prabhas

కొత్త సినిమా ప్రారంభించిన ప్రభాస్‌

Submitted by arun on Thu, 09/06/2018 - 13:22

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్..సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.150 బడ్జెట్‌తో ‘సాహో’ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీని ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరో సినిమా ఖరారైనట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభాస్ స్వయంగా తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. సాహో తర్వాత తాను చేస్తున్న సినిమా గురువారం(సెప్టెంబర్ 6)న ప్రారంభమైనట్లు తెలిపారు.

ప్రభాస్‌ను చూసి నేర్చుకోండి...మలయాళ నటులపై కేరళ మంత్రి ఆగ్రహం

Submitted by arun on Tue, 09/04/2018 - 11:41

కేరళకు కోటి రూపాయలు విరాళం ఇచ్చిన ప్రభాస్‌‌పై కేరళ టూరిజం మంత్రి సురేంద్రన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలని మలయాళ నటులపై మండిపడ్డారు. కేరళ బాధితుల సంరక్షణ నిమిత్తం ‘కేర్‌ కేరళ’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా సురేంద్రన్‌ మాట్లాడుతూ..‘మన రాష్ట్రంలో ఎందరో సూపర్‌స్టార్లు ఉన్నారు. ప్రతీ సినిమాకు రూ.4 కోట్లు పారితోషికంగా తీసుకుంటారని విన్నాను. వారంతా ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలి. ఆయన మలయాళ సినిమాల్లో నటించింది లేదు. అయినప్పటికీ కేరళ బాధితుల కష్టాలు చూడలేక కోటి రూపాయలు విరాళంగా ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడలేదు.

బాలీవుడ్ మహా మహులనే పక్కన పెట్టిన ప్రభాస్...సంజయ్ లీలా భన్సాలికే దిమ్మతిరిగేలా...

Submitted by arun on Wed, 08/15/2018 - 13:12

ప్రభాస్ బాహుబలిగా ఇండియన్ సినిమాని ఊపేసిన యంగ్ రెబల్ స్టార్ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కాడు. ఏకంగా బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలికే దిమ్మతిరిగేలా చేశాడు ఎంతటి మహా మహులైనా జాన్ తా నై అంటున్నాడు డోంట్ కేర్ అనేశాడు. 
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బడా ఆఫర్ ని వద్దుపోమన్నాడు కాస్త లేటుగా లీకైనా, లేటెస్ట్ గా రివీలై, బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందీ ఈ వార్త. ఏకంగా బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఆఫర్ నే ఆమధ్య వద్దు పొమ్మాన్నాడనే వార్త ఇప్పుడు నార్త్ లో సెన్సేషన్ అవుతోంది.
 

చిట్టి అభిమాని కోరిక తీర్చిన ప్రభాస్..!

Submitted by arun on Tue, 08/14/2018 - 17:04

తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనని కలవాలని కోరుకున్న చిట్టి అభిమాని మదన్ రెడ్డి కోరికను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెరవేర్చాడు. ఇటీవల ఆసుపత్రిలోని బెడ్‌పై కూర్చుని ‘ఐ వాంట్ టు మీట్ బాహుబలి’ అనే ఫ్లకార్డ్ చేతబట్టుకున్న బాలుడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని గమనించిన ప్రభాస్ వెంటనే స్పందించాడు. సదరు బాలుడి వివరాలు తెలుసుకుని అతడిని కలుసుకున్నాడు. చిట్టి అభిమానిని క‌లిసి ఆయ‌న‌తో స‌ర‌దాగా గ‌డిపాడు. ఇద్ద‌రు క‌లిసి ఫోటోలు దిగారు ప్ర‌స్తుతం చిట్టి అభిమానితో ప్ర‌భాస్ దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

Tags

నా కూతురికి ప్రభాస్ వంటి మిస్టర్ పెర్ఫెక్ట్ కావాలి: అనుష్క తల్లి

Submitted by arun on Thu, 07/19/2018 - 17:34

టాలీవుడ్ నటీనటులు ప్రభాస్-అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారనే వదంతులపై వాళ్లిద్దరూ స్వయంగా స్పందించినప్పటికీ ఆ రూమర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వదంతులపై అనుష్క తల్లి స్పందిస్తూ.. ‘‘వాళ్లిద్దరూ స్టార్స్.. అలాగే ఇద్దరూ కలిసి నటించారు. నాకు అనుష్క కోసం ప్రభాస్ వంటి మిస్టర్ పర్‌ఫెక్ట్‌ కావాలనే ఉంది. కానీ వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే. వారి పెళ్లి గురించి రూమర్స్ స్ర్పెడ్ చేయడం ఆపండి’’ అని తెలిపారు. రీసెంట్ గా అనుష్క కూడా ఈ విషయంపై మాట్లాడింది.

"బీజేపీ తరపున ప్రభాస్‌ ప్రచారం పై" కృష్ణంరాజు క్లారిటీ

Submitted by arun on Tue, 07/03/2018 - 11:06

ప్రభాస్‌కు బీజేపీతో సంబంధం లేదని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసినా ప్రభాస్‌ ప్రచారానికి రాడని సినీనటుడు, బీజేపీ సీనియర్‌ నాయకుడు కృష్ణంరాజు స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభాస్‌ ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నాడని, అతన్ని బీజేపీ ఎన్నికల ప్రచారంలో వినియోగించదలచుకోలేదని కృష్ణం రాజు చెప్పారు. ప్రభాస్‌ రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. ప్రజలను మోసం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు పాపం పండే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన అన్నారు.

ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు షాకింగ్ కామెంట్స్...!

Submitted by arun on Wed, 06/27/2018 - 16:17

సీనియర్ నటుడు , ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ...అసలు ప్రభాస్ పెళ్లి చేస్కుంటాడో లేదో నాకే తెలియదంటూ షాకింగ్ సమాధానమిచ్చారు. బాహుబలి చిత్రంతోనే ప్రభాస్‌కు దాదాపు 3 ఏళ్ళు గడచిపోయింది. ప్రభాస్‌కు పెళ్లి చేసుకోవాల్సిన వయసు వచ్చింది. అతడేం చిన్నపిల్లవాడు కాదు. పెళ్లెప్పుడు చేసుకోవాలో అతనే నిర్ణయించుకోవాలి అని కృష్ణంరాజు అన్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అంతా భావించారు. కానీ అది జరగలేదు. సాహో చిత్రం 2019 నాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రభాస్, నీహారిక పెళ్లి వార్తలపై స్పందించిన చిరు

Submitted by arun on Tue, 04/10/2018 - 14:31

బాహుబలి ప్రభాస్ – కొణిదెల నీహారిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.. రెండు కుటుంబాలు ఇప్పటికే మాట్లాడుతున్నాయి. చిరంజీవి పెద్ద తరహాగా.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుతో మాట్లాడారు.. నాగబాబు ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంది.. ఇలాంటి వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ గాసిప్స్ లోనే కాకుండా.. హిందీ, ఇంగ్లీష్ తోపాటు ఇతర భాష వెబ్ సైట్లలో ఈ వార్త వైరల్ అయ్యింది. ఎన్డీటీవీ, ఇండియా టుడే లాంటి జాతీయ పోర్టల్స్ లోనూ ప్రముఖంగా వచ్చాయి. దీంతో ప్రభాస్ – నీహారిక పెళ్లి నిజమేనా అంటూ సినీ ఇండస్ట్రీ గుసగుసలాడుకుంటోంది. ఈ క్రమంలోనే..

ప్ర‌భాస్ - చిరంజీవి సేమ్ టూ సేమ్

Submitted by lakshman on Sat, 03/31/2018 - 04:36

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి పై భారీ అంచ‌నాలే ఉన్నాయి.  సురేంద‌ర్ రెడ్డి డైర‌క్ష‌న్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతుంది. 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన  వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాళెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకరు. బ్రిటీష్ వారి  దొరతనము ఎదిరించి వీరమరణం పొందారు.

అనుష్క‌కు దూరంగా రెబల్ స్టార్

Submitted by lakshman on Wed, 01/31/2018 - 06:51

అస‌లే హిట్ పెయిర్ అయిన  ప్ర‌భాస్ - అనుష్క పై రూమ‌ర్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గ‌తంలో వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటున్నార‌ని అందుకు పెద్ద‌నాన్న కృష్ణంరాజు పెళ్లి చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాము జ‌స్ట్ ప్రెండ్స్ అని మాకు అలాంటి ఆలోచ‌న‌లు రాలేద‌ని ప్ర‌భాస్ ఎన్నిసార్లు ఖండించిన వాటికి పులిస్టాప్ ప‌డ‌లేదు.