hero vishal talk about his friend varalakshmi

వరలక్ష్మి గురించి మనసులో మాట చెప్పిన విశాల్!

Submitted by nanireddy on Mon, 05/14/2018 - 11:43

నిర్మాత, నటుడు, నడిగర్ సంగం ప్రధాన కార్యదర్శిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు తెలుగు బిడ్డ హీరో విశాల్ రెడ్డి. ఇటీవల విడుదలైన 'ఇరుంబుతిరై' నిర్మాతగా, నటుడిగా విశాల్ ను మరో మెట్టు ఎక్కించింది. ఇక విశాల్‌, వరలక్ష్మి మధ్య ప్రేమ.. పెళ్లి అంటూ చాలా రకాల వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా కొన్నిరోజులనుంచి విశాల్, వరలక్ష్మి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. అవ్వన్నీ ఎలా ఉన్నా.. చంద్రమౌళి సినిమా ఆడియో వేడుక సందర్బంగా విశాల్ వరలక్ష్మి ఇరువురు పక్కపక్కనే కూర్చొని ప్రేమగా ముచ్చటించుకోవడం పలువురిని ఆనందంలో ముంచెత్తింది.