Rajkot

పెట్రోల్ బంక్‌లోకి దూసుకొచ్చిన కారు..

Submitted by arun on Wed, 06/13/2018 - 15:15

గుజరాత్‌ రాజ్‌కోట్‌‌లో ఓ కారు అలజడి రేపింది. రాజ్‌కోట్‌ కలవాడ్‌ రోడ్‌లోని ఓ పెట్రోల్‌ బంకులోకి దూసుకొచ్చిన కారు.... బీభత్సం సృష్టించింది. కారు స్పీడ్‌కి పెట్రోల్‌ పంప్‌... మొత్తం ఊడిపడింది. ఇక అక్కడే ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెట్రోల్ డిస్పెన్షర్‌తో పాటు ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
 

దారుణం : అఫైర్ లేదని మరిగే నూనెలో చేతులు పెట్టి నిరూపించుకోమంది..

Submitted by arun on Fri, 05/25/2018 - 17:48

భర్త మీద అనుమానంతో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. పక్కింటి అమ్మాయితో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ మహిళ మరిగే నూనెలో వారిద్దరి చేతులు పెట్టించింది. ఈ భయానకమైన ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాహుల్‌ పర్మార్‌, సుమన అనే దంపతులు రాజ్‌కోట్‌లోని భగవతిపారా ప్రాంతంలో నివశిస్తున్నారు. అయితే సుమనకు తమ పక్కిట్లో ఉండే ఓ యువతి(17)తో రాహుల్‌ వివాహేతర సంబంధం నడుపుతున్నారనే అనుమానం వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య అటువంటి సంబంధం ఏమీ లేదని నిరూపించుకోవడానికి బాగా మరుగుతున్న నూనెలో చేతులు పెట్టాలని కోరింది.