parupalli kashyap

గ్రాండ్‌గా సైనా, కశ్యప్‌ రిసెప్షన్

Submitted by arun on Mon, 12/17/2018 - 10:28

బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సైనా నెహ్వాల్‌ పారుపల్లి కశ్యప్‌ల మ్యారేజ్‌ రిసెప్షన్ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. సినీ, రాజకీయ, పోలీసు, క్రీడా ప్రముఖుల మధ్య విందు కార్యక్రమం కన్నులపండువగా సాగింది. నోవాటెల్‌లో జరిగిన ఈ వేడుకల్లో టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దానం నాగేందర్‌, పురందేశ్వరి తదితరులు హాజరయ్యారు. అక్కినేని నాగార్జున అమల దంపతులు, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హీరో సుధీర్‌బాబు, కల్యాణ్‌ శ్రీజ దంపతులు ఈవెంట్‌కు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. రాచకొండ పోలీసు కమిషనర్లతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

‘నా జీవితంలో ఇదే గొప్ప మ్యాచ్‌’

Submitted by arun on Sat, 12/15/2018 - 10:31

పదేళ్లుగా ప్రేమించుకున్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని సైనా నివాసంలో కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత ఆప్తుల మధ్య వీరిద్దరూ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరి వివాహ వేడుకకు ముఖ్య అతిథులుగా గవర్నర్‌ దంపతులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కామన్వెల్త్‌ గోల్డ్‌ మెడలిస్టులు పారుపల్లి కష్యప్‌, సైనా నెహ్వాల్‌ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంది. సైనా నివాసంలో జరిగిన ఈ వేడుక దగ్గరి బంధువులు, ఆత్మీయుల మధ్య నిరాడంబరంగా జరిగింది. 

పెళ్లి డేట్‌ కన్ఫామ్‌ చేసిన సైనా

Submitted by arun on Mon, 10/08/2018 - 15:30

కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ తో గత 11 సంవత్సరాలుగా తాను ప్రేమలో ఉన్నట్లు భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ ప్రకటించింది. డిసెంబర్ 19నే తమ వివాహమని తెలిపింది. 32 ఏళ్ల కశ్యప్, 28 ఏళ్ల సైనా 2005 నుంచి గోపీచంద్ అకాడమీలో కలసి శిక్షణ పొందటమే కాదు భారత జట్టులో సభ్యులుగా వివిధ టోర్నీల్లో పాల్గొంటూ వస్తున్నారు. 2007 నుంచి తాము కలసి మెలసి తిరుగుతున్న విషయం తమ తల్లితండ్రులకు తెలుసని సైనా చెప్పింది. క్రీడాకారులుగా తమతమ లక్ష్యాలు సాధించడం కోసమే వివాహాన్ని వాయిదా వేసుకొంటూ వచ్చామని పెళ్లికి తగిన సమయం వచ్చిందని సైనా వివరించింది.

హర్యానా అమ్మాయితో తెలుగు అబ్బాయికి ఇక ముడి

Submitted by arun on Thu, 09/27/2018 - 14:56

భారత బ్యాడ్మింటన్ జోడీ, గత పదిసంవత్సరాలుగా ప్రేమికులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ల వివాహానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఈ ఇద్దరు చాంపియన్ల జోడీ డిసెంబర్ 16 న ఒక్కటి కావాలని నిర్ణయించారు. హర్యానాలో జన్మించిన సైనా నెహ్వాల్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పారుపల్లి కశ్యప్ జూనియర్ స్థాయి నుంచి బ్యాడ్మింటన్ ఆడుతూ వస్తున్నారు. ఈ ఇద్దరికీ కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల, మహిళలసింగిల్స్ లో స్వర్ణ పతకాలు సాధించిన అరుదైన రికార్డు ఉంది. ఇద్దరూ గత దశాబ్దకాలంగా ప్రేమలో ఉన్నా ఇరు కుటుంబాల పెద్దల ఆమోదంతోనే పెళ్లికి సిద్ధమయ్యారు.

సైనా నెహ్వాల్, కశ్యప్ లు డేటింగ్ లో ఉన్నారా?

Submitted by arun on Tue, 05/29/2018 - 12:30

ఇండియన్ స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు ప్రేమలో ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అయితే, వీటిని నిజం చేయాలంటూ ఆ ఇద్దరినీ అభిమానులు కోరుతున్నారు. అభిమానులు ఇంతలా రెస్పాండ్‌ కావడానికి కారణం లేకపోలేదు! ఇటీవల హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్లో కశ్య్‌పతో కలిసి దిగిన ఫొటోను సైనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అయితే ఈ ఫొటో వైరల్‌గా మారడంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట్లో కామెంట్లు వెల్లువెత్తాయి. ‘ఇద్దరిదీ పర్‌ఫెక్ట్‌ జోడీ’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. ‘చూడ్డానికి చక్కగా ఉన్నారు.. డేటింగ్‌ వార్తలను నిజం చేయండి.. ప్లీజ్‌’ అంటూ మరొకరు..