kcr

మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి.. ప్రజల ఆశీర్వాదం ఆయనకే

Submitted by chandram on Mon, 12/10/2018 - 20:48

తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఫలితాలకు కొన్ని గంటల ముందు పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. అటు మహా కూటమి నేతలు ఇటు టీఆర్ ఎస్  లీడర్లు సంచలనాలకు తెరలేపుతున్నారు. ఇక హంగ్  వస్తుందనే ఊహాగానాల ననేపథ్యంలో ఎంఐఎం పొలిటికల్ గా సూపర్ యాక్టివ్  అవుతోంది. ప్రగతి భవన్ కు వచ్చిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ టీఆర్ ఎస్  అధినేత కేసీఆర్ తో దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరపడం రాజకీయంగా సంచలన రేపుతోంది. 

కేసీఆర్‌ను కలవడానికి బైక్‌పై వచ్చిన అసదుద్దీన్

Submitted by arun on Mon, 12/10/2018 - 14:43

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ భేటీ అయ్యారు. ప్రగతీ భవన్‌లో సమావేశానికి ఒవైసీ బుల్లెట్‌పై వెళ్లారు. ఒక్కసారిగా జరిగిన ఈ అనూహ్య పరిణామానికి అంతా అవాక్కయ్యారు. కెమెరా కంటికి చిక్కకుండా ప్రగతి భవన్‌కు ఒవైసీ చేరుకున్నారు. వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. కాసేపటి క్రితమే కాబోయే సీఎం కేసీఆర్‌తో సమావేశం అవుతున్నట్లు ఒవైసీ ట్వీట్‌ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్న నేపథ్యంలో కేసీఆర్‌తో అసద్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

కేసీఆర్‌తో భేటీపై అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

Submitted by arun on Mon, 12/10/2018 - 13:07

అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాసేపట్లో కేసీఆర్‌తో సమావేశం కానున్న నేపథ్యంలో ఆయన ట్వీట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మధ్యాహ్నం ఒంటి గంటా 30 నిముషాలకు కలబోతున్నట్లు తెలిపారు. దేవుడి దయతో కేసీఆర్‌ తన సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు మజ్లీస్‌ అండగా ఉంటుందని తెలిపారు. దేశ నిర్మాణంలో తమ కలయిక తొలి అడుగుగా ఒవైసీ అభివర్ణించారు. 
 

కేసిఆర్ మూట, ముల్లు సర్దుకోవడం ఖాయం

Submitted by chandram on Sun, 12/09/2018 - 13:26

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రణరంగం ముసిగి ఎగ్జీట్ పోల్స్ కూడా తమ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే కాగా తెలంగాణ ఎన్నికలపై తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దావెంకన్న స్పందించారు. ఈనెల11న తేదీ తరువాత తెలంగాణలో కేసీఆర్  మూట, ముల్లు సర్దుకోవడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. తెలంగాణలో వచ్చేది ప్రజాకూటమి ప్రభుత్వమేనని కెసిఆర్ అనుచరులు ఇప్పుడు కుంటిసాకులు వెతుక్కుంటందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రచారంతో నేతల్లోనే కాక రేగిందని, ప్రజల్లోను ఒక భరోసా వచ్చిందని  వ్యాఖ్యనించారు. వైయస్ జగన్, పవన్‌లు కేసిఆర్, మోడిలతో కుమ్మక్కయ్యారని వెంకన్న విమర్శించారు.

కేసీఆర్‌పై 50వేల మెజార్టీతో గెలవబోతున్నా: వంటేరు

Submitted by chandram on Sat, 12/08/2018 - 15:04

ఎన్నికల రణక్షేత్రంలో మహాయుద్దన్నే తలపించే విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా అసెంబ్లీ ఎన్నికలపై అప్పుడే ఎగ్జిట్ పోల్స్ స్వరేలు కూడా వెల్లడించాయి. అయితే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియోజకవర్గం గజ్వేల్‌లో హోరాహోరి పోటీనే తలపించింది. ఇటు సొంత నియోజకవర్గంలో కెసిఆర్‌కు పోటీగా వంటేరు ప్రతాప్‌రెడ్డి నిలబడిన విషయం తెలిసిందే. కాగా గజ్వేల్ లో కెసిఆర్ పై 50వేల మేజార్టీతో తాను గెలవబోతున్నానని ప్రజాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ ప్రజాస్వామ్యాన్ని చంపేశారని విమర్శల వర్షం కురిపించారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌దే ప్రభంజనం: ఎగ్జిట్‌ పోల్స్

Submitted by chandram on Fri, 12/07/2018 - 20:54

శాసన సభ ఎన్నికల్లో గులాబీ ప్రభంజనం తప్పదని, జాతీయ ఛానెళ్ల ఎగ్జిట్‌ పోల్స్ తేల్చేశాయి. కేసీఆర్‌కు జనం బ్రహ్మరథం పట్టారని అంచనా వేశాయి. దాదాపు అన్ని జాతీయ ఛానెల్స్‌, కేసీఆర్‌ గెలుపు ఖాయమని తేల్చేయగా, ఒక్క రిపబ్లిక్‌ టీవీ మాత్రం హోరాహోరి తప్పదని లెక్కకట్టింది. చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తును జనం తిరస్కరించారని, కేసీఆర్ పథకాలు కొనసాగాలని, మెజారిటీ జనం గులాబీ పార్టీకే ఓట్లేశారని ఛానెల్స్ విశ్లేషించాయి. ఏ ఛానెల్‌, ఏ పార్టీకి ఎన్ని సీట్లిచ్చిందో ఒక్కసారి చూద్దాం.

కేసీఆర్‌పై చర్య తీసుకోండి: నల్లు

Submitted by arun on Fri, 12/07/2018 - 15:58

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ అగ్రనేత నల్లు ఇంద్రసేనా రెడ్డి ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌... తాము గెలవబోతున్నామని ఎలా చెప్పారని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. సిద్ధిపేట జిల్లా చింతమడకలో ఓటు వినియోగించున్న తర్వాత... మీడియాతో మాట్లాడుతూ సీఎం హోదాలో తెరాస అధికారంలోకి రాబోతుందని పొరపాటున కాకుండా కావాలనే ఓటర్లను ప్రభావితం చేసేలా చెప్పడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే సీఎంపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్‌ అంటే...ఖావో కమీషన్‌ రావు

Submitted by arun on Wed, 12/05/2018 - 16:22

కేసీఆర్‌ అంటే ఖావో కమీషన్‌ రావని రాహుల్‌ మరోసారి విమర్శించారు. కోదాడలో కాంగ్రెస్‌ ప్రచార సభకు హాజరైన రాహుల్‌  నాలుగన్నరేళ్ల టీఆర్ఎస్‌ పాలనలో యువతకు, రైతులకు కేసీఆర్‌ చేసిందేమీలేదని విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు మాత్రమే కేసీఆర్‌ అండగా ఉన్నారని రాహుల్ ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల పేరు మార్చి 50 వేల కోట్లు దోచుకున్నారని ఈ నాలుగేళ్లలో కేటీఆర్‌ ఆదాయం 400 శాతం పెరిగిందని రాహుల్‌ తెలిపారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలపై తలా 2లక్షల అప్పుందని రాహుల్‌ అన్నారు.

కేసీఆర్‌కు ఆనాడు మంత్రి పదవి ఇచ్చి ఉంటే...

Submitted by arun on Wed, 12/05/2018 - 13:17

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  కేసీఆర్‌కు నాడు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీయే ఉండేది కాదన్నారు. తనను తిడుతూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్న కేసీఆర్ గతాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్‌దేనంటూ చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణలో ఉన్న వనరులు ఎక్కడా లేవన్నారు. తెలంగాణకు కేసీఆరే ప్రధాన సమస్యగా మారారని విమర్శించారు. అభివృద్ధి ఫలాలను కేసీఆర్ కుటుంబం అనుభవిస్తోందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక పోడు భూముల్ని రైతులకు ఇస్తామని హామీ ఇచ్చారు.

సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఈరోజు కేసీఆర్ సభ

Submitted by arun on Wed, 12/05/2018 - 10:21

టీఆర్‌ఎస్‌ను మరోసారి అధికారంలోకి తేవడానికి రాష్ట్రమంతా చుట్టేసిన కేసీఆర్‌ కానీ తన సొంత నియోజకవర్గంలో ఒక్కసారి కూడా ప్రచారం నిర్వహించలేదు. తన నియోజకవర్గ బాధ్యతల్ని హరీ‌ష్‌‌రావుకి అప్పగించిన కేసీఆర్‌ గడువు ముగుస్తున్న చివరి రోజు మాత్రమే ప్రచారంలో పాల్గొనబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం రాష్ట్రమంతా చుట్టేసిన గులాబీ బాస్‌ కేసీఆర్‌ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌‌లో మాత్రం ఇంతవరకూ ప్రచారం చేయలేదు. అయితే చివరి రోజు అభ్యర్థులంతా తమ సొంత నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించిన కేసీఆర్‌ తాను కూడా గజ్వేల్‌లో సభ నిర్వహించేలా ‎షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు.

Tags