illegal affair

కాలేజీ అమ్మాయితో ఎమ్మెల్యే రాసలీలలు

Submitted by arun on Sat, 07/14/2018 - 13:12

‘ కట్టుకున్న భార్యను నేను వుండగానే ఆయన కాలేజీ చదువుతున్న 19 ఏళ్ళ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆమెను రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు’ అంటూ ఓ ఎమ్మెల్యే భార్య జమ్మూ కాశ్మీర్‌లో తన భర్త యవ్వారాన్ని ప్రెస్‌మీట్ పెట్టి మరీ రచ్చకీడ్చింది. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు జీజేపీ ఆర్ఎస్ పుర నియోజకవర్గ ఎమ్మెల్యే గగన్. ఆమె పేరు మోనికా శర్మ. జమ్మూ బీజేపీ మహిళా విభాగానికి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సిందిగా మోనిక అభ్యర్థించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి.. ‘‘నేను మీ కుటుంబంలోని కుమార్తెగా భావించి న్యాయం కోసం అభ్యర్థిస్తున్నా.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ భర్త.. తాట తీసిన భార్య!

Submitted by arun on Sat, 07/07/2018 - 13:51

వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు భార్య బుద్ధి చెప్పిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. కలెక్టరేట్‌లో ఏఓగా పనిచేస్తూ సస్పెండ్‌కు గురైన హరిప్రసాద్‌  గత కొద్ది కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న భార్య నిలదీయడంతో వేధించడం ప్రారంభించాడు.  నిన్న రాత్రి ఇంటికి రాకపోవడంతో విషయం గ్రహించిన భార్య   తల్లిదండ్రులతో కలిసి భర్త ఉన్న చోటుకు వెళ్లి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పారిపోయేందుకు ప్రయత్నించిన భర్తతో పాటు వివాహేతర సంబంధం సాగిస్తున్న మహిళకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.  

ఖాకీ’ రాసలీలలు గుట్టురట్టు...రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు

Submitted by arun on Thu, 06/21/2018 - 13:09

కానిస్టేబుల్‌ ఓ మహిళతో సాగిస్తున్న రాసలీలలు గుట్టురట్టయ్యాయి. కర్నూలు శివారులోని కోడుమూరు రోడ్డులోని రాజీవ్‌ గృహకల్పలోని మూడవ అంతస్థులో గదిని అద్దెకు తీసుకుని కోడుమూరు పట్టణానికి చెందిన మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం భర్తకు తెలిసింది. బుధవారం కానిస్టేబుల్‌ ఆన్‌డ్యూటీలోనే ఉంటూ కర్నూలుకు వచ్చి ఫోన్‌ చేసి మహిళను పిలిపించుకుని గదిలో ఉండగా ఇరుగుపొరుగు వారు గదికి తాళం వేసి బంధించి నాల్గవ పట్టణ పోలీసులకు పట్టించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ తప్పుడు వ్యవహారానికి పాల్పడటంపై కాలనీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

డబ్బులిస్తావా.. వీడియో నీ భర్తకు పంపమంటావా..?

Submitted by arun on Sat, 06/02/2018 - 12:17

ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగించి చిక్కుల్లో పడింది. ఓ కీచకుడు ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించి, ఆమెకు తెలియకుండా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆ వ్యక్తిపై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి జిల్లా, చౌటుప్పల్‌కు చెందిన వివాహిత, దిల్‌షుక్‌నగర్‌ పీ అండ్‌ టీ కాలనీలో భర్తతో కలిసి ఉంటోంది. అయిదు నెలల క్రితం ఇందిరానగర్‌కు చెందిన ఏవీ.సుబ్బారావు అనే వ్యక్తితో ఆమెకు ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సుబ్బారావు ఆమె వద్ద రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.

దారుణం : అఫైర్ లేదని మరిగే నూనెలో చేతులు పెట్టి నిరూపించుకోమంది..

Submitted by arun on Fri, 05/25/2018 - 17:48

భర్త మీద అనుమానంతో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. పక్కింటి అమ్మాయితో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ మహిళ మరిగే నూనెలో వారిద్దరి చేతులు పెట్టించింది. ఈ భయానకమైన ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాహుల్‌ పర్మార్‌, సుమన అనే దంపతులు రాజ్‌కోట్‌లోని భగవతిపారా ప్రాంతంలో నివశిస్తున్నారు. అయితే సుమనకు తమ పక్కిట్లో ఉండే ఓ యువతి(17)తో రాహుల్‌ వివాహేతర సంబంధం నడుపుతున్నారనే అనుమానం వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య అటువంటి సంబంధం ఏమీ లేదని నిరూపించుకోవడానికి బాగా మరుగుతున్న నూనెలో చేతులు పెట్టాలని కోరింది.

మరో ఖాకీ కామాంధుడు..వివాహిత‌తో ఎఫైర్‌‌ పెట్టుకున్న కానిస్టేబుల్‌

Submitted by arun on Mon, 01/29/2018 - 12:35

ఏసీబీ ఎఎస్పీ సునీతారెడ్డి సీఐ మల్లికార్జున రెడ్డి లవ్‌ ట్రాక్‌ మరిచిపోకముందే మరో కానిస్టేబుల్‌ ఓ వివాహితను ట్రాప్‌ చేశాడు.  మెఘల్‌పురాలో పనిచేస్తున్న సందీప్‌ ఫేస్‌బుక్‌లో పరిచమైన స్నేహాతో ఎఫైర్‌ నడిపాడు.  వీరి వ్యవహారం కాస్త  స్నేహా భర్త నాగరాజుకు తెలియడంతో శంషాబాద్‌ పోలీసులకు ఆశ్రయించాడు. అయితే నాగరాజుకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు పోలీసులు. కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించడంతో సాక్ష్యాధారాలతో పోలీసుల ముందు ఉంచాడు. దీంతో కానిస్టేబుల్‌ సందీప్‌తో పాటు స్నేహపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సందీప్‌ వ్యవహారంపై ఉన్నతాధికారులు  సిరీయస్‌గా ఉన్నారు. 

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆ కేసుతో వీరి లింకేంటి?

Submitted by arun on Thu, 01/25/2018 - 14:35

అవును. వాళ్లిద్దరూ పోలీసులు. ఖాకీ చొక్కా ధరించి, చేతిలా లాఠీపట్టి, సమాజంలో లా అండ్‌ ఆర్డర్‌ కంట్రోల్ చేసే రక్షకభటులు. దారితప్పినవాళ్లను తమదైన స్టైల్‌లో దారికి తెచ్చే ఖాకీలు. కానీ వాళ్లిద్దరూ దారి తప్పారు. నీతి తప్పారు. నైతికత తప్పారు. పక్కచూపులకు లొంగిపోయి, కుటుంబ జీవితాలను బజారుకీడ్చుకున్నారు. పోలీసు శాఖ పరువు తీశారు. ఖాకీ చొక్కాకున్న విలువతకు పాతరేశారు. ఔను. వాళ్లిద్దరూ ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లిఖార్జున్‌ రెడ్డి. మీడియా సాక్షిగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

నీతి తప్పిన పోలీసు అధికారులపై వేటు

Submitted by arun on Wed, 01/24/2018 - 10:52

అనైతిక వ్యవహారాలతో పోలీస్‌శాఖ పరువును బజారుకీడ్చిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. ఏసీబీ ఎఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డి కేసులో ఇద్దరిపైనా సస్పెన్షన్ వేటు పడింది. సురేంద్రరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట కల్వకుర్తి సీఐపై వేటు పడింది. తర్వాత వివాదస్పద వ్యవహారశైలితో పోలీస్ శాఖ పరువు తీశారని భావించిన ప్రభుత్వం సునీతారెడ్డిపై కూడా వేటు వేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదికను పోలీసులు, డీజీపీకి అందించారు. 

భర్త వివాహేతర సంబంధం భార్యాబిడ్డల..

Submitted by lakshman on Wed, 09/20/2017 - 20:53

కాగజ్‌నగర్: కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని సీతానగరం గ్రామంలో విషాద ఘటన జరిగింది. భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి మనస్తాపంతో 18నెలల కూతురికి ఉరి వేసి, తానూ ఉరేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లీబిడ్డా ఇద్దరూ మరణించారు. జయ బిస్వాస్‌(28), ప్రదీప్‌ భార్యాభర్తలు. వారికి కృషి అనే 18నెలల పాప ఉంది. ప్రదీప్ తాపీ పని చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే ప్రదీప్‌కు మరో మహిళ పరిచయమైంది. దాదాపు ఆరు నెలల నుంచి ఇద్దరూ సహ జీవనం చేస్తున్నారు. ఈ  విషయం జయకు తెలిసింది. భర్తను నిలదీసింది. భార్యపై కోపగించుకున్న ప్రదీప్...