jds

కర్నాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ హవా

Submitted by arun on Tue, 11/06/2018 - 16:23

కర్ణాటక ప్రజలు ఉప ఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికే జై కొట్టారు. కన్నడనాట బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ కంచుకోట శివమొగ్గలో తప్ప మిగతా నాలుగు చోట్ల కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సత్తా చాటింది. రికార్డు మెజార్టీతో సీఎం కుమారస్వామి భార్య గెలుపుతో కర్ణాటక ఉపఎన్నిల్లో బీజేపీకి చావుదెబ్బ పడింది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి వ్యూహం ముందు కాషాయపార్టీ కూలబడింది. మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలు సహా మొత్తం ఐదు స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నెగ్గాయి.

జేడీఎస్‌-కాంగ్రెస్‌ దోస్తీ కోసం రాహుల్‌ కుస్తీ

Submitted by santosh on Mon, 05/28/2018 - 11:48

కన్నడనాట జేడీఎస్‌, కాంగ్రెస్ మైత్రి దీర్ఘకాలం కొనసాగేందుకు హస్తం అధినేత రాహుల్ గాంధీ తీవ్ర స్ధాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు పార్టీలో ఉన్న అసంతృప్తులను చల్లారుస్తూనే ... జేడీఎస్‌తో మిత్రత్వం చెడకుండా సమన్వయంతో  రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్నారు. తాజాగా మంత్రి వర్గంలో చోటు కోసం ఎదురుచూస్తున్న  నేతలతో రాహుల్ స్వయంగా మాట్లాడి సమస్యను పరిష‌్కరించారు. 

బల పరీక్షకు ముందు కుమార స్వామికి భారీ షాక్

Submitted by arun on Fri, 05/25/2018 - 11:28

కర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఇరు పార్టీల ఎమ్మెల్యేలను కలిపితే కూటమి వద్ద 117 ఎమ్మెల్యేలున్నారు. స్పీకర్‌ ఎంపిక తర్వాత ఈ ఎన్నిక జరగనున్నందున సభలో ఉండే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా బలపరీక్షలో గెలిచేందుకు 111 మంది మద్దతు అవసరం. దీంతో చివరి నిమిషంలో రాజకీయాలు చోటుచేసుకుంటేతప్ప కూటమి సర్కారు ‘పరీక్ష’లో నెగ్గటం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. కుమారస్వామితో పాటు కాంగ్రెస్‌ నేతలు కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు.