bangalore

పెళ్లి వేడుకలో మహిళకు చేదు అనుభం

Submitted by chandram on Fri, 11/16/2018 - 14:33

బెంగళూరులోని ఓ పెళ్లి వివాహ వేడుకలో నిమగ్నమైన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కళ్యాణమండపం వద్ద నిలుచోని బంధువువుతో ముచ్చటిస్తున్న మహిళను గమనించిన దుండగుడు ఇదే సరైనా సమయం అనుకున్నాడేమో పక్కన ఉన్న మహిళాను తోసేసి బాధితురాలి మేడలోంచి గొలుసు లాక్కేళ్లడు దింతో మహిళ దుండుగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇంతలోనే దొంగ పరిపోయాడు. దింతో మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రోడ్డుపై ఇద్దరు భర్తల బాహాబాహీ...భార్య మూడో వ్యక్తితో లేచిపోయింది...

Submitted by arun on Tue, 08/07/2018 - 11:34

ఓ మహిళ తన భార్య అంటే తన భార్యే అంటూ రోడ్డుపైనే కొట్టుకోవడం చూసిన ఇద్దరు భర్తల ముద్దుల భార్యామణి...ఇద్దరికీ షాక్ ఇచ్చి మూడో వ్యక్తితో లేచిపోయిన విచిత్ర ఘటన బెంగళూరు నగరంలో సంచలనం రేపింది. బెంగళూరు శివారు ప్రాంతానికి చెందిన రంగస్వామి అనే వ్యక్తితో ఈ కిలాడీ లేడీ శశికళకు 2010లో వివాహయ్యింది. కొద్ది రోజులు కాపురం సాఫీగా సాగిపోగా.. తర్వాత కుటుంబ కలహాలతో భర్తను విడిచి వెళ్లింది. తర్వాత నగరంలోని గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే రమేష్‌కుమార్‌తో ఆమె సహజీవనం చేసింది. 2015లో అతడ్ని వదిలేసి కుమార్ అనే మరో వ్యక్తిని బుట్టలో వేసుకుంది. అతడి దగ్గర కూడా ఆరు నెలలు గడిపిన శశికళ మళ్లీ హ్యాండిచ్చింది.

ఆఫీసుకు గుర్రంపై వెళ్లిన ఉద్యోగి

Submitted by arun on Sat, 06/16/2018 - 12:27

చేసినన్ని రోజులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. చివరికి మానేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ.. ఉద్యోగం చేసినన్ని రోజులు.. గంటలకు గంటలు ట్రాఫిక్‌లో వెయిట్ చేసి.. చేసి.. ఆఫీస్‌కు వెళ్లేవాడు. చివరికి.. చిర్రెత్తుకొచ్చింది అతనికి. ఫైనల్‌గా ఉద్యోగం మానేయాలని డిసైడ్ అయ్యాడు. ఆఖరి రోజు మాత్రం.. ఆఫీస్‌కు గుర్రంపై వెళ్లి.. అందరూ అవాక్కయ్యేలా తన నిరసన తెలియజేశాడు. చూశారుగా.. ఇన్‌షర్ట్ చేసుకొని.. టై కట్టుకొని.. చక్కగా బ్యాగ్ తగిలించుకొని.. ఎంచక్కా గుర్రంపై ఆఫీసుకొచ్చేశాడు ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. రోజూ ట్రాఫిక్‌లో గంటలకు గంటలు వెయిట్ చేసి.. చేసి.. చిర్రెత్తుకొచ్చింది.

కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి ఊహించని అడ్డంకి!

Submitted by arun on Wed, 05/23/2018 - 15:51

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఈ సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం విధానసౌధ ముందు ఓ భారీ వేదికను ఏర్పాటు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, శరద్ పవార్, కేజ్రీవాల్, మాయావతి, అఖిలేష్ యాదవ్ లాంటి ఎందరో ప్రముఖులు తరలి వస్తుండటంతో భారీ ఎత్తున వేదికను రూపొందించారు.  కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో బెంగళూరులో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విధానసౌధ వద్ద ప్రమాణ స్వీకారం నిమిత్తం ఏర్పాటు చేసిన వేదిక వద్ద కూడా భారీగా వర్షం కురుస్తోంది. దీంతో ప్రమాణ స్వీకార కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

భర్త రేప్ చేశాడంటూ పోలీస్ స్టేషన్‌కు భార్య..

Submitted by arun on Sat, 03/17/2018 - 14:53

బెంగళూరు నగరంలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భర్త తనపై అత్యాచారం చేశాడంటూ ఓ భార్య పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బెంగళూరులోని బసవేశ్వరనగర ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. లక్ష కట్నం తెస్తేనే తనతో సంసారం చేస్తానని బెదిరించి తన భర్త తనపై అత్యాచారం చేశాడంటూ ఆమె చెబుతుంటే పోలీసులే కంగుతిన్నారు. వివరాల్లోకి వెళితే..ఆ మహిళకు, దేవ్‌కుమార్‌కు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. దేవ్‌కుమార్‌ ఒక ప్రవేటు సంస్థలో ఉద్యోగి. వీరికి పిల్లలు లేరు. వివాహమైన  నాలుగేళ్లు తరువాత భార్యాభర్తలు విడివిడిగా ఉన్నారు.

బెంగళూరు పార్కులో విషాద ఘటన

Submitted by lakshman on Thu, 09/21/2017 - 21:55

బెంగళూరు: నగరంలోని బన్నేర్‌ఘట్ట పార్కు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ తెల్లపులి చనిపోయింది. మరో తెల్ల పులి గాయపడింది. ఈ ఘటన రెండు రోజుల క్రితమే జరిగినా పార్కు సిబ్బంది గోప్యంగా ఉంచారు. అయితే ఈ ఘటన జరిగిన రోజు కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను నెట్‌లో పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్రేయాస్ అనే తెల్ల పులి పెద్ద పులులున్న బోనులోకి వెళ్లింది. దానితో పాటు మరో తెల్ల పులి కూడా ఉంది. రెండు పెద్ద పులులు వాటిపై దాడి చేశాయి. ఆ దాడిలో శ్రేయాస్ తీవ్రంగా గాయపడింది. అప్పటికీ దానిపై దాడి చేయబోతున్న పులులను అడ్డుకునే ప్రయత్నం చేసింది.