anushka sharma

ముంబై చెత్త వివాదంలో విరుష్క జోడీ

Submitted by arun on Mon, 06/18/2018 - 18:01

భారత సెలెబ్రిటీ జోడీ అనుష్కశర్మ- విరాట్ కొహ్లీ...ఓ చెత్త వివాదంలో చిక్కుకొన్నారు. లగ్జరీ కారులో ప్రయాణం చేస్తూ ముంబై రోడ్డుపై చెత్తవేసిన ఓ యువకుడిని అనుష్క మందలించడం దానిని వీడియో తీసి విరాట్ కొహ్లీ నెట్ లో పోస్ట్ చేయటం పట్ల మిశ్రమస్పందన వ్యక్తమయ్యింది. చివరకు అనుష్క పరిస్థితి తిట్టబోయి తిట్లుతిన్నట్లుగా తయారయ్యింది.

కోహ్లీని భ‌య‌పెట్టిన అనుష్క‌

Submitted by lakshman on Fri, 03/02/2018 - 15:39

హారర్ సినిమా అంటే ఇలా ఉంటుందనే సినిమాటిక్ ప్రిన్స్‌పుల్స్‌ని బ్రేక్ చేస్తోంది అనుష్క.  'పారీ'. టీజర్స్‌తోనే ఈ సినిమా హాలీవుడ్ స్టైల్లో భయాన్నిపీక్స్‌లో చూపించింది. అయితే పారీ ఇవ్వాళ విడుద‌ల కానున్న సంద‌ర్భంగా ఆ సినిమా చూసిన ఆమె భ‌ర్త విరాట్ కోహ్లీ తెగ‌భ‌య‌ప‌డిపోయాడు. ఇదే విష‌యాన్ని నెటిజ‌న్ల‌తో షేర్ చేశారు. 

విరాట్‌ కోసం మామగారి కానుక!

Submitted by arun on Fri, 02/09/2018 - 16:07

సుమారు రెండు నెలల క్రితం భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌​ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటనలో బిజీగా ఉండగా, అనుష్క తన సినిమా పనుల్లో హడావుడిగా ఉంది. ఇదిలా ఉంచితే, అనుష్క తండ్రి అజయ్‌ కుమార్‌.. తన అల్లుడు కోహ్లికి ఒక ప్రత్యేకమైన కానుక ఇచ్చారు. విరాట్‌కి కవితలంటే చాలా ఇష్టం. అందుకని.. ప్రముఖ రచయిత్రి తేజశ్విని దివ్యా నాయక్‌ రచించిన ‘స్మోక్స్‌ అండ్‌ విస్కీ’ అనే పుస్తకాన్ని అజయ్‌ విరాట్‌కి కానుకగా ఇచ్చారు. గురువారం ముంబయిలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కోహ్లి సెంచరీకి అనుష్క ఫిదా

Submitted by arun on Fri, 02/02/2018 - 17:53

వన్డే క్రికెట్ టాప్ ర్యాంకర్ సౌతాఫ్రికాతో ఆరుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. డర్బన్ కింగ్స్ మీడ్ వేదికగా ముగిసిన తొలివన్డేలో అజింక్యా రహానేతో కలసి తనజట్టుకు 6 వికెట్ల అలవోక విజయం అందించాడు. కొహ్లీ 119 బాల్స్ లో 10 బౌండ్రీలతో 112 పరుగులు సాధించాడు. తన వన్డే కెరియర్ లో 203వ మ్యాచ్ లో విరాట్ 33వ శతకంతో ఈ ఘనత సాధించాడు. క‌ఠిన‌మైన డ‌ర్బ‌న్ పిచ్‌పై అద్భుత‌మైన ఆటతీరుతో కోహ్లీ అంద‌ర్నీ ఆకట్టుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌కు అన్నివైపుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ప్రముఖులు కూడా ట్విట‌ర్ ద్వారా కోహ్లీకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

భారత్‌లో మరోసారి ‘విరుష్క’ వివాహం?

Submitted by arun on Sun, 01/14/2018 - 10:55

మొన్నామధ్యే ఇటలీలో విరాట్ కోహ్లీ, అనుష్కలు పెళ్లి చేసుకుకుని, ఇండియాలో ఘనంగా విందు కూడా ఇచ్చారుగా? వీరి మధ్య మళ్లీ పెళ్లేంటని అనుకుంటున్నారా? నిజమేనంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇటలీలో పెళ్లి చేసుకోవడంతో, వీరికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించినట్టు సమాచారం. దీంతో పెళ్లి ధ్రువీకరణ కోసం వీరు ఇండియాలో మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. ఇటలీలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత సామాజిక మాధ్యమాల ద్వారా తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తరువాత దిల్లీ, ముంబయిలో వివాహ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రధాని మోడీని కలిసిన విరుష్క జంట

Submitted by arun on Thu, 12/21/2017 - 11:13

విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ప్రధానమంత్రి నరేంద్రమోడీని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు ఢిల్లీలో జరిగే రిసెప్షన్‌కు హాజరవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విరుష్క జోడీకి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కోహ్లీ-అనుష్కశర్మలు ఈనెల 11న ఇటలీలోని టస్కనీలో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. హనీమూన్ అనంతరం భారత్‌కు చేరుకున్న కొత్త దంపతులు మోదీని కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానించారు. నేడు ఢిల్లీలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు కోహ్లీ దంపతులు విందు ఇవ్వనుండగా, ఈనెల 26న ముంబైలో బాలీవుడ్ ప్రముఖులకు, క్రికెటర్లకు విందు ఏర్పాటు చేశారు.

రేపే విరుష్క వెడ్డింగ్ రిసెప్షన్

Submitted by arun on Wed, 12/20/2017 - 17:23

భారత సెలిబ్రిటీ కొత్తజంట విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ న్యూఢిల్లీ వేదికగా తమ వివాహ తొలివిందుకు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రేపు జరిగే ఈ విందులో ఢిల్లీ క్రికెట్ వర్గాలతో పాటు విరుష్కల బంధువులు, స్నేహితులు పాల్గొనబోతున్నారు. ఇటలీలోని టస్కనీలో ఇటీవలే పెళ్లివేడుకలు, యూరోప్ లోని శీతాకాల విడిది కేంద్రాలలో హానీమూన్ జరుపుకొన్న విరుష్కజంట ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే తమ తాజా ఫోటోని ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు చేర్చారు. అంతేకాదు ముంబైలోని బాలీవుడ్, క్రికెట్ వర్గాల కోసం ఈనెల 26న విరుష్క జోడీ మరోసారి వివాహవిందును ఏర్పాటు చేయబోతున్నారు.
 

5 ఏళ్ల త‌రువాత‌..

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 12:16

షారుఖ్ ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, అనుష్మ శ‌ర్మ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'జ‌బ్ త‌క్ హై జాన్‌'. ఐదేళ్ల క్రితం విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు య‌శ్ చోప్రా రూపొందించిన చివ‌రి చిత్రం ఇది. మ‌ళ్లీ షారుఖ్‌, క‌త్రినా, అనుష్క కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతోంది. 'త‌ను వెడ్స్ మ‌ను', 'త‌ను వెడ్స్ మ‌ను రిట‌ర్న్స్' వంటి హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.