murder

అన్న చేతిలో చెల్లెలు దారుణ హత్య

Submitted by arun on Wed, 10/03/2018 - 15:28

పొలం తనకు అమ్మలేదన్న కోపంతో ఓ అన్న,చెల్లిని నడిరోడ్డుపై నరికి చంపాడు. కలకలం రేపుతున్న ఈ ఘటన ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సొద రాధాకృష్ణమూర్తి, రాజారావు అన్నదమ్ములు. పెద్దవాడైన రాధాకృష్ణకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. రాజారావుకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాధాకృష్ణకు చెందిన ఎకరం పొలం విషయంలో ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం ఉంది. పొలం తనకే విక్రయించాలంటూ రాజారావు కుమారుడు సింగయ్య (40) గత కొంతకాలంగా పట్టుబడుతున్నాడు. ఇందుకు రాధాకృష్ణ నిరాకరించాడు. దీంతో ఆ పొలం మరెవరూ కొనకుండా అడ్డంకులు సృష్టించాడు.

పెళ్లి ఆపేందుకు నానమ్మ హత్య

Submitted by arun on Tue, 07/24/2018 - 15:15

మేడ్చల్‌ జిల్లా కీసరలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మానవతా విలువలు మరిచి సొంత మనవడే నాయనమ్మను మట్టుబెట్టినట్లు పోలీసులు తేల్చారు. తమ్ముడి పెళ్లిని ఆపేందుకే నిందితుడు శ్రీకాంత్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. 

ఉప్పల్‌లో దారుణం...సెల్‌ ఫోన్‌ కోసం స్నేహితుడి హత్య

Submitted by arun on Mon, 07/16/2018 - 15:14

హైదరాబాద్ ఉప్పల్‌లో దారుణం జరిగింది. సెల్‌ఫోన్ కోసం ఫ్రెండ్‌ను అతి దారుణంగా చంపేశాడు ఓ యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓల్డ్‌ రామాంత్‌పూర్‌కు చెందిన ప్రేమ్‌, సాగర్‌ మిత్రులు. ఇద్దరూ ఈ నెల 13న ఆడుకుంటున్న సమయంలో ప్రేమ్‌ వద్ద ఉన్న సెల్‌ ఫోన్‌ను సాగర్‌ చూశాడు. తనకి ఇవ్వమని కోరగా ప్రేమ్‌ నిరాకరించాడు. ఈక్రమంలో మరుసటి రోజు లాంగ్‌ డ్రైవ్‌ పేరుతో  ప్రేమ్‌ను తీసుకెళ్లిన సాగర్‌.. అతడిని కిడ్నాప్‌ చేశాడు. మొబైల్‌ ఫోన్‌ తీసుకుని.. ప్రేమ్‌ను ఆదిభట్ల ప్రాంతంలో పెట్రోల్‌ పోసి కాల్చేశాడు. ఆ మృతదేహాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి కేసును ఛేదించారు.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడ‌ని ప్రియుడితో క‌లిసి తండ్రిని చంపిన కూతురు

Submitted by arun on Thu, 07/12/2018 - 16:06

వివాహేతర సంబంధం వద్దంటూ అడ్డు తగులుతున్న తండ్రిని... ప్రియుడితో కలసి మట్టుబెట్టిందో కూతురు. ఈ దారుణ ఘటన కృష్ణాజిల్లా నూజివీడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిని లింగమనేని శేషుకుమారి భర్త 2011లో చనిపోయాడు. కుమారుడి చదువు కోసం ఆమె నూజివీడులోని తుమ్మలవారి వీధిలో అద్దెకు ఉంటోంది. ఆమె తండ్రి కూడా కుమార్తె వద్దే ఉంటూ ఓ హోటల్ లో పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గ్యాస్‌ స్టౌవ్‌ మెకానిక్‌ వేముల వెంకటేశ్వరరావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. శేషుకుమారి తండ్రి కాజా కృష్ణప్రసాద్‌ కుమార్తె వద్దే ఉంటూ నూజివీడులోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు.

Tags

భార్యను చంపి బాత్‌రూంలో పాతిపెట్టాడు

Submitted by arun on Mon, 06/18/2018 - 17:52

విజయనగరం జిల్లా వేంకంపేట గ్రామంలో రమణమ్మ అనే మహిళ మిస్సింగ్ మిస్టరీ వీడింది. భర్త నర్సయ్యే.. భార్యను చంపి బాత్రూంలో గోతి తీసి పాతిపెట్టాడు. రమణమ్మ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీయించారు. గతేడాది అక్టోబర్ 15 నుంచి రమణమ్మ కనిపించకుండా పోయింది. దీంతో.. ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమణమ్మ మిస్సింగ్ తర్వాత భర్త నర్సయ్య పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు అతడిని పట్టుకున్న పోలీసులు.. నిజం రాబట్టారు.

కన్నకూతురిపై అత్యాచారం..కోర్టులోనే భార్య హత్య

Submitted by arun on Sat, 06/16/2018 - 15:50

కన్నకూతురిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఓ మానవమృగం... తన భార్యను కోర్టు రూమ్‌లోనే దారుణంగా హతమార్చాడు. అస్సాంలోని దిబ్రుగఢ్ జిల్లా సెషన్స్ కోర్టు ఆవరణలో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. డిబ్రూగఢ్ డీఎస్‌పీ  ప్రదీప్‌ సైకియా అందించిన సమాచారం  ప్రకారం నిందితుడు పూర్ణ నహర్‌ డేకా  కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇటీవల బెయిల్‌ పై విడుదలయ్యాడు.  ఈ కేసులో ఫిర్యాదుదారుగా అతని భార్య   రీటా నహర్ దేకా కోర్టు హాజరైంది. అకస్మాత్తుగా  నిందితుడు భార్యపై దాడిచేశాడు. జేబులో నుంచి కత్తితీసి  గొంతు కోశాడు.  వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మరణించినట్లు  వైద్యులు ప్రకటించారన్నారు.

ఘోరం: మేనమమే కాలయముడై..

Submitted by arun on Sat, 06/16/2018 - 10:49

మేనమామే ఆ చిన్నారుల పాలిట కాలయముడయ్యాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కనికరం లేకుండా ప్రవర్తించాడు. స్వయాన అక్క బిడ్డలైన కవలలను దారుణంగా చంపేశాడు. ఈ కిరాతకానికి పాల్పడిన నిందితుడు తర్వాత మృతదేహాలను మాయం చేసేందుకు కారులో తరలిస్తుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.  సినిమా ట్విస్టులను తలపించే రీతిలో జరిగిన ఈ క్రైమ్‌స్టోరితో  హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

ఆమె చీరతో.. ఆమెకే ఉరి వేశారు.. ఆ తర్వాత కాళ్లను నరికేశారు..

Submitted by arun on Fri, 06/15/2018 - 11:04

ఆమె చీరతో.. ఆమెకే ఉరి వేశారు.. ఆ తర్వాత కాళ్లను నరికేశారు.. వాటిని తీసుకెళ్లి పక్కనే ఉన్న బిల్డింగ్ టెర్రస్‌పై పడేశారు. ఈ భయానక మర్డర్ జరిగింది ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే. అది కూడా.. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం ప్రాంగణంలోనే. మానసిక రోగులకు చికిత్స జరగాల్సిన చోట.. మర్డర్ ఎందుకు జరిగింది.? 

వరుసకు తమ్ముడైన భరత్‌తో వివాహేతర సంబంధం...

Submitted by arun on Mon, 06/04/2018 - 11:29

అనుమానం మూడు నిండు ప్రాణాలను బలిగొంది. తనతో సహజీవనం చేస్తున్న మహిళను అనుమానించిన వ్యక్తి ఆమెతోపాటు అతని కొడుకునీ హతమార్చాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఏఎస్పీ రాధిక, డీఎస్పీ సుబ్బారావు, సీఐ ఆదినారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మర్రిగుంట గ్రామానికి చెందిన పురుషోత్తంకు, గంగవరం మండలం కలవత్తూరుకు చెందిన వనిత(30)కు 12 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి కుమార్తె, కుమారుడు మహేంద్రన్‌ (7) ఉన్నారు. కుటుంబంలో ఏర్పడిన కలహాల కారణంగా నాలుగేళ్ల క్రితం పురుషోత్తం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.