actress-nikesha-patel-issues-clarification-marriage-rumours-plans-with-prabhu-deva

ప్రభుదేవాతో పెళ్లి విషయమై స్పందించిన పవన్ హీరోయిన్

Submitted by nanireddy on Sun, 05/13/2018 - 17:32

గత కొద్ది రోజులుగా కొమరంపులి హీరోయిన్ నికిషా పటేల్,ప్రఖ్యాత డాన్సర్ ప్రభుదేవా ప్రేమలో పడినట్టు త్వరలో వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకు బలమైన సాక్షం లేకపోలేదు నికిషా పటేల్ ఓ ఆంగ్ల న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం.. ఆ ఇంటర్వ్యూలో ప్రభుదేవాతో కలిసి పనిచేయాలనుకుంటున్నారా? అని విలేకరి అడిగితే..‘సినిమా ఏంటి? ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఉంది’ అని నికీషా అన్నారట. ఇక ఆమె వ్యాఖ్యలపై నెటిజెన్లు పలు విధాలుగా స్పందించారు.. వారికీ అడ్వాన్స్ గా వెడ్డింగ్ శుభాకాంక్షలు అంటూ సరదాగా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు.