Movies

సుధీర్‌తో పెళ్లిపై స్పందించిన రష్మి

Submitted by arun on Tue, 03/20/2018 - 14:27

ఆన్ స్క్రీన్ పై కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయితే.. వారికి ఆఫ్ స్క్రీన్ లో కూడా లింకులు ఉన్నాయంటూ ప్రచారం జరగడం మామూలే. ఇప్పటివరకూ ఈ ట్రెండ్ సినిమాల్లో మాత్రమే కనిపించేది. దీన్ని కూడా ఇప్పుడు బుల్లితెర మీదకు తెచ్చేశారు ఓ జంట. జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. పార్టిసిపెంట్ సుధీర్ బాబుల మధ్య ఏదేదో ఉందనే.. ఇంకేదో జరిగిపోతోందని అనే మాదిరిగా చాలానే హింట్స్ కనిపిస్తాయి. 

పవన్ కోసం దేనికైనా రెడీ

Submitted by arun on Tue, 03/20/2018 - 10:30

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మరో సినీ హీరోయిన్ మద్దతు పలికింది. గతంలో కత్తి మహేష్ వివాదం సమయంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా పూనమ్ కౌర్ స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘నచ్చావులే’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మాధవీలత తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా పవన్ కల్యాణ్ కు మద్దతు తెలిపింది.

అనసూయ న్యూ లుక్ : రంగస్థలం అత్త ఇలా ఉంది

Submitted by arun on Mon, 03/19/2018 - 16:16

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వస్తున్న సినిమా 'రంగస్థలం'. పూర్తి పల్లెటూరు నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే భారీ అంచనాల నడుమ తెరకెక్కింది. చిత్రంలో అనసూయ స్పెషల్ రోల్ చేస్తోంది. అత్తగా అనసూయ చాలా కొత్త క్యారెక్టర్ చేసిందంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రంగమ్మత్తగా అలరించనున్న అనసూయ స్టిల్ ఒకటి తాజాగా బయటకు వదిలింది చిత్రయూనిట్.

జగన్ బయోపిక్.. హీరో పాత్రలో సూర్య..

Submitted by arun on Mon, 03/19/2018 - 11:03

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ ల కాలం సాగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ కు రంగం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు దివంగత నేత వైఎస్ఆర్ బయోపిక్ కు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మలయాళీ నటుడు మమ్ముట్టిని వైఎస్ పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతలోనే మరో ఆశ్చర్యకరమైన ప్రచారం జోరందుకుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద సినిమా తియ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సోషల్ మీడియా తెగ కూసేస్తోంది. జగన్ బయోపిక్ కి పూనుకున్నదెవ్వరు..? ఎప్పుడు ఎక్కడ మొదలవుతుందన్న వివరాల కంటే ముందు.. యువనేత జగన్ పాత్ర ఎవరు వేయబోతున్నారన్న ముచ్చట మాత్రమే హల్చల్ చేస్తోంది.

శ్రీదేవిని చంపింది ఆమె కుటుంబీకులే!

Submitted by arun on Mon, 03/19/2018 - 10:54

ఇండియన్ సెల్యులాయిడ్ ఐకాన్ శ్రీదేవి ‘మరణం’ మళ్ళీ వార్తల్లోకెక్కింది. మిస్టరీ ఏమీ లేదని, ఆమెది సహజ మరణమేనని దుబాయ్ దర్యాప్తు అధికారులు తేల్చిచెప్పడంతో ఆ ‘కథ’ అక్కడితో ముగిసిపోయిందనుకున్నారు. కానీ.. ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దంటూ ఇప్పుడో కొత్త వాదన బైటికొచ్చింది. ఇది కూడా సాక్షాత్తూ ఉగాది పర్వదినాన.. ఉగాది పంచాంగ శ్రవణంలో వినిపించడం గమనార్హం.

నేను సల్మాన్ ఖాన్ భార్యని.. చచ్చిపోతా!!

Submitted by arun on Sat, 03/17/2018 - 11:48

హీరోలను అభిమానించడం.. వారిపై ప్రేమతో ఇళ్లు వదిలి పారిపోవడం లాంటి ఘటనలు గతంలో విన్నాం కానీ.. ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ విషయంలో జరిగిన ఈ ఘటన మాత్రం.. కాస్త కొత్తగా అనిపించక మానదు. ఎందుకంటే.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ గా సల్మాన్ ఖాన్.. ప్రపంచం మొత్తానికీ తెలుసు. పెళ్లి విషయంలో కూడా సల్మాన్ కు ఓ నిర్దిష్ట అభిప్రాయం లేదనీ తెలుసు.

కత్రినా కైఫ్ కు సున్నా మార్కులేశారట

Submitted by arun on Sat, 03/17/2018 - 11:42

బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు ఊపు తీసుకురావడంలో.. కత్రినా కైఫ్ చేసిన పాటలు కూడా చాలా ఉన్నాయి. చిక్ నీ చమేలీ.. షీలా కీ జవానీ లాంటి సాంగ్స్ ఇప్పటికీ టాప్ హిట్స్ గా ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్ ను అలా వినగానే.. ఇలా ఊపేస్తున్నాయి. తన డ్యాన్సింగ్ టాలెంట్ తో అంతటి పాపులారిటీ సొంతం చేసుకున్న కత్రినా కైఫ్ కు.. ఓ కొరియోగ్రఫర్.. డ్యాన్స్ లో సున్నా మార్కులేశాడట.

మహానటి ఇంటిని వేలం వేస్తున్నారు!

Submitted by arun on Sat, 03/17/2018 - 11:36

హీరోయిన్లు.. నటీమణులు చివరి దశలో ఇబ్బంది పడి కాలం చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు.. శ్రీవిద్య విషయంలోనూ అదే జరిగింది.. ఇప్పుడు ఆమె గుర్తులను కూడా కాలగర్భంలో కలిపేసే ప్రయత్నం జరుగుతోంది. తెలుగులోనే కాదు.. తమిళ, మళయాళ సినిమాల్లోనూ అద్భుతమైన కేరెక్టర్లు చేసి.. అభిమానులను సంపాదించుకున్న శ్రీవిద్య.. పద్ధతైన నటనకు.. నిండైన రూపానికి కేరాఫ్ గా నిలిచారు. అలాంటి శ్రీవిద్య.. చివరి దశలో కేన్సర్ తో ఇబ్బంది పడ్డారు. కేరళ శాసనసభ్యుడు గణేష్ కుమార్.. అప్పట్లో ఆమె బాగోగులు చూసుకున్నారు.

‘నన్ను బతికించాలని దేవుడిని ప్రార్థించండి’

Submitted by arun on Sat, 03/17/2018 - 11:31

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్.. అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆ విషయాన్ని ఆయన రీసెంట్ గా ప్రకటించారు. ఇప్పుడు ట్విటర్ లో కూడా తన వ్యాధికి సంబంధించిన వివరాలు పెట్టారు. న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ తో తాను బాధపడుతున్నానని.. తాను హాస్పిటల్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని.. చాలా కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు.

శ్రీదేవి మరణం.. వాళ్లను ఒక్కటి చేసింది

Submitted by arun on Sat, 03/17/2018 - 11:25

కొన్ని విషాదాలు.. కొన్ని మార్పులకు కారణం అవుతాయంటారు. అతిలోక సుందరి శ్రీదేవి మరణం.. ఈ విషయాన్ని అక్షర సత్యం అని నిరూపించింది. శ్రీదేవి భర్త బోనీకపూర్ విషయంలో ఇది నిరూపితమైంది. శ్రీదేవిని బోనీ కపూర్ రెండో వివాహం చేసుకున్నాడనీ.. మొదటి భార్యతో అర్జున్ కపూర్, అన్షులాను సంతానంగా పొందాడనీ అందరికీ తెలిసిందే. కానీ.. శ్రీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి.. అర్జున్, అన్షులా.. బోనీకి దూరమయ్యారు. ఒంటరిగానే గడుపుతున్నారు. చివరికి శ్రీదేవి మరణం తర్వాత అర్జున్ లో చాలా మార్పు కనిపించింది.