public meet

తెలంగాణ జన సమితి సభకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

Submitted by arun on Mon, 04/16/2018 - 15:53

తెలంగాణ జన సమితి సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 29న సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో సభ నిర్వహించుకునేందుకు మూడ్రోజుల్లో అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. పొల్యూషన్ కారణంగా నగరంలో సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పుపై తెలంగాణ జన సమితి పార్టీ నేతలు ఆనందం వ్యక్తంచేశారు.