police

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో హైటెక్‌ వ్యభిచారం

Submitted by arun on Sat, 02/24/2018 - 10:49

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న వైనాన్ని గుంటూరు అర్బన్‌ పోలీసులు శుక్రవారం రాత్రి బట్టబయలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. క్ష్మీపురంలోని బౌన్స్ బ్యూటీ అండ్ మసాజ్ సెంటర్‌పై దాడులు నిర్వహించారు. ఇక్కడ మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఒక్కసారిగా దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు మహిళలు, నిర్వాహకుడు రామచంద్రరావుతోపాటు అతని అసిస్టెంట్‌, ఒక విటుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18వేల రూపాయల నగదుతోపాటు, 11సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

బొటానికల్‌ గార్డెన్‌ దగ్గర మహిళ హత్యకేసులో వీడిన మిస్టరీ

Submitted by arun on Mon, 02/12/2018 - 10:34

రెండు వారాల క్రితం కొండాపూర్ బొటానికల్‌ గార్డెన్‌ వద్ద గోనె సంచుల్లో లభించిన మహిళ మృతదేహానికి సంబంధించిన కేసును సైబరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మృతురాలి భర్త, అత్త, మరిది ఈ ఘాతుకానికి పాల్పడ్డారని  గుర్తించారు. ఆదివారమే సీసీ ఫుటేజీ ఆధారంగా కొన్ని కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు సోమవారం నిందితులను కనుగొన్నారు. కొండాపూర్‌లోని ఒక బార్‌లో పనిచేసే అమర్‌కాంత్‌ ఝా, అతని తల్లి, మృతురాలి భర్త కలిసి ఈ దారుణానికి ఒడిగట్టగా.. అమర్‌ కాంత్‌, అతని తల్లి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పడేశారని పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో పోలీసులపై యువకుడి దాడి

Submitted by arun on Sat, 02/10/2018 - 11:04

హైదరాబాద్ లో నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ లో మద్యం రాయుడు హల్ చల్ చేశాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పూటుగా మద్యం సేవించిన మద్యం బాబు బ్రీత్ అనలైజర్ టెస్ట్‌కు నిరాకరించి దురుసుగా ప్రవర్తించాడు.  బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయగా.. 185 పాయింట్లు చూపించింది. వాహనాన్ని ఆపినందుకు మద్యం మత్తులో ఉన్న అంకిత్ పోలీసులపై చేయి చేసుకున్నాడు. పోలీసులపై దాడికి పాల్పడ్డ అంకిత్‌పై ఐపీసీ 353 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
 

వర్మకు షాకిచ్చిన సీసీఎస్ పోలీసులు

Submitted by arun on Thu, 02/08/2018 - 16:15

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రాంగోపాల్ వర్మకు సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీచేశారు. జీఎస్టీ (గాడ్ సెక్స్ అండ్ ట్రుత్)పై నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు వర్మకు నోటీసులందజేశారు. ఈ కేసులో వర్మ నేడు సీసీఎస్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా..విచారణకు హాజరుకాలేనని లాయర్ ద్వారా వర్మ పోలీసులకు తెలియజేశాడు. 

హైదరాబాద్ లో బయటపడిన మరో ఖాకీ నిర్వాకం

Submitted by arun on Wed, 01/31/2018 - 10:57

హైదరాబాద్‌లో మరో ఖాకీ నిర్వాకం బయటపడింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తన భార్యను ఎస్ఐ నర్సింహులు ట్రాప్ చేశాడని.. మల్కాజిగిరి డీసీపీ కి సతీష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను విడాకులు ఇవ్వమని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.. ఎస్ఐ నరసింహ బారి నుంచి తనను రక్షించాలని మల్కాజిగిరి డీసీపీని ఆశ్రయించిన బాధితుడు.. ఎస్ఐ క్రెడిట్ కార్డుతో తన భార్య షాపింగ్ కూడా చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసును చేధించిన పోలీసులు

Submitted by arun on Mon, 01/29/2018 - 12:58

నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 11మంది నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్న ఎస్పీ శ్రీనివాస్‌ హత్యలో రాజకీయం కోణం లేదని స్పష్టం చేశారు.

తొమ్మిది పుంజులపై కేసు..

Submitted by arun on Thu, 01/25/2018 - 17:34

మనుషులు చేసిన తప్పులకు... పుంజులు శిక్ష అనుభవిస్తున్నాయా ? స్వేచ్ఛగా ఉండాల్సిన కోడిపుంజులు స్టేషన్‌లో ఎందుకున్నాయ్ ? జీడిపప్పు, బాదంపప్పు తిన్న కోళ్లకు... ఫుడ్డే కరువయింది. పందెంరాయుళ్లు వ్యక్తిగత పూచికత్తుపై విడుదలయ్యారు ? మరీ కోడిపుంజులు ఏం నేరం చేశాయ్. పందెంరాయుళ్లు నేరం చేస్తే.... పుంజులెందుకు శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నాయ్. 

యువతి వీరంగం

Submitted by arun on Wed, 01/17/2018 - 10:46

హైద్రాబాద్ జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం మత్తులో ఓ యువతి హంగామా చేసింది. 20 నిమిషాలపాటు కారు దిగకుండా పోలీసులను ఇబ్బంది పెట్టింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది. తాగిన పర్సంటేజ్ ఎక్కువ ఉండటంతో పారిపోయే యత్నించింది. పారిపోతున్న మహిళను ట్రాఫిక్, సివిల్ పోలీసులు వెంబడించి పట్టుకుని కేసు నమోదు చేశారు. చివరకు పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. చివరికి ఆమె స్నేహితులు వేరే వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు.

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం

Submitted by arun on Fri, 12/29/2017 - 19:04

న్యూఇయర్‌కి ముందే హైదరాబాద్‌ మహానగరం డ్రగ్స్‌ మత్తులో జోగుతోంది. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి నుంచి ఎక్కాల్సిన కిక్కు మూడ్రోజుల ముందే మొదలైపోయింది. నగరంలో ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్‌ సరఫరా జరుగుతోంది. పోలీసులు ఎంతగా నిఘా పెట్టినా కేటుగాళ్లు మాత్రం యథేచ్ఛగా మత్తు పదార్ధాలు విక్రయిస్తూనే ఉన్నారు. దాంతో న్యూఇయర్‌కి ముందే యువత డ్రగ్స్‌ మత్తులోకి జారుకుంటోంది.

అందంగా ఉందని నిందితురాలితో పోలీసుకానిస్టేబుల్ సెల్ఫీ దిగి...

Submitted by arun on Mon, 12/25/2017 - 10:31

ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉందని అనుకుంటూ, ఓ నిందితురాలితో సెల్ఫీ దిగటమే కాకుండా, ఆమెను తనతో కలసి టూరుకు రావాలని కోరిన ఓ గుజరాత్ కానిస్టేబుల్ చిక్కుల్లో పడ్డాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, అహ్మదాబాద్ నగరంలోని దరియాపూర్ ప్రాంతానికి చెందిన అమీనా షేక్ (36) అనే మహిళ అక్రమంగా మద్యం బాటిళ్లను కారులో తీసుకువెళుతుండగా మొబైల్ పోలీసులు పట్టుకున్నారు. నిందితురాలైన అమీనా చాలా అందంగా ఉందని పోలీసు కానిస్టేబుల్ శైలేష్ చెబుతూ కారులోనే ఆమెతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇంత అందంగా ఉండటానికి ఏం క్రీమ్ రాస్తున్నావు అని కానిస్టేబుల్ శైలేష్ నిందితురాలిని అడిగినట్లు ఏసీపీ బల్దేవ్ దేశాయ్ చెప్పారు.