karnataka-politica-updates

బిగ్ బ్రేకింగ్ : కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు వారికే అవకాశమిచ్చిన గవర్నర్

Submitted by nanireddy on Wed, 05/16/2018 - 21:03

కర్ణాటకలో అనుకున్నదే అయింది. రెండు రోజుల హడావుడికి రేపటితో తాత్కాలిక ఊరట లభించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా సింగల్ లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీ ని ఆదేశించారు గవర్నర్ వజూభాయ్..ఈ మేరకు బీజేపీ శాసనసభా పక్షనేత యడ్యూరప్పకు సమాచారమందించారు. దీంతో కాంగ్రెస్ , జేడీఎస్ పార్టీలు ఖంగుతిన్నాయి.. గవర్నర్‌ నిర్ణయంపై మండిపడ్డ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇదిలావుంటే గురువారం మధ్యాహ్నం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు యడ్డీ ప్రకటించడంతో బీజేపీ శ్రేణులు ప్రమాణస్వీకార ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ వద్దకు యెడ్డీ చేరుకోనున్నారు..