kcr with employees union

కోటి ఆశల పల్లకి... ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ

Submitted by santosh on Wed, 05/16/2018 - 11:07

ఎన్నిక‌లు దగ్గర‌ప‌డుతున్న వేళ ఉద్యోగుల‌ను ప్రస‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డింది... తెలంగాణ స‌ర్కారు. ఉద్యోగ‌, ఉపాద్యాయ‌, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై దృష్టిసారించింది. మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం నివేధికను అధ్యయనం చేసిన సీఎం కేసీఆర్... ఇవాళ ఉద్యోగ సంఘాలతో సమావేశం కాబోతున్నారు. టీఆర్ఎస్ స‌ర్కార్ ఎంప్లాయిస్ ఫ్రెండ్లీదని ప్రక‌టించుకున్న సీఎం కేసీఆర్..గతంలో ఉద్యోగులు అడిగిన దానికంటే ఎక్కవ ఫిట్‌మెంట్ ఇచ్చి తనవైపు తిప్పుకున్నారు. బంగారు తెలంగాణ‌ నిర్మాణానికి క‌లిసిరావాల‌న్న ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఉద్యోగులు కూడా ఆయనకు సహకరిస్తూ వచ్చారు. కానీ రాను రాను ప‌రిస్థితులు మారిపోయాయి.