nalgonda

అర్ధరాత్రి ప్రణయ్‌ ఇంట్లో ఆగంతకుడు

Submitted by arun on Mon, 11/05/2018 - 13:11

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ ఇంట్లో అగంతకుడు చొరబడడం కలకలం సృష్టించింది. 2 నెలల క్రితం ప్రణబ్ హత్యకు గురైన తర్వాత పెరుమాళ్ల బాలస్వామి కుటుంబానికి పోలీసులు భద్రత కల్పించారు. ప్రస్తుతం ప్రణయ్ కేసు విచారణ వేగంగా జరుగుతోంది. ఆదివారం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తుండగా శనివారం తెల్లవారు జామున దుండగుడు ఇంటి ఆవరణలో కలియతిరిగిన విషయాన్ని గుర్తించామని ప్రణయ్‌ తండ్రి బాలస్వామి తెలిపారు. ఆగంతకుడు ముఖానికి ముసుగు ధరించాడని, అదే సమయంలో అటుగా వచ్చిన పోలీసులను చూసి ఆగంతకుడు పారిపోయినట్లు చెప్పారు. బాలస్వామి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్‌ కంచుకోటకు కేసీఆర్‌...

Submitted by arun on Thu, 10/04/2018 - 10:12

కాంగ్రెస్‌ కంచుకోట.... టీఆర్ఎస్‌ టార్గెట్‌.... క్లీన్‌ స్వీప్‌ చేసి ప్రతిపక్షాన్ని మూడు చెరువుల నీళ్లు తాగించాలనే సంకల్పంతో నల్లగొండ జిల్లాకు రాబోతున్నారు కేసీఆర్‌. నిజామాబాద్‌ సభలో ప్రతిపక్షాలను చీల్చిచెండాడిన కేసీఆర్‌ నల్లగొండలో కూడా అదే ఫామ్‌ను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా ప్రజా ఆశీర్వాద సభలను ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్‌ అధినేత‌ ఇవాళ నల్లగొండలో నగారా మోగించనున్నారు. 

నల్లగొండ రాజకీయాల్లో మారుతున్న సమీకరణలు...పార్టీ మారేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ సిద్ధం..?

Submitted by arun on Sat, 08/11/2018 - 11:26

ముందస్తు హడావుడి కనిపిస్తున్న తెలంగాణలో రాజకీయ సమీకరణలు కూడా జోరందుకున్నాయి మొన్నటి వరకూ కాంగ్రెస్ జెండా మోసిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు బోర్డు తిప్పేస్తున్నారా?ఇన్నాళ్లూ  ఆశ్రయమిచ్చిన అభయ హస్తాన్ని వీడి కారెక్కేస్తున్నారా?గత కొంత కాలంగా సైలెంట్ గా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అదే నిజమనిపిస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ మనసు మారడానికి కారణాలేంటి?

Tags

ప్రేమోన్మాదానికి మరో యువతి బలి

Submitted by arun on Fri, 07/06/2018 - 16:38

ప్రేమోన్మాది వేధింపులు మరో యువతిని బలి తీసుకున్నాయి. నల్గొండ జిల్లా కొత్తపల్లికి చెందిన శ్వేత తుప్రాన్ పేటలోని నేతాజీ కాలేజీలో ఎంబీఎ చదువుతుంది. ఈమెకు  భరత్ అనే యువకుడితో పరిచయం ఉంది. ప్రేమించమని శ్వేతను వేధిస్తున్నాడు. ఇటీవల శ్వేతకు మరో యువకుడితో  నిశ్చితార్థం జరిగింది. గత నెల 30న మల్కాపురం శివారులోని అశోకా ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష రాసేందుకు శ్వేత వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న భరత్.. అశోకా ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చాడు. పరీక్ష అనంతరం బైక్ పై బలవంతంగా తీసుకెళుతున్న భరత్ తో శ్వేత గొడవపడింది. ఇద్దరీ పెనుగులాటలో శ్వేత బైక్ పై నుంచి కిందపడి తలకు తీవ్ర గాయమైంది.

లవర్ కోసం టవరెక్కిన ప్రేమికుడు

Submitted by arun on Tue, 06/26/2018 - 14:28

లవర్ కోసం టవర్ ఎక్కిన ఘటన.. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగింది. తాను ప్రేమించిన అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బంధించారంటూ సాయి అనే వ్యక్తి.. సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. తన ప్రేయసితో వెంటనే మాట్లాడించాలని డిమాండ్ చేస్తూ.. నానా హంగామా చేశాడు. అయితే పరిస్థితి ఉద్రిక్తం కావడంతో.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది.. అబ్బాయికి నచ్చజెప్పి కిందికి దించే ప్రయత్నం చేస్తున్నారు. 

పిడుగుపాటుకు భార్యాభర్తలు మృతి

Submitted by arun on Sat, 06/02/2018 - 16:46

నల్లగొండ జిల్లాలో పిడుగుపాటుకు బార్యాభర్తలు చనిపోయారు. మిర్యాలగూడ మండలంలోని అలగడపలో ఈ ఘటన జరిగింది. అలగడప గ్రామానికి చెందిన ఎల్లవుల వెంకయ్య, నారమ్మ పొలాల్లో గొర్రెలను మేపుతుండగా వారిపై పిడుగుపడింది. పిడుగు పాటుకు భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దంపతుల మరణంతో అలగడప గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 

చిట్టిత‌ల్లిని కంటికి రెప్పలా కాపాడుతున్న డాక్ట‌ర్లు

Submitted by arun on Sat, 02/17/2018 - 11:03

తల్లి గర్భం నుంచి 9 నెలల తర్వాత భూమి మీదకు రావాల్సిన పాప 2 నెలల ముందే వచ్చేసింది. తోడుగా తనతో వచ్చిన చెల్లి పుట్టిన నిమిషాల్లోనే చనిపోయింది 3 రోజుల తర్వాత కన్నతల్లి మరణించింది. చివరికి తండ్రి కూడా పాపను సాకడం తనతో కాదని వదిలేసి వెళ్లిపోయాడు. కానీ ఆ తల్లికి పురుడు పోసిన డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బందే పాపను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నవీనగా మార్చి ఏడాది తర్వాత నవయుగంలోకి నడిపించారు.

నవీన చూస్తున్నారుగా ఎంత ముద్దుగా ఉందో. మీరు చూస్తున్న ఈ పాప పుట్టినప్పుడు ఇంత బాగా పెరుగుతుందని ఎవరూ అనుకోలేదు. ఈరోజు ఈ చిన్నారి ఇలా ఉందంటే దానికి కారణం నల్గొండ ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే.

'వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తా'

Submitted by arun on Mon, 02/12/2018 - 16:24

వచ్చే ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేస్తాని ఎమ్మెల్యే కోమటిరెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలోని వేములపల్లి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎ‍మ్మెల్యేలకు డిపాజిట్లు దక్కకుండా అన్నీ నియోజక వర్గాల్లో పర్యటిస్తానని తెలిపారు. ప్రభుత్వం రైతులను భిక్షగాళ్లలా చూస్తోందన్నారు. కాలుష్యం వెదజల్లే థర్మల్ ప్లాంట్‌ను దామరచర్లలో ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఒకేసారి రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.

హ‌స్తిన‌కు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు

Submitted by arun on Thu, 02/08/2018 - 11:06

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును ఢిల్లీకి తీసుకెళ్లింది కాంగ్రెస్. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆ సంస్థ డైరెక్టర్ ను కోమటిరెడ్డి బ్రదర్స్ డిమాండ్ చేయనున్నారు. అలాగే, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఈ వ్యవహారాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాలని పార్టీ అధినేత రాహుల్ గాంధీని కోరనున్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో కేసులో అధికార టీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బద్నాం చేయనుంది. 

బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసును చేధించిన పోలీసులు

Submitted by arun on Mon, 01/29/2018 - 12:58

నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 11మంది నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్న ఎస్పీ శ్రీనివాస్‌ హత్యలో రాజకీయం కోణం లేదని స్పష్టం చేశారు.