regional parties in india

జాతీయపార్టీల పతనమే ప్రాంతీయ పార్టీలకు పురుడుపోసిందా?

Submitted by santosh on Wed, 05/16/2018 - 10:40

తెలుగోడి ఆత్మగౌరవంతో ఎన్టీఆర్‌ ప్రభంజనం సృష్టించినా, కులాల సమీకరణలతో ఎస్పీ, బీఎస్పీ ఆవిర్భవించినా, అస్తిత్వ ఉద్యమాలతో ద్రవిడ పార్టీలు జయకేతనం ఎగురవేసినా, అది జాతీయ పార్టీల పతన పుణ్యమే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కన్పిస్తోంది. అదే ప్రత్యామ్నాయం లేదంటే మూడో కూటమికి ఆయువుపోస్తోంది. ఒకవైపు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభ తగ్గిపోతోంది. రాహుల్ నాయకత్వంలో ఒక్కోరాష్ట్రం హస్తం చేజారుతోంది. మరోవైపు బీజేపీ అసెంబ్లీ ఫలితాల్లో దుమ్మురేపుతున్నా, మోడీ వ్యతిరేక పవనాలతో లోక్‌సభ పోరులో ఓట్లు-సీట్లు తగ్గే ఛాన్సుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.