mumbai

‘నల్లగా ఉన్నావు...వంట రాదన్నందుకు’

Submitted by arun on Sat, 06/23/2018 - 13:38

నల్లగా ఉన్నావంటూ ఎగతాళి చేసినందుకు ఓ మహిళ తన బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాన్ని శవాలదిబ్బగా మార్చేసింది. తినే ఆహారంలో విషం కలిపి ఐదుగురిని పొట్టనబెట్టుకుంది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ప్రంద్యా అలియాస్‌ జ్యోతి సురేష్‌ సర్వసేకు రెండేళ్ల​ క్రితం వివాహమయ్యింది. కానీ వివాహమయిన నాటినుంచి ఆమె అత్తింటి వారు, బంధువులు ఆమెను నల్లగా ఉన్నావని,  వంట చేయడం రాదని విమర్శిస్తుండేవారు. వీటన్నిటిని మనసులో పెట్టుకున్న జ్యోతి తన అత్తింటివారి మీద ద్వేషం పెంచుకుంది. వారికి బుద్ధి చెప్పడం కోసం ఎదురుచూస్తుంది.

ముంబై వర్లి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

Submitted by arun on Wed, 06/13/2018 - 17:33

దక్షిణ ముంబై వర్లి ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవన సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అబ్బాసాహేబ్‌ మరాఠే మార్గ్‌లో ఉన్న బ్లూమౌంట్‌ టవర్స్‌లోని 33వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో భవనంలోని పైరెండు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

ఈ భవనంలోనే కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె సహా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదన్న అధికారులు మంటలను నియంత్రించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

Tags

హోటళ్లో టీ తాగుతుండగా ఒక్కసారిగా ఫోన్ బ్లాస్ట్‌

Submitted by arun on Wed, 06/06/2018 - 14:00

ముంబాయిలో నిత్యం రద్దీగా ఉండే బందూర్ ప్రాంతంలోని ఓ హోటళ్లో ఉన్నట్టుండి సెల్‌ఫోన్ పేలిపోయింది. హోటల్లో కూర్చొని టీ తాగుతుండగా జేబులో పెట్టుకున్న ఫోన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో  పేలి పొగలు కమ్ముకున్నాయి. దీంతో చుట్టుపక్కల వారు ఏం జరిగిందో తెలియక పరుగులు పెట్టారు. ముచ్చటపడి ఈఎమ్‌ఐల ద్వారా  కొన్న ఫోన్ పేలి పోవడంతో  సెల్‌ యజమాని లబోదిబోమంటున్నాడు.  

రణరంగంగా ముంబై

Submitted by arun on Tue, 03/20/2018 - 11:19

ముంబై మళ్లీ హోరెత్తుతోంది. నినాదాలతో దద్దరిళ్లుతోంది. మొన్నటివరకు రైతుల ఆందోళనలతో అట్టుడికిన ముంబై మహానగరం తాజాగా రైల్వే ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగుల ఆందోళనతో అట్టుడికిపోతోంది. రైల్వే పోస్టుల కోసం పరీక్షలు రాసిన అభ్యర్థులు నియామకాలు కోరుతూ ఇవాళ భారీ ఆందోళనను చేపట్టారు. మతుంగ, ఛత్రపతి శివాజీ టెర్మినల్ల మధ్య భారీ నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైలు పట్టాలపైనే నిరసన చేపట్టడంతో 60 కి పైగా లోకల్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. 

అద్య‌క్ష ప‌ద‌వికి ట్రంప్ అన‌ర్హుడు: క‌్లింట‌న్

Submitted by lakshman on Sun, 03/11/2018 - 12:50

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ప‌ద‌వికి అన‌ర్హుడని విమ‌ర్శించారు డెమొక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీ చేసిన హిల్ల‌రీ క్లింట‌న్. తాను గ‌త ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసి ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ట్రంప్ గెలుస్తార‌ని ఎవ‌రు ఊహించ‌లేద‌న్నారు ఆమె. పారిస్‌ ఒప్పందంపై సంతకాల విషయంలో అన్ని దేశాలను ఒప్పించటంలో భారత్‌ పెద్దన్నపాత్ర పోషించిందని ప్రశంసించారు. 

ధడక్‌ సెట్‌లో జాన్వీ

Submitted by arun on Fri, 03/09/2018 - 11:05

శ్రీదేవి మరణంతో ఢీలా పడ్డ ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు ముందు "నువ్వు గర్వపడేలా చేస్తానని" అంటూ శ్రీదేవికి సోషల్ మీడియా వేదికగా మాటిచ్చిన జాన్వీ.. ఇప్పుడు ఆ మాటను నెరవేర్చుకునే క్రమంలో పడింది. ఇందులో భాగంగా తాజాగా తాను హీరోయిన్‌గా నటిస్తున్న 'ధడక్' షూటింగ్‌లో పాల్గొంది జాన్వీ. గురువారం జాన్వీ దఢక్ షూటింగ్‌లో పాల్గొనగా.. బాంద్రాలో రెండు రోజుల పాటు జాన్వీ, ఇషాన్‌లపై రొమాంటిక్‌ సన్నివేశాల చిత్రీకరణ అనంతరం వచ్చే వారం చిత్ర యూనిట్‌ పోస్ట్‌ ఇంటర్వెల్‌ సీన్స్‌ను తెరకెక్కించేందుకు కోల్‌కతా పయనమవుతుంది.

అదే అందంతో వీడ్కోలు ప‌లుకుతున్న శ్రీదేవి

Submitted by arun on Wed, 02/28/2018 - 14:48

శ్రీదేవి నిద్రపోతోంది.. అలు పెరుగని జీవనప్రయాణంలో అలసిపోయి సొలసిపోయి ఎట్టకేలకు శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటోంది.. ముత్తైదువలా పెద్ద బొట్టు, మెడలో నల్ల పూసలు, బంగారు గొలుసు పెదాలకు లిప్ స్టిక్ .. శ్రీదేవి ఎప్పటిలాగే ఉంది.. ఎంతో అందంగా ఉంది.. అదే అందంతో మనకు చివరి వీడ్కోలు చెబుతూ శాశ్వత నిద్రలోకి జారిపోయింది.. ఎర్రని పట్టుచీర కప్పుకుని నిద్రిస్తున్న శ్రీదేవి ముఖంలో అదే అమాయకత్వం.. అదే స్వచ్ఛత.. అదే అందం.. ఈ ముఖం అందరికీ ఎప్పటికీ ఇలాగే గుర్తుండిపోయేలా మనకు చివరి వీడ్కోలు పలికింది.

శ్రీదేవి వల్లే నా సోదరుడు బతికున్నాడు!

Submitted by arun on Wed, 02/28/2018 - 11:02

శ్రీదేవి మరణవార్త వినగానే ఆ అభిమాని గుండె పగిలిపోయింది. వెంటనే ఉత్తర ప్రదేశ్ నుంచి ముంబై బయల్దేరి వచ్చేశాడు అతను. అతని పేరు జతిన్ వాల్మీకి. కళ్లు కనిపించవు. అంధుడు. గత మూడు రోజులుగా శ్రీదేవి నివాసం వద్దే వేచి చూస్తున్నాడు. 

ప్లీజ్‌... ఆ కిరాతకుడి నుంచి కాపాడండి!

Submitted by arun on Mon, 02/05/2018 - 10:22

భర్త తనను మానసికంగా,శారీరకంగా వేధిస్తున్నాడని, తనను భర్త బారి నుంచి కాపాడాలని ముంబై నగరానికి చెందిన ఓ మహిళ ట్విట్టర్ లో వీడియోలో పోలీసులను వేడుకుంది. ముంబై కమీషనరేట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. గుర్‌ప్రీత్‌ సింగ్‌ అనే వ్యాపారవేత్త తన భార్య, ముగ్గురు పిల్లలతో ఖర్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. కొన్నేళ్ల క్రితం భార్య, భర్తలిద్దరికీ మనస్పర్థలు మొదలయ్యాయి. భర్త ప్రవర్తన సరిగ్గా లేకపోవటంతో గొడవలు జరిగి అదే అపార్ట్‌మెంట్‌లో వేర్వేరు ఫ్లాట్‌లలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఓరోజు భార్య ఉంటున్న ఫ్లాట్‌లో దొంగతనానికి యత్నించిన గుర్‌ప్రీత్‌, మరోసారి ఏకంగా ఆమెపై దాడికి యత్నించాడు.

చిన్నారి ఊపిరితిత్తుల్లో ఎల్ ఈడీ బల్బ్

Submitted by arun on Wed, 01/31/2018 - 11:59

మనం చిన్న పిల్లలకు ఆడుకోడానికిచ్చే ఆటబొమ్మలు ఒక్కోసారి వారి పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తాయి ఆటబొమ్మలతో జాగ్రత్తగా ఉండకపోతే అవి మనతో ఆటాడుకుంటాయ్ ముంబైలో ఏడునెలల చిన్నారి విషయంలో అదే జరిగింది ఇంతకీ  ఆ చిన్నారి ఏం చేసింది?