ys jagan

జగన్ బయోపిక్.. హీరో పాత్రలో సూర్య..

Submitted by arun on Mon, 03/19/2018 - 11:03

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ ల కాలం సాగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ కు రంగం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు దివంగత నేత వైఎస్ఆర్ బయోపిక్ కు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మలయాళీ నటుడు మమ్ముట్టిని వైఎస్ పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతలోనే మరో ఆశ్చర్యకరమైన ప్రచారం జోరందుకుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద సినిమా తియ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సోషల్ మీడియా తెగ కూసేస్తోంది. జగన్ బయోపిక్ కి పూనుకున్నదెవ్వరు..? ఎప్పుడు ఎక్కడ మొదలవుతుందన్న వివరాల కంటే ముందు.. యువనేత జగన్ పాత్ర ఎవరు వేయబోతున్నారన్న ముచ్చట మాత్రమే హల్చల్ చేస్తోంది.

అమ‌రావ‌తి మాస్ట‌ర్ ప్లాన్ పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు

Submitted by lakshman on Sun, 03/18/2018 - 23:17


ఏపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతుంది. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా మాట్లాడిన స‌భ నుంచి రోజుకో అంశంపై వేలెత్తి చూపించి ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. 
గుంటూరు స‌భ‌లో ప్ర‌భుత్వం ప‌నితీరు, అవినీతిపై ఆరోప‌ణ‌లు చేసిన పవ‌న్ ఏపీ రాజ‌ధాని ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌పై దృష్టిసారించారు. వాటిని ప‌రిష్కారం చేసే దిశాగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్‌ జగన్‌

Submitted by arun on Fri, 03/16/2018 - 13:44

అక్రమాస్తుల కేసుల విచారణలో భాగంగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం విచారణ జరుగుతున్న నేపధ్యంలో జగన్‌ పాదయాత్రకు విరామం ఇచ్చి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు నిమ్మగడ్డ ప్రసాద్‌, సబితా ఇంద్రారెడ్డి, బీపీ ఆచార్య తదితరులు కోర్టుకు హాజరయ్యారు. దాదాపుగా రెండు గంటల పాటు వారంతా కోర్టులోనే ఉన్నారు.

కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న వైఎస్ జ‌గ‌న్

Submitted by lakshman on Wed, 03/14/2018 - 03:47


బీజేపీ - వైసీపీ మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందాలు జ‌రుగుతున్నాయ‌నే విష‌యం తెలిసిందే. తాజాగా వైసీపీ ఎంపీలు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయ‌ల్ తో భేటీ అవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. 

టీడీపీ అవిశ్వాసం పెట్టినా వైసీపీ మద్దతిస్తుంది : జగన్

Submitted by arun on Thu, 03/08/2018 - 10:17

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చెయ్యాలని జగన్ డిమాండ్ చేశారు. అప్పుడే కేంద్రంపై ఒత్తిడి వస్తుందని అన్నారు. టీడీపీ కలసి వస్తే మార్చి 21 కి ముందు అవిశ్వాసం పెడదామని ప్రతిపాదించారు. వైసీపీ అవిశ్వాసానికి టీడీపీ మద్దతివ్వాలని లేదంటే టీడీపీ అవిశ్వాసం పెట్టినా వైసీపీ మద్దతిస్తుందని జగన్ ప్రకటించారు. 

ప్రజా ఒత్తిడికి తలొగ్గి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు : జగన్

Submitted by arun on Thu, 03/08/2018 - 10:09

కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలగాలన్న చంద్రబాబు నిర్ణయం ప్రజా విజయమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని  అరుణ్ జైట్లీ...మొదటి నుంచీ చెబుతున్నారనీ...కానీ చంద్రబాబే పూటకో మాట మాట్లాడారని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీతో ఏపీకి ఎంతో మేలు జరుగుతుందంటూ చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు శాలువాలు కప్పలేదా అని ప్రశ్నించారు. చివరికి వైసీపీ రాజీనామాల అల్టిమేటంతో పాటు..ప్రజా ఒత్తిడికి తలొగ్గి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మండి పడ్డారు.

జ‌గ‌న్ కేసు మోడీకి చుట్టుకుంటుందా?

Submitted by arun on Fri, 02/23/2018 - 16:27

అక్రమాస్తుల కేసు జగన్ మెడకు చుట్టుకుంటుందా? మోడీ మెడకు బిగుసుకుంటుందా? జగన్ కంపెనీల్లోకి విదేశీ కంపెనీల నుంచి భారీగా నిధులు వచ్చాయన్న ఆరోపణలతో పాటు ఇందూ టెక్‌ బాగోతంపై అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధానికి నోటీసులు పంపించింది. అసలేంటి? మారిషస్‌ సర్కార్‌ ఏకంగా ప్రధానికే నోటీసులు ఎందుకు ఇచ్చింది? జగన్‌ కేసుకు, మోడీకి లింకేంటి? జగన్‌, మోడీ మధ్యలో మారిషస్‌ అసలు కథేంటి? 

నీతికి ప్రతినిధి మోడీ ఐతే.. అవినీతికి ప్రతినిధి జగన్

Submitted by arun on Wed, 02/21/2018 - 17:29

నీతికి ప్రతినిధి మోడీ ఐతే.. అవినీతికి ప్రతినిధి జగన్ అన్నారు మంత్రి కామినేని. భవిష్యత్తులో.. బీజేపీ, వైసీపీ కలిసే చాన్సే లేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ విడిపోతే.. కొంతమంది లబ్ధి పొందేందుకు చూస్తున్నారని ఆయన చెప్పారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో.. బీజేపీ, టీడీపీ కలిసి పనిచేస్తాయన్నారు. నీతి, నిజాయితీకి మోదీ ప్రతిరూపమైతే...అవినీతి, అరాచకాలకు జగన్ అన్నారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన జగన్‌తో చేతులు కలిపే యోచన తమ పార్టీ జాతీయ నాయకత్వం చేయలేదన్నారు.