poonam-kaur-allegations-movie-directo

ఆ దర్శకుడు మా జీవితాలతో ఆడుకుంటున్నాడు : పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు!

Submitted by nanireddy on Mon, 05/14/2018 - 11:16

ఓ దర్శకుడు తమ జీవితాలతో ఆడుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ పూనమ్ కౌర్. హీరో శ్రీకాంత్ సరసన తెలుగు తెరకు పరిచయమైన ఈ పంజాబీ బ్యూటీ తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా పవన్ కళ్యాణ్ అభిమాని అన్న ముద్ర వేసుకున్నారు. మూడు నెలల కిందట ఓ వివాదంలో చిక్కుకుని అనూహ్యంగా బయటపడ్డ పూనమ్ కౌర్.. తాజాగా ట్విట్టర్ లో ఓ వివాదాస్పద ట్వీట్ చేసింది.. దాని సారాంశం.. 'ఒక సినీ దర్శకుడు తనను తరచూ అవమానపరుస్తున్నాడని పూనంకౌర్‌ తన ట‍్వటర్‌లో పేర్కొన్నారు. ఆ దర్శకుడికి అధిక చిత్రాలేమీ లేవని, అయినా ఇతరుల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాడని ఆరోపించారు.