veteran-film-director-durga-nageswara-rao-passed-away

టాలీవుడ్ లో మరో విషాదం

Submitted by nanireddy on Wed, 05/16/2018 - 20:18

ఈ మధ్య కాలంలో సినీప్రముఖులు తమ అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చి వెళుతున్నారు.. మొన్నటికి మొన్న సీనియర్ యాక్టర్ అమృతం హనుమంతరావు మృతిచెందగా.. నేడు అలనాటి ప్రఖ్యాత దర్శకుడు దుర్గా నాగేశ్వరరావు కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్, రామాంతపూర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు..  దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన దేవుడే దిగివస్తే చిత్రానికి కో డైరెక్టర్ గా పనిచేశారు. దుర్గా నాగేశ్వరరావు సినిమా రంగంలోకి కాస్త ఆలస్యంగానే వచ్చారు. దాసరి శిష్యుల్లో దుర్గా నాగేశ్వరరావు కూడా ఒకరు. విజయబాపినీడు నిర్మాణ సారథ్యంలో 1979లో వచ్చిన విజయ చిత్రంతో దర్శకుడుగా మారారు.