farmers

హెల్మెట్‌ పెట్టుకుని పొలం పనులు చేస్తున్న కూలీలు

Submitted by arun on Tue, 10/30/2018 - 11:00

బైక్‌లను నడిపించేటప్పుడు హెల్మెట్ ధరిస్తాం. ఎందుకంటే దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరిగినా అవి మన ప్రాణాన్ని కాపాడుతుంది. కానీ అవే హెల్మెట్లు ఇప్పుడు పంట చేలల్లో పనిచేసేవారికి ఉపయోగపడుతున్నాయి. వారి ప్రాణాలనూ రక్షిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న వీరంతా అచ్చంగా పొలంలో పనిచేసే కూలీలే. హెల్మెట్లు ధరించి మరీ కూలీ పనిచేస్తున్నారు. పత్తి పొలంలో చేతికొచ్చిన పత్తిని ఏరుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ హెల్మెట్లు పెట్టుకుని పంట పొలాల్లో పనిచేయడం సాధారణంగా మారింది. 

రైతులపై దాడిని సమర్ధించుకున్న పోలీసులు

Submitted by arun on Tue, 10/02/2018 - 17:08

ఢిల్లీలో రైతులపై చేసిన దాడిని పోలీసులు సమర్ధించుకున్నారు. రైతుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో టియర్‌ గ్యాస్ ప్రయోగం చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ట్రాక్టర్ అనుమతి లేదని...అందుకే రైతులను అడ్డుకోవలసి వచ్చిందని పోలీసులు తెలిపారు. శాంతి యుతంగా వస్తే తాము సహకరిస్తామని పోలీసులు అంటున్నారు. రైతులపై జరిగిన లాఠీచార్జ్‌పై విపక్ష నేతలు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై ఉక్కుపాదం మోపుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలీసుల లాఠీచార్జీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు.

Tags

రైతుల ఆందోళనతో దద్దరిల్లుతున్న ఢిల్లీ...అన్నదాతలపై పోలీసుల ప్రతాపం

Submitted by arun on Tue, 10/02/2018 - 12:05

రైతుల ఆందోళనతో ఢిల్లీ పరిసరాలు రణరంగంగా మారాయి. రాజధానిలోకి రైతుల అడుగుపెట్టకుండా శివారు ప్రాంతాల్లో భారీగా మోహరించిన పోలీసులు కిసాన్ క్రాంతి యాత్రపై విరుచుకుపడ్డారు. ర్యాలీగా వస్తున్న రైతులను ఘజియాపూర్ దగ్గర అడ్డుకున్న పోలీసులు ఢిల్లీలోకి అడుగుపెట్టకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు లోపలికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారు.  దీంతో పోలీసులు వాటర్ కెనన్‌లను ప్రయోగించి రైతులను చెల్లాచెదురు చేశారు. అయినా రైతులు వెనక్కు తగ్గకపోవడంతో టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. దీంతో రైతులు తలో వైపు పరుగులు పెట్టారు.

కష్టపడి పంట పండించే అన్నదాతలు సంతోషంగా లేరు : మోడీ

Submitted by arun on Wed, 08/15/2018 - 15:58

అభివృద్ధిలో దేశం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోందన్నారు ప్రధాని మోడీ అన్నారు యావత్‌ దేశం విశ్వాసంతో తొణకిసలాడుతోందని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చెప్పారు. నాలుగేళ్ళ ఎన్డీఏ పాలన గురించి ఎర్రకోటపై వల్లె వేసిన మోడీ తాము రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయబోమని దేశ ప్రయోజనాలే లక్ష్యంగా తమ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఉగ్రరూపం దాల్చిన ఆయకట్టు రైతుల ఆందోళనలు

Submitted by arun on Mon, 08/06/2018 - 17:42

శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎస్సారెస్సీ దగ్గర ప్రశాంతంగా ఉన్నా పరిసర గ్రామాల్లో మాత్రం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దాంతో పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుతోపాటు ఆయకట్టు గ్రామాల్లో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. 
          

Tags

మంత్రాలకు పంటలు

Submitted by arun on Sat, 07/28/2018 - 13:45

పంటలకు ఎరువులు, పురుగుల మందులు ఉపయోగించకుండా కాస్మిక్‌ ఎనర్జీ ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చని సురేశ్‌ చంద్ర, శ్రీమతి నయన్‌లు తెలిపారు. అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు మూడు యూనివర్శిటీలు కాస్మిక్ ఎనర్జీ పద్దతిపై అధ్యయనం చేసి సంతృప్తి వ్యక్తం చేశాయని సురేశ్‌ చంద్ర, నయన్‌లు చెప్పారు. ప్రాచీన శివయోగ పరంపరలో నిష్ణాతులైన బాబా శివనంద్‌ జీ నుంచి అరగంటసేపు దీక్ష తీసుకున్న రైతులు తమ పొలానికి ప్రాణశక్తిని సూర్యుడి ద్వారా జీవితాంతం, ఎన్ని ఎకరాల పొలానికైనా కాశ్మిక్ ఎనర్జీని ప్రసరింపజేయగలరని తెలిపారు. 

అన్నదాతకు రూపాయికి రూపాయిన్నర మద్దతు

Submitted by arun on Thu, 07/05/2018 - 13:29

అన్నదాతకు మద్దత్తు ధరలు,

పెట్టుబడి ఇక తిరిగి దొరులు,

కరుణించినవి కేంద్ర సిరులు,

ఇక తొలుగునా రైతన్న కన్నీటి పొరలు. శ్రీ.కో

10 రోజుల్లో రైతు రుణాలు మాఫీ: రాహుల్

Submitted by arun on Wed, 06/06/2018 - 18:50

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రైతుల మీద కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తీరుతామని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌లో రైతులపై కాల్పులు జరిగి ఏడాది అయిన సందర్భంగా జరిగిన రైతు ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. 

ఆగస్టు 15 నుంచి తెలంగాణలో రైతు బీమా పథకం

Submitted by arun on Mon, 06/04/2018 - 17:10

రైతు బీమా పథకం.. తాను చేసిన గొప్పపని అన్నారు సీఎం కేసీఆర్‌. ఆగస్టు 15 నుంచి రైతు బీమా అమలవుతుందని చెప్పారు. రైతు ఎలా మరణించినా 10 రోజుల్లోనే బాధిత కుటుంబానికి.. 5 లక్షల బీమా అందుతుందన్నారు కేసీఆర్. దీనికి సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది.

రైతు బీమా.... నా జీవితంలో నేను చేసిన గొప్పపని : సీఎం కేసీఆర్‌

Submitted by arun on Mon, 06/04/2018 - 13:25

రైతు బీమా పథకం... తన జీవితంలోనే గొప్పపని అని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ హెచ్ఐసీసీలో జరిగిన రైతు సమన్వయ కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ ... రైతు బీమా పథకానికి సంబంధించి ఎల్ఐసీ సంస్థతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రైతు మరణించిన పది రోజుల్లోనే బాధిత కుటుంబానికి ఐదు లక్షల బీమా అందుతుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.