Porata Yatra

పవన్ వ్యూహంపై విశ్లేషకుల్లో నెలకొన్న ఆసక్తి

Submitted by arun on Sat, 07/14/2018 - 11:00

ఉత్తరాంధ్రలో పర్యటించి అక్కడి ప్రజల్లో జోష్ నింపిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇప్పుడు గోదావరి జిల్లాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో రెస్ట్‌లో ఉన్న పవన్ ఈ నెల 22 నుంచి తన యాత్రను తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించబోతున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన రాజకీయ పోరాట యాత్రను తిరిగి ప్రారంభించపోతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో యాత్రను పూర్తి చేసిన పవన్ నెక్ట్ గోదావరి జిల్లాల్లో యాత్ర కొనసాగించనున్నారు. 

పవన్ యాత్రను డిసైడ్ చేసిన జగన్.!

Submitted by arun on Thu, 07/12/2018 - 12:03

ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సాగుతుండగా, అదే జిల్లాలో తన యాత్రను తలపెట్టిన పవన్ ను పోలీసులు వారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో యాత్రను ముగించుకున్న పవన్ కల్యాణ్, తూర్పు గోదావరి జిల్లాలో యాత్రను ప్రారంభించాలని భావించి పోలీసులకు సమాచారం అందించాడు. జగన్ యాత్ర సాగుతున్నందున పూర్తి భద్రతను అందిచలేమని పోలీసులు స్పష్టం చేయడంతో, తన నిర్ణయాన్ని మార్చుకున్న పవన్, తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్రను తలపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుందని సమాచారం.

అందుకే జనసేన పార్టీ ఆవిర్భవించింది: పవన్‌ కల్యాణ్‌

Submitted by arun on Thu, 06/07/2018 - 15:57

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ప్రజా పోరాట యాత్ర విశాఖ మన్యం ప్రాంతంలో కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈ రోజు ఆయన పాడేరులో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తానేదో సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకే వచ్చానన్నారు. ఉత్తరాంధ్రలో గిరిజన సమస్యలను చూసి కడుపుమండడం వల్లే జనసేన పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. డిగ్రీలు పూర్తి చేసుకున్న యువతకు సరైన ఉపాధి మార్గాలు లేకపోవడంవల్లే పక్కదారి పడుతున్నారని అన్నారు. ఐటీడీఏ ఉపాధి మార్గాలు చూకపోవడం దారుణమని ఆరోపించారు.

పవన్ యాత్రకు బ్యాక్ టూ బ్యాక్ బ్రేక్‌లు

Submitted by arun on Wed, 06/06/2018 - 13:00

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్రతో జగన్‌ ఫుల్‌ స్పీడ్‌లో ఉంటే....జనసేనాని మాత్రం యాత్రకు బ్రేకులు వేస్తున్నారు. ఇది ఇప్పుడు జనసేన హాట్‌ టాపిక్‌గా మారింది. పూర్తి స్థాయిల్లో ప్రజల్లోకి వెళ్లాలని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నా...అందుకు పార్టీ కేడర్‌ మాత్రం సహకరించడం లేదని వాదనలు వినిపిస్తున్నాయ్.