Bharat Ane Nenu Movie

‘ భరత్ అనే నేను ‘ సెన్సార్ రిపోర్ట్.. హైలైట్స్ ఇవే

Submitted by arun on Mon, 04/16/2018 - 15:56

పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మాత దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాబోతోందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఎ సట్టిఫికేట్ లభించింది. ఎలాంటి కట్స్ లేకుండా చిత్రానికి సర్టిఫికేట్ లభించినట్లు సమాచారం. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అడిస్తుండగా మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.