ysrcp

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏకు జగన్ షాక్

Submitted by arun on Tue, 08/07/2018 - 13:51

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో  ఎన్డీఏ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది.  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధులకు  వైసీపీ మద్దతిచ్చింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల అంశంపై వైసీపీ తన వైఖరి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీయేకు మద్దతివ్వబోమని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం వెల్లడించారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు.
 

వైసీపీలోకి మరో టీడీపీ నేత

Submitted by arun on Tue, 07/31/2018 - 12:40

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో తెలుగుదేశం పార్టీ నేత వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త బుర్రా అనిల్(అనుబాబు) సోమవారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లేనందునే టీడీపీని వీడినట్లు ఆయన ప్రకటించారు. తాను టిక్కెట్ ఆశించి పార్టీ మారడం లేదని, వైసీపీలో టిక్కెట్ ఎవరికి ఇచ్చినా తాను పార్టీ విజయానికి కృషి చేస్తానని ఆయన ప్రకటించారు.

జగన్ ఇంటి ఆడపడుచులను వివాదంలోకి లాక్కండి: పవన్

Submitted by arun on Thu, 07/26/2018 - 10:12

తనపై జగన్ చేసిన వ్యక్తిగత వ్యా‍ఖ్యలపై మరోసారి పవన్ కల్యాణ్ స్పందించారు. జగన్ వ్యా‍ఖ్యలు తన అభిమానులను, జనసైనికులను బాధించాయన్న పవన్‌ ఈ వివాదాన్ని ఇక్కడితే ఆపేయాలని కోరారు. ఈ వివాదంలోకి జగన్‌ కుటుంబసభ్యులను కానీ, ఆ ఇంటి ఆడపడుచులను కానీ వివాదంలోకి  లాగొద్దని జనసేన నేతలకు, కార్యకర్తలకు సూచించారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ విభేదాల్లేవన్న జనసేనాని రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లబోనన్నారు. కేవలం విధివిధానాలపైనే పార్టీలతో విభేదిస్తానన్నారు. 

వైసీపీపై మండిపడ్డ మంత్రి నక్కా ఆనందబాబు

Submitted by arun on Wed, 07/18/2018 - 13:07

వైసీపీ ఎంపీల రాజీనామాల నాటకాలు పార్లమెంటు సమావేశాల్లో బట్టబయలు అవుతాయని, మోదీకి భయపడి పార్లమెంట్ మెట్లు ఎక్కడానికి వైసీపీ నేతలు భయపడుతున్నారని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. మోడీతో లాలుచి రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులు ముందుగానే రాజీనామాలు చేశారని, సాధారణ ఎన్నికలకు వచ్చే దమ్ము, దైర్యం ఉందా అంటు ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. బుధవారం గుంటూరు జిల్లాలో ట్రైకార్ పథకం ఎస్సీ లబ్దిదారులకు ఇన్నోవా కార్లను మంత్రి అందజేశారు.

Tags

జగన్ కు బీజేపీ బంపర్ ఆఫర్

Submitted by arun on Mon, 07/16/2018 - 11:27

కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. ఏపీ రాజకీయాలపై సంచలన కామెంట్లు చేశారు. వైసీపీ అధినేత జగన్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. తమతో కలిసి వస్తే జగన్‌ సీఎం అయ్యేందుకు సహకరిస్తామన్నారు. ప్రత్యేక హోదా విషయాన్ని తాను మోడీ, అమిత్‌ షాతో మాట్లాడతానని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్డీయే నుంచి వైదొలిగే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని రాందాస్‌ చెప్పుకొచ్చారు. కొనసాగి ఉంటే ప్రధాని మోడీ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేదని అన్నారు. 


 

వైసీపీలో ఏం జరుగుతోంది...కలసి పనిచేసేది లేదంటున్న...

Submitted by arun on Wed, 07/11/2018 - 11:32

ముందస్తు ఊహాగానాలతో ఫ్యాన్ స్పీడ్ పెరిగిపోతోంది. అధినేత పాదయాత్రలతో హల్ చల్ చేస్తుంటే ఫ్యాన్ గాలికి ఆకర్షితులై చేరికలూ ఎక్కువవుతున్నాయి. మాజీ మంత్రులు, సీనియర్లు ఇప్పుడు ఫ్యాన్ గాలికి ఫిదా అవుతున్నారు అయితే ఇప్పటికే ఫ్యాన్ గూట్లో ఉన్న వారు మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నారు.. అసలు వైసిపిలో ఏం జరుగుతోంది?

అందుకే వైసీపీని వీడి.. టీడీపీలో చేరా.. : బుట్టా రేణుక

Submitted by arun on Wed, 07/11/2018 - 11:07

కేంద్రప్రభుత్వం.. హోదా విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్‌ విషయంలో రాష్ట్ర ప్రజలను భాజపా అవమానిస్తోందని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి కర్నూలు ఎంపీగా ఆమె గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా.. తర్వాత ఆమె చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. తాజాగా.. తాను పార్టీ మారడానికి గల కారణాలను ఆమె వివరించారు. కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందువల్లే ఆ పార్టీకి దూరమయ్యానని ఆమె వెల్లడించారు.

ఈనెల 7న జగన్‌ సమక్షంలో పార్టీలో చేరనున్న సిద్ధార్ధ్‌ రెడ్డి

Submitted by arun on Fri, 07/06/2018 - 14:20

ఇటీవల కాలంలో వైసీపీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్ద్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి కోరికే మేరకు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు సిద్ధార్ధ్‌ రెడ్డి తెలిపారు. ఈనెల 7వ తేదిన వైఎస్‌ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

సీనియర్ టీడీపీ నేత కుమారుడు వైసీపీలోకి !

Submitted by arun on Fri, 06/29/2018 - 13:46

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు నవీన్ వైసీపీలో చేరనున్నారు. వైసీపీ నేత, ఉండి ఎమ్మెల్యే సర్రాజు ఆయనతో జరిపిన మంతనాలు సఫలీకృతమయ్యాయి. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని... వైసీపీలోకి రావాలంటూ సర్రాజు ఆహ్వానించడంతో... నవీన్ అంగీకరించారు. త్వరలోనే పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వాస్తవానికి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నారాయణస్వామి రాజకీయ జీవితం గడుపుతున్నారు. అప్ప ట్లోనే జడ్పీ చైర్మన్‌గా ఆయన తిరుగులేని నాయకత్వ పటిమ ప్రదర్శించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నందున నారాయణస్వామి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎనలేని గౌరవం.

Tags

వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఆమోదం...ఆసక్తికరంగా మారిన ఉపఎన్నికల అంశం

Submitted by arun on Fri, 06/22/2018 - 10:35

ఎట్టకేలకు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. గత ఎప్రిల్‌లో చేసిన రాజీనామాలకు.. ఇప్పుడు రాజముద్ర పడింది. దీనికి సంబంధించిన బులిటెన్‌ను.. లోక్‌సభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసింది. మరి వీరి రాజీనామాలతో ఖాళీ అయిన 5 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలకు అవకాశం ఉందా..? అసలు  ప్రజా ప్రాతినిద్య చట్టం ఏం చెబుతోంది..?