manipur plan in karnataka

గోవా, మణిపూర్‌ ప్లాన్‌ కర్ణాటకలో వర్కవుట్‌ అవుతుందా?

Submitted by santosh on Wed, 05/16/2018 - 10:55

కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ భారీ ప్రయత్నమే చేస్తోంది. గతంలో గోవాలో, మణిపూర్ లో అనుసరించిన వ్యూహాన్నే తిరిగి అమలు చేయాలనుకుంటోంది. నాడు ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అనుసరించిన వ్యూహంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2017 ఫిబ్రవరి 4న గోవా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ మొత్తం40 అసెంబ్లీ స్థానాలున్నాయి.  ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాల్లో మాత్రమే గెలిచింది. మరో వైపున 17 స్థానాల్లో   కాంగ్రెస్ గెలిచింది. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ 3 సీట్లను గెలుచుకుంది.  గోవా ఫార్వర్డ్ పార్టీ  3సీట్లలో విజయం సాధించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో గెలిచింది.