vishal

నాని-శ్రీరెడ్డి ఇష్యూపై విశాల్ స్పంద‌న‌!

Submitted by arun on Wed, 06/13/2018 - 15:23

సోషల్ మీడియా సాక్షింగా నేచురల్ స్టార్ నాని, నటి శ్రీరెడ్డికి పెద్ద వార్ నడుస్తుంది. తాజాగా బిగ్ బాస్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్న నానిని టార్గెట్ చేస్తూ చేసిన వాఖ్యలకు నాని స్పందించి ఆమెకు లీగ‌ల్ నోటీసులు పంపించాడు.`స‌హ‌నానికి కూడా ఓ హ‌ద్దు ఉంటుంద`ని కామెంట్ చేస్తూ శ్రీరెడ్డిక పంపిన‌ లీగ‌ల్ నోటీసును త‌న ట్విట‌ర్ ఖాతాలో నాని పోస్ట్ చేశాడు. దానికి శ్రీరెడ్డి స్పందించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దారుణంగా ట్విట్ చేసింది.  తాజాగా ఈ వివాదంపై త‌మిళ హీరో విశాల్ స్పందించాడు.
 

వరలక్ష్మితో ఎఫైర్ గురించి స్పందించిన విశాల్!

Submitted by arun on Mon, 06/11/2018 - 12:58

చాలా కాలం తరువాత అభిమన్యుడు చిత్రంతో మంచి విజయం అందుకున్న విశాల్ జోష్ మీద ఉన్నాడు. సైబర్ వేదికగా జరుగుతున్న అక్రమాలని అభిమన్యుడు చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆడియన్స్ కు ఈ చిత్రం బాగా కనెక్ట్ కావడంతో ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో పెద్ద విజయంగా నిలిచింది. విశాల్, సమంత ఈ చిత్రంలో జంటగా నటించారు. మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడిగా అద్భుతంగా నటించారు. అర్జున్ పాత్ర ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది. తాజగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో విశాల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

రజనీకాంత్ కు మద్దతు ప్రకటించిన హీరో విశాల్

Submitted by arun on Thu, 01/04/2018 - 16:49

రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన సినీ నటుడు రజనీకాంత్‌కు చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ రజనీకాంత్‌కు మద్దతు పలికారు. రజనీకాంత్‌ పార్టీలో రాఘవ లారెన్స్‌ చేరే అవకాశముందని తెలుస్తోంది. ఇక తమిళ చిత్రపరిశ్రమలో కీలక హీరోగా ఉన్న తెలుగు వ్యక్తి విశాల్‌ సైతం తాజాగా రజనీకాంత్‌ మద్దతు పలికారు.  రజనీ కోసం ఓ కార్యకర్తలా పని చేస్తానని... మొత్తం 234 స్థానాల్లో ప్రచారం చేస్తానని విశాల్ తెలిపాడు. రజనీకి విశాల్ మద్దతు పలకడం కీలక పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో విశాల్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.

కీర్తి సురేష్‌, స‌మంత‌కి ఒకేలా..

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 13:59

2018 సంక్రాంతి క్రేజీ క‌థానాయిక‌లు కీర్తి సురేష్‌, స‌మంత‌కి స‌మ్‌థింగ్ స్పెష‌ల్ కానుంది. కాస్త వివరాల్లోకి వెళితే.. 2018 సంక్రాంతికి కీర్తి సురేష్ న‌టించిన రెండు భారీ బ‌డ్జెట్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. వాటిలో ఒక‌టి తెలుగు చిత్ర‌మైతే.. మ‌రొక‌టి త‌మిళ చిత్రం. కీర్తి న‌టిస్తున్న ఆ తెలుగు చిత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టిస్తున్న 25వ చిత్ర‌మైతే, త‌మిళ చిత్ర‌మేమో సూర్య న‌టిస్తున్న 'తానే సేరంద కూట్ట‌మ్‌'. ఈ రెండు కూడా కీర్తి కెరీర్‌కి కీల‌కమైన సినిమాలే.

క్యూ క‌డుతున్న విశాల్ సినిమాలు

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 16:20

పేరుకి తెలుగువాడైనా.. త‌మిళ చిత్రాల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు యువ క‌థానాయ‌కుడు విశాల్‌. 'పందెం కోడి', 'పొగ‌రు', 'పూజ' త‌దిత‌ర అనువాద‌ చిత్రాల‌తో తెలుగులోనూ మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్న విశాల్‌.. అతి త్వ‌ర‌లో 'డిటెక్టివ్‌'గా ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. త‌మిళంలో విజ‌యం సాధించిన 'తుప్ప‌రివాల‌న్'కి ఇది అనువాద రూపం.

సూర్యతో పోటీప‌డ‌నున్న విశాల్‌?

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 14:48

గ‌త వారం విడుద‌లైన త‌మిళ చిత్రం 'తుప్ప‌రివాల‌న్‌'తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు క‌థానాయ‌కుడు విశాల్‌. ప్ర‌స్తుతం ఆయ‌న‌ మూడు త‌మిళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలే 'ఇరుంబు తిరై', 'క‌రుప్పు రాజా వెల్లై రాజా', 'సండ‌ కోళి2'. వీటిలో 'ఇరుంబు తిరై' ముందుగా విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది. ఈ చిత్రంలో విశాల్‌కి జంట‌గా స‌మంత న‌టిస్తోంది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి చిత్ర‌మిదే కావ‌డం విశేషం. యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్‌.మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

రెండు సీక్వెల్స్‌లో కీర్తి సురేష్‌

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 13:31

టాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఇలా రెండు చోట్లా బిజీగా ఉన్న క‌థానాయిక‌ల్లో కీర్తి సురేష్‌ ఒక‌రు. తెలుగులో ఈ ముద్దుగుమ్మ న‌టించిన 'నేను శైల‌జ‌', 'నేను లోక‌ల్' చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. ఆమె న‌టించిన మూడో తెలుగు చిత్రం సంక్రాంతికి విడుద‌ల కాబోతోంది. ఆ చిత్ర‌మే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రానున్న హ్యాట్రిక్ ప్ర‌య‌త్నం.

విశాల్ 25వ చిత్రంగా 'సండ కోళి2'

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 12:23

13 ఏళ్ల క్రితం విడుద‌లైన 'చెల్ల‌మే' (తెలుగులో 'ప్రేమ చ‌ద‌రంగం')తో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు విశాల్‌. రెండో చిత్ర‌మైన 'సండ కోళి' (పందెం కోడి)తో స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న విశాల్‌.. ఇప్పుడు త‌న 25వ చిత్రంగా ఆ సినిమాకి సీక్వెల్ అయిన 'సండ కోళి 2' చేస్తున్నాడు. ఇవాళే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.

'డిటెక్టివ్‌'గా వ‌స్తున్న విశాల్ 

Submitted by nanireddy on Tue, 09/19/2017 - 12:51

'పందెం కోడి', 'పొగ‌రు', 'పూజ' త‌దిత‌ర చిత్రాల‌తో తెలుగులోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్నారు త‌మిళ కథానాయ‌కుడు విశాల్‌. స్వ‌త‌హాగా తెలుగువాడైన విశాల్‌.. త‌మిళ చిత్రాల‌కే ప‌రిమిత‌మైనా.. త‌న ప్ర‌తి చిత్రంతో ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తుంటారు. ఇదిలా ఉంటే.. గ‌త గురువారం విడుద‌లైన విశాల్ తాజా చిత్రం 'తుప్ప‌రివాల‌న్' త‌మిళ‌నాట వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది.