Kathua Rape Case

నన్ను రేప్ చేసి, చంపేస్తారేమో

Submitted by arun on Mon, 04/16/2018 - 15:12

సంచలనం సృష్టించిన కథువా కేసును వాదిస్తున్న లాయర్ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. హిందూ-ముస్లిం విబేధాల పొడచూసిన నేపథ్యంలో కథువా బాలిక హత్యాచారం కేసు విచారణ కోసం జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం ఇద్దరు సిక్కు మతస్తులైన లాయర్లను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా నియమించింది. కాగా, బాధితురాలి కుటుంబ తరఫున వాదిస్తానని అడ్వొకేట్‌ దీపికా సింగ్‌ రజావత్‌ ఇదివరకే ముందుకొచ్చారు. సోమవారం నాటి విచారణలో ఆమె వాదనే కీలకం కానుంది. దీపికా ఈ కేసును అంగీకరించింది మొదలు ఆమెకు పెద్ద ఎత్తున బెదింపులు వస్తుండం తెలిసిందే.

తీవ్ర ఒత్తిడిలో ఆసిఫా తల్లిదండ్రులు...గ్రామాన్ని వదలిపెట్టిన కుటుంబం

Submitted by arun on Mon, 04/16/2018 - 13:11

జమ్ముకశ్మీర్ బాలిక హత్య, హత్యాచారం ఒకవైపు దేశాన్ని కుదిపేస్తోంది. కానీ మరోవైపు జరుగుతున్న పరిణామాలు ఆ కుటుంబాన్ని చిత్రవధ చేస్తున్నాయి. ఎనిమిదేళ్ల చిన్నారిని దారుణంగా పోగొట్టుకొని కుమిలిపోతున్న కుటుంబానికి వివిధ వర్గాల నుంచి వస్తున్న సమస్యలు మరింత క్షోభకు గురిచేస్తున్నాయి. 

అలాంటివాళ్లను సింగపూర్ తరహాలో శిక్షించాలి : పవన్

Submitted by arun on Sat, 04/14/2018 - 16:35

మహిళలపై దాడులను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అమలు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు మానవత్వం ఉనికినే ప్రశ్నిస్తున్నాయన్నారు. కథువా ఘటనను నిరసిస్తూ నెక్లెస్ రోడ్ లో ఆయన దీక్ష చేపట్టారు.  

మనసును కదిలిస్తున్న సన్నీలియోని ట్వీట్‌

Submitted by arun on Sat, 04/14/2018 - 16:20

జమ్ముకశ్మీర్లోని కతువాలో ఎనిమిదేండ్ల బాలికని లైంగికంగా వేధించి ఆ తర్వాత బండరాయితో మోది చంపడం అందరిని కలిచి వేసింది. ఈ సంఘటనపై ప్రతి ఒక్కరు ఫైర్ అవుతున్నారు. నిందితులని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా ఈ దారుణ సంఘటనని వ్యతిరేఖిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ కూడా ఈ సంఘటనపై స్పందించింది. తన కూతురు(దత్త పుత్రిక) నిషా కౌర్ ను ఒడిలో పెట్టుకుని ఓ ఫోటో దిగి.. ఓ సందేశంతో ఆమె ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది.