prabhas

బాలీవుడ్ స్టార్ హీరో కూతురుతో ప్ర‌భాస్

Submitted by lakshman on Sun, 01/28/2018 - 08:29

బాహుబ‌లితో ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించిన రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం యూవీ క్రియేష‌న్స్ పతాకంపై, సుజిత్ డైర‌క్ట‌న్ లో  సాహో అనే యాక్ష‌న్ లో యాక్ట్ చేస్తున్నారు.ఈ సినిమా నిర్మాణం చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా జిల్ డైర‌క్ట‌ర్ రాధాకృష్ణ తో మ‌రో సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అయితే బాహుబ‌లి త‌రువాత ప్ర‌భాస్ రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఏ సినిమా చేయాల‌న్నా భారీ క్యాస్టింగ్ క్రూ ఉండేలా నిర్మాత‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే సాహోలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్ర‌ద్ధాక‌పూర్ సెల‌క్ట్ చేసుకున్న విష‌యం తెలిసిందే.

భాగమతిలో బాహుబలి ట్విస్ట్ !

Submitted by arun on Thu, 01/25/2018 - 17:09

రేపు విడుదలకాబోతున్న ‘భాగమతి’ రిజల్ట్  కోసం అనుష్క ఫాన్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈసంక్రాంతికి విడుదల అయిన భారీ సినిమాలు అన్నీ  ఘోర పరాజయం చెందడంతో  ఈ ఏడాది మొట్టమొదటి సూపర్ హిట్ మూవీగా ‘భాగమతి’  మారబోతోంది అన్న అంచనాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ‘అరుంధతి’ తరహాలో అవుట్ అండ్ అవుట్ హారర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అశోక్ దీన్ని తీర్చిదిద్దిన విధానం అందరికీ బాగా నచ్చుతుంది అని ఈ సినిమా ఫైనల్ కాపీ చుసిన వారు చెపుతున్నారు.

సాహోలో ప్రభాస్ పాత్రపై ఇంట్రెస్టింగ్ న్యూస్

Submitted by arun on Mon, 01/22/2018 - 16:06

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తోన్న మూవీ సాహో. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ఏంటి, ఎలా కనిపించబోతున్నాడనే వార్త అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా సాహోలో ప్రభాస్ పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఇందులో ప్రభాస్ టూ షేడ్స్ లో కనిపించబోతున్నాడు.

అందుకే ప్ర‌భాస్ అంటే చాలా ఇష్టం: న‌మిత‌

Submitted by arun on Sat, 01/20/2018 - 13:57

నటి నమిత మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఇటీవల క్లోజ్‌ఫ్రెండ్‌ వీరేంద్ర చౌదరిని మ్యారేజ్ చేసుకున్న ఆమె, ఓ ఛానెల్ ఇంటర్వ్యూ‌లో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది. ముఖ్యంగా ప్రభాస్ అంటే తనకు చెప్పలేనంత ఇష్టమని, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే వ్యక్తి ఆ హీరో అని మనసులోని మాట బయటపెట్టేసింది. అందుకు ఎగ్జాంఫుల్ ‘బిల్లా’ షూటింగ్ సమయంలో కొన్ని విషయాలను రివీల్ చేసింది. ఓ స్టార్ హీరో అందరితో కలసి మెలసి వుండడం ఎవరికైనా నచ్చుతాడని చెప్పుకొచ్చింది. నేను ఆయ‌న‌తో క‌లిసి `బిల్లా` సినిమాలో న‌టించాను. ఆ సినిమా షూటింగ్ మ‌లేసియాలో జ‌రిగింది. అక్క‌డ‌కు షూటింగ్ సిబ్బంది చాలా త‌క్కువ మంది మాత్ర‌మే వ‌చ్చారు.

ప్రభాస్‌ను అన్నయ్య అని పిలవలేను: అనుష్క

Submitted by arun on Thu, 01/18/2018 - 12:46

గత కొంతకాలంగా ప్రభాస్ కు, అనుష్కకూ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందని, వారిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని వస్తున్న వార్తలను ఇద్దరూ ఖండించినప్పటికీ, రూమర్స్ మాత్రం ఆగలేదన్న సంగతి తెలిసిందే. అనుష్క టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘భాగమతి’. ఈ చిత్ర తమిళ ఆడియో వేడుక బుధవారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తన వృత్తి, వ్యక్తిగత విషయాలను అనుష్క ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో అనుష్క కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్యకాలంలో అందరూ నా పెళ్లి గురించి అడుగుతున్నారు. నేనైతే పెళ్లి గురించి ఆలోచించడమే మానేశాను. నాకోసం మీరే ఓ మంచి అబ్బాయిని వెతికిపెట్టండి.

ప్ర‌భాస్ సాహో షూటింగ్ లో స్వీటీ

Submitted by lakshman on Sat, 01/13/2018 - 13:50

అస‌లే హిట్ పెయిర్ అయిన  ప్ర‌భాస్ - అనుష్క పై రూమ‌ర్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గ‌తంలో వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటున్నార‌ని అందుకు పెద్ద‌నాన్న కృష్ణంరాజు పెళ్లి చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాము జ‌స్ట్ ప్రెండ్స్ అని మాకు అలాంటి ఆలోచ‌న‌లు రాలేద‌ని ప్ర‌భాస్ ఎన్నిసార్లు ఖండించిన వాటికి పులిస్టాప్ ప‌డ‌లేదు. ప్ర‌భాస్ - అనుష్క‌లు నాలుగు సినిమాల్లో యాక్ట్ చేసి వ‌రుస బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్ కొట్టారు. దీంతో వారిపై ఏదో ఒక‌రూమ‌ర్ క్రియేట్ అవుతూనే ఉంది. తాజాగా రూమ‌ర్లుకు అగ్నికి ఆజ్యం పోసేలా అనుష్క సాహో షూటింగ్ లో ద‌ర్శ‌నిమిచ్చింది.

బాగా వెన‌క‌బ‌డిపోతున్న ప్ర‌భాస్

Submitted by arun on Thu, 01/11/2018 - 16:19

డార్లింగ్ ప్రభాస్.. తొటి స్టార్ హీరోలతో పోల్చుకుంటే బాగా వెనకబడి పోయాడు. కనీసం వాళ్లను రీచ్ కూడా కావడం లేదు. అదేంటి ప్రభాస్ బాహుబలితో రికార్డులు స్రుష్టిస్తే వెకబడిపోయాడు అంటారేంటి అనుకుంటున్నారా. అవును రికార్డుల విషయం పక్కనపెడితే...సినిమాల విషయంలో మాత్రం ప్రభాస్ బాగా స్లో అయ్యాడు. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనమైయ్యాడు. దీంతో ఫ్యాన్స్ ప్రభాస్ ను తిట్టుకుంటున్నారు.

కాపీ రైట్స్ వివాదంలో ‘సాహో’.. ?

Submitted by lakshman on Tue, 01/09/2018 - 11:29

బాహుబలి సినిమాతో నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయిన ప్ర‌భాస్ సాహో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో సాహో సినిమా గురించి రూమ‌ర్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. టీ సిరీస్ కు చెందిన లార్గో విన్చ్ సినిమా వివాదం అజ్ఞాత‌వాసిని చుట్టుముట్టిన విష‌యం తెలిసిందే. త‌న సినిమాను డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాపీ కొట్టార‌ని..రైట్స్ కోసం భారీ మొత్తం చెల్లించాలని టీ సిరీస్ కోర్టుకెక్కింది. దీంతో సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలో వివాదం క‌రెక్ట్ కాద‌ని భావించిన కొంత‌మొత్తం చెల్లించి ఆ వివాదం నుంచి బ‌య‌ట‌ప‌డింది. ఇదిలా ఉంటే లార్గోవిన్చ్ వివాదం ‘సాహో’ను కూడా ఇర‌ట‌కాటంలో పెట్టిన‌ట్లు టాక్.

పెళ్లి గురించి ప్రభాస్ క్లారిటీ

Submitted by arun on Wed, 01/03/2018 - 12:42

ప్ర‌భాస్ పెళ్లి వ్య‌వ‌హారంపై రోజుకో రూమ‌ర్ నెట్టింట్లో హడావిడి చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో భీమ‌వ‌రానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకుంటార‌ని వార్త‌లు రాగా..అదేంలేద‌ని పెద్ద‌నాన్న కృష్ణంరాజు కొట్టిపారేశారు. ఆ త‌రువాత‌ హీరోయిన్ అనుష్క‌ను వివాహం చేసుకుంటార‌ని ఇలాపుకారు షికార్లు చేశాయి. ఈనేప‌థ్యంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ అనుష్క‌ను ప్రేమిస్తున్నార‌నే  ఓ మ్యాగ‌జైన్ ఇంట‌ర్వ్యూలో  ఒకే జంట వ‌రుస సినిమాలు చేస్తే ఇలాంటి రూమ‌ర్లు రావ‌డం కామ‌న్ అని అన్నారు.

అతి త్వరలో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ

Submitted by arun on Tue, 01/02/2018 - 17:59

రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై కొత్తకాలంగా చర్చ నడుస్తోంది. కానీ అది ఇన్ని రోజులు కేవలం రూమర్స్ గానే మిగిలిపోయింది. అయితే అది ఎట్టకేలకు నిజం కాబోతోంది. త్వరలోనే ప్రభాస్ బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాసే తెలియజేశాడు.అది కూడా సాహో మూవీ తర్వాత.