bjp target chandrababu

సీను మారింది... ప్లాన్‌ మారుతుందా? బీజేపీ టార్గెట్‌ బాబేనా?

Submitted by santosh on Wed, 05/16/2018 - 10:50

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకుండా హంగ్ ఏర్పడటంతో కర్ణాటక తర్వాత తమ నెక్స్ట్ టార్గెట్ ఏపినే అన్న బిజెపి ఏం చేస్తుంది? దక్షిణాదిన అడుగు పెట్టడం అంత ఈజీ కాదని కమలానికి తెలిసొచ్చిందా? కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపి పై దృష్టి పెడతామంటున్న బిజెపి ఇప్పుడేం చేస్తుంది?కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడంతో అందరి దృష్టి ఇప్పుడు ఏపిపై పడుతోంది. ఏపికి అన్యాయం చేసిన బిజెపిని చిత్తుగా ఓడించాలంటూ కర్ణాటకలో తెలుగు ఓటర్లకు ఏపి సిఎం చంద్రబాబు బాహాటంగా పిలుపు నిచ్చిన నేపధ్యంలో ఏపి రాజకీయాలపై ఆసక్తి పెరిగింది.