are-you-whatsapp-admin-better-be-careful

వాట్సాప్ అడ్మిన్ లకు పోలీసులకు హెచ్చరిక!

Submitted by nanireddy on Mon, 05/28/2018 - 11:09

వాట్సాప్ అడ్మిన్ లకు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. వాట్సాప్ లో ఏదో ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాన్ని అలాగే వదిలేస్తుంటారు. ఇకపై అలాంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంటుందని  పొరపాటున కూడా క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ ను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్నేహితులతో గ్రూప్ చాటింగ్ కోసమో లేక కుటుంబసభ్యులతో సరదా ముచ్చట్ల కోసమో  వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తుంటారు. కాని రోజులకు దానిమీద ధ్యాస తగ్గి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ క్రమంలో గ్రూప్ క్రియేట్ చేసిన వ్యక్తి ఒక్కోసారి వేరే వారికీ అడ్మిన్ బ్యాగ్యతలు ఇచ్చి  తప్పుకుంటారు.