baahubali

టుస్సాడ్స్ మ్యూజియంలో ‘కట్టప్ప’ విగ్రహం

Submitted by arun on Mon, 03/12/2018 - 14:54

బాహుబలి కట్టప్ప సత్యరాజ్.. అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత టుస్సాడ్స్ మ్యూజియంలో.. ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. సినిమాల్లో చేసిన కృషికి గాను.. ఇలా గౌరవిస్తున్నారు. ఈ విషయంపై.. ఈ మధ్యే సత్యరాజ్ కు అధికారిక సమాచారం కూడా అందింది. ఇంతటి గుర్తింపు రావడంలో.. కట్టప్ప క్యారెక్టర్ కూడా కీలక పాత్ర పోషించిందని సత్యరాజ్ ఆనందం వెలిబుచ్చినట్టుగా తెలుస్తోంది.

బాగా వెన‌క‌బ‌డిపోతున్న ప్ర‌భాస్

Submitted by arun on Thu, 01/11/2018 - 16:19

డార్లింగ్ ప్రభాస్.. తొటి స్టార్ హీరోలతో పోల్చుకుంటే బాగా వెనకబడి పోయాడు. కనీసం వాళ్లను రీచ్ కూడా కావడం లేదు. అదేంటి ప్రభాస్ బాహుబలితో రికార్డులు స్రుష్టిస్తే వెకబడిపోయాడు అంటారేంటి అనుకుంటున్నారా. అవును రికార్డుల విషయం పక్కనపెడితే...సినిమాల విషయంలో మాత్రం ప్రభాస్ బాగా స్లో అయ్యాడు. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనమైయ్యాడు. దీంతో ఫ్యాన్స్ ప్రభాస్ ను తిట్టుకుంటున్నారు.

మ‌హాభార‌తం కంటే బాహుబ‌లి బెట‌ర్

Submitted by arun on Sun, 01/07/2018 - 15:17

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ బాహుబ‌లి పై ఉన్న అభిప్రాయాన్ని బ‌య‌ట‌పెట్టేశాడు. అంతేకాదు మ‌హాభారతం సినిమా తీయడం కంటే  బాహుబలి లాంటి సినిమా తీయడం ఉత్తమం అని అన్నారు.  సైఫ్ హీరోగా క‌ళాకాండి అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తై సెన్సార్ చేతిలో  72 కట్స్  ప‌డింది.  దీంతో ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన సైఫ్ సింగిల్ కట్ తో సినిమాను పాస్ చేయించుకున్నాడు. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డ్ పై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సైఫ్ సెన్సార్ బోర్డు లో రాజకీయ ప్రమేయం ఎక్కువైందని సూచించారు. ఇలాంటి టైమ్ లో మహాభారతం తీసేకంటే బాహుబలి లాంటి సినిమాలు తీయడం బెటర్.

మ‌రో రీమేక్‌లో సుదీప్‌

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 12:33

'ఈగ' చిత్రంలో విల‌న్‌గా ఆక‌ట్టుకున్న క‌న్న‌డ న‌టుడు సుదీప్‌. క‌న్న‌డ చిత్రాల్లో హీరోగా న‌టించే సుదీప్ తాజాగా ఓ రీమేక్‌లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మిళంలో ఇటీవ‌ల విడుద‌లై విజ‌యం సాధించిన 'విక్ర‌మ్ వేద' ఆధారంగా ఈ క‌న్న‌డ  సినిమా తెర‌కెక్క‌నుంది. మాధ‌వ‌న్‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాని తెలుగులోనూ రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.