tadipatri

పందుల పందెం

Submitted by arun on Sun, 01/14/2018 - 15:01

అనంతపురం జిల్లాలో వెరైటీ పందాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాడిపత్రిలో కోడి పందాలకు ధీటుగా పందుల పందాలు నిర్వహించారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పందుల పోటీలు ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది సంక్రాంతికి పందుల పోటీలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. వెరైటీ పోటీలను స్థానికులు బాగా ఎంజాయ్‌ చేశారు. 
 

ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా: జేసీ

Submitted by lakshman on Thu, 09/21/2017 - 17:50

అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. తన రాజీనామాను సోమవారం లోక్‌సభ స్పీకర్‌కు అందజేయనున్నట్లు జేసీ చెప్పారు. తాడిపత్రిలో నెలకొన్న నీటి కొరత సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యానని, అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నియోకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయని, అందువల్ల తాను ఎంపీనయ్యాక ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయానని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జేసీ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారోనని సర్వత్రా చర్చ జరుగుతోంది.