Ranbir Kapoor

రణబీర్ కపూర్ పాకెట్ మనీ

Submitted by arun on Mon, 10/08/2018 - 11:51

మన సినిమా ఇండస్ట్రీ లో రకరకాల నమ్మకాలూ వుంటాయి.. అయితే.. కొద్ది మంది హింది హీరోలు తమ పాత అలవాట్లను అలాగే ఇప్పటికి కొనసాగిస్తూ వుంటారు... హింది టాప్ హీరో అయిన.. రణబీర్ కపూర్ తన తల్లి నీతు కపూర్ నుంచి తన పాకెట్ మనీ కోసం.. ఇప్పటికి ...వారానికి 1500 రూపాయలు తీసుకుంటాడట. అమ్మ చేతితో ఏది ఇచ్చిన అది కోట్లతో సమానమని గుర్తిన్చినట్టునాడు.. మన రణబీర్ కపూర్. శ్రీ.కో.
 

రణబీర్ నాకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.. అందుకే దూరమయ్యా: దీపికా

Submitted by arun on Wed, 07/25/2018 - 14:12

బాలీవుడ్ లో ప్రేమలు, బ్రేకప్ లు సర్వసాధారణం. కానీ అక్కడి మీడియా మాత్రం ఈ విషయాలపై దృష్టి ఎక్కువగా పెడుతుంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గతంలో సోనమ్ కపూర్, కత్రినా కైఫ్, దీపికా పడుకొనే ఇలా చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడు. ప్రస్తుతం అతడు అలియా భట్ తో సన్నిహితంగా మెలుగుతూ కనిపిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం దీపికా-రణబీర్ ల గురించి పలు వార్తలు వచ్చాయి. ఆమె ఏకంగా రణబీర్ కపూర్ పేరుని రెండు అక్షరాలుగా పచ్చబొట్టు కూడా వేయించుకుంది. అంతగా ప్రేమించుకున్న జంట సడెన్ గా విడిపోయారు. బ్రేకప్ అయిన తరువాత చాలా సార్లు ఆమె రణబీర్ విమర్శలు చేసింది.

‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేసిన సంజు

Submitted by arun on Mon, 07/02/2018 - 16:49

బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధానపాత్రలో సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘సంజు’ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా అన్ని హిందీ బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డ్‌లను తుడిచిపెట్టేసింది. అంతేకాదు సంజు బయోపిక్ బాహుబలి 2 గ్రాస్ రికార్డ్‌ను కూడా రూ.46.71కోట్ల వసూళ్లతో ఆదివారం బీట్ చేసేసింది. అంతకు ముందు ఆ రికార్డు రూ.46.50 కోట్లతో బాహుబలి-2(హిందీ వర్షన్‌) పేరిట ఉంది. పాపులర్ ట్రేడ్ అనలిస్ట్ అంచనా ప్రకారం సంజు ఆదివారం రూ.46.71 కోట్లను కలెక్ట్ చేసింది. శుక్రవారం రూ.34.75కోట్లు, శనివారం 38.60 కోట్లతో తొలి మూడు రోజుల్లో రూ.120.06కోట్లను కలెక్ట్ చేసింది.

అవును.. ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డాను!

Submitted by arun on Thu, 05/31/2018 - 15:51

ఇది వరకూ బాలీవుడ్‌లో ప్రేమకథలను నడిపిన నేపథ్యం ఉంది రణ్‌బీర్ కపూర్‌కు. సినిమాల్లోనే కాదు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్‌లో కూడా ఇతడు లవర్ బాయ్‌గా పేరు పొందాడు. ప్రత్యేకించి కత్రినాకైఫ్‌తో రణ్‌బీర్ ప్రేమకథ చాన్నాళ్ల పాటే సాగింది. కత్రినాతో కొన్నాళ్లు సహజీవనం కూడా చేశాడు రణ్‌బీర్. వీళ్లిద్దరూ కలిసి ఉండేవారు, కలిసి విహరించారు కూడా. ఒక దశలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. దానికి ఇంట్లో వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో ఒక విదేశీ సముద్ర తీరంలో కత్రినా, రణ్‌బీర్ సన్నిహితంగా ఉండిన పొటోలు బయటకు వచ్చాయి.