అందమైన మరియు అపూర్వమైనా సంబంధం,

అద్వానీ గారి ఆత్మ మిత్రుడి మృతి వార్త, 

మాటలు రానంత బాధలో వారి మనసు ఆర్ధత.  శ్రీ.కో. 

మరోలోక నాయకుడయ్యవా కర్మయోగి?

Submitted by arun on Fri, 08/17/2018 - 12:58

బారత్ ముద్దు బిడ్డ 93 ఏళ్ల వాజ్‌పేయ సారూ,

నిన్న సాయంత్రం 5.05  తుదిశ్వాస విడిచారు,

బీజేపీ హెడ్ ఆఫీస్‌ నుండి అంతిమయాత్ర, షురు,

సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలని తెలిపారు,

మరో లోక నాయకుడిగా అయినట్టునాడు వాజపాయ్ గారు. శ్రీ.కో.