ramana deekshithulu

రమణదీక్షితులపై కక్షపూరితంగా వ్యవహరించిందా టీటీడీ?

Submitted by santosh on Fri, 05/18/2018 - 11:08

టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల సస్పెన్షన్ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. తిరుమలలో జరుగుతున్న అగమశాస్త్ర విరుధ్ధ తంతుపై గళమెత్తిన రమణ దీక్షితులుకి అనుకూలంగా కొందరు..వ్యతిరేకంగా మరికొందరు విమర్శలు గుప్పించుకొంటున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ అయితే అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేస్తామని ప్రకటించారు. రమణ దీక్షితులుపై వేటు వేయడంపై ప్రధాన పార్టీలు కూడా విమర్శలు గుప్పించుకొంటున్నాయి. తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం తప్పుపట్టారు.

గోవిందుడు ఎవరి వాడు... ఏడుకొండలపై ఏంటీ వివాదాలు

Submitted by santosh on Wed, 05/16/2018 - 11:19

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలనానికి తెరలేపారు. ఏడుకొండలపై జరుగుతున్న శాస్త్ర విరుద్ధ పనులపై గళమెత్తారు. తిరుమల ఆలయంలో రాజకీయా నేతల పెత్తనం, అధికారుల అనాలోచిత చర్యలను ఎండగట్టారు. రాజకీయ నాయకులు ఆలయాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని వ్యాపార కేంద్రంగా మారుస్తున్నారన్నారని విమర్శలు గుప్పించారు. అనాదిగా స్వామివారిని తాకే శాస్త్రాధికారం, స్వామికి కైంకర్యాదనలు చేసే విధిలో ఉన్న తమ అర్చక వారసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధమ‌ని దీక్షితులు చెప్పారు.