kolkata-man-arrested-masturbate-bus

మహిళలను చూస్తూ కామాంధుడి వికృత చర్య!

Submitted by nanireddy on Sun, 05/13/2018 - 16:57

బస్సులో మహిళలను చూస్తూ కామాంధుడు అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. కోల్ కతా లో జరిగిన ఈ ఘటన పోలీసుల కంట పడింది. వివరాల్లోకి వెళితే శనివారం  కోల్‌కతా హూగ్లీ జిల్లా శ్యామ్‌పుకర్‌ బస్సులో వైద్యపతి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బస్సులో ఎక్కాడు.  కొద్దిసేపటితరువాత అతని ప్యాంటు విప్పి మహిళలను చూస్తూ అసభ్య చర్యలకు ఉపక్రమించాడు. దీంతో అతడి చేష్టలతో విస్తుపోయిన కొందరు మహిళలు  మధ్యలోనే బస్సు  దిగిపోయారు. అతని వికృత చేష్టలను గమనించిన ఓ యువతి తన సెల్ ఫోన్ లో దృశ్యాలను  చిత్రీకరించింది. అనంతరం బస్సు కండెక్టర్ కు ఫిర్యాదు చేయగా అతను పట్టించుకోలేదు. దీంతో ఆ యువతి అసభ్య వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.