beautician

వివాహేతర సంబంధమే కారణమా?

Submitted by arun on Sat, 08/25/2018 - 13:22

కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో దారుణం  జరిగింది.  బాపులపాడులో  పద్మ అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అమానుషంగా దాడి చేసి హత్యాయత్నం చేశారు.  నిన్న అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా హింసించారు. మోచేతి భాగంలో నరకడంతో భారీగా రక్తస్రావం జరిగింది. గొంతుకు ప్లాస్టిక్ కవర్లు చుట్టి చంపేందుకు యత్నించారు. కొన ఊపిరితో ఉన్న  పద్మను గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి విజయవాడ ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్సనందిస్తున్నారు .

Tags

బ్యూటిషియన్‌పై దారుణం : కాళ్లు, చేతులు కట్టేసి...

Submitted by arun on Sat, 08/25/2018 - 10:56

కృష్ణా జిల్లా బాపులపాడులో దారుణం జరిగింది. స్ధానికంగా ఉన్న పద్మ అనే బ్యూటిషయన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. అర్ధరాత్రి సమయంలో దాడి చేసిన దుండగులు కాళ్లు కట్టేసి చేతులు నరికారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  కొనఊపిరితో ఉన్న పద్మను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొద్ది కాలంగా భర్తకు దూరంగా ఉంటూ... బాధితురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటమే ఈ ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 

మిస్టరీ డెత్... లింగంపల్లిలో రైలెక్కిన తర్వాత ఏం జరిగింది..?

Submitted by arun on Thu, 04/19/2018 - 12:37

బ్యుటీషియన్ జ్యోతి మృతి కేసు విచారణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. దర్యాప్తు ముమ్మరం చేశామంటున్న పోలీసులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. జ్యోతి ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు పడిపోయిందా..? లేదా ఎవరైనా తోసేశారా..? ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు.. లవర్ సందీప్‌కు నిజంగానే ప్రమేయం ఉందా..? ఆ రోజు జ్యోతి వెంట ఎవరైనా ఉన్నారా..? అసలు సోమవారం నాడు ఏం జరిగింది..? ఇప్పటివరకు సమాధానం దొరకని ఈ ప్రశ్నల చుట్టే.. పోలీసుల విచారణ సాగుతోంది. 

బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి

Submitted by arun on Mon, 04/16/2018 - 14:54

వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ధారూర్ మండలం మైలారం రైల్వే స్టేషన్‌లో ఓ బ్యూటీషియన్ హత్యకు గురైంది. హైదరాబాద్ లో బ్యూటీషియన్  గా పనిచేస్తున్న జ్యోతి.. అమ్మమ్మ వాళ్లింటికి వెళ్తుండగా హత్యకు గురైంది. అయితే జ్యోతి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. జ్యోతి ప్రేమికుడు సందీప్‌పై ఆమె అక్క శోభ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.