sri reddy leaks

త్వరలోనే వీళ్లందరి దూల పవన్‌ తీర్చుతాడు : నాగబాబు

Submitted by arun on Wed, 04/18/2018 - 13:05

సెలైంట్‌గా ఉన్నామ్‌ కదా అని.... ఏం మాట్లాడినా పడతామనుకోవద్దని వార్నింగ్‌ ఇచ్చారు నాగబాబు. తమ జోలికి రావొద్దంటూ ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. సాఫ్ట్‌ టార్గెట్‌ అనుకొని మెగా ఫ్యామిలీ మెంబర్స్‌పై రాళ్లు వేయొద్దన్న నాగబాబు తమ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. ఇకపై ఎలా రియాక్ట్‌ అవుతామో తెలియదన్నారు. తమ సహనాన్ని ఓర్పుని చేతగానితనంగా తీసుకోవద్దన్నారు. తన హెచ్చరికల్ని అంత ఈజీగా తీసుకోవద్దన్నారు. తల్లిని అంటే ఎవరైనా భరిస్తారా? అంటూ ఆవేదన వ్యక్తంచేసిన నాగబాబు ఆడపిల్ల కాబట్టే వదిలేశామన్నారు.

శ్రీరెడ్డి గెలుపు.. దిగొచ్చిన ‘మా’ అసోసియేషన్..

Submitted by arun on Fri, 04/13/2018 - 11:03

మొత్తానికి శ్రీరెడ్డి విషయంపై మా అసోసియేషన్ దిగొచ్చింది. ఆమెపై విధించిన నిషేదాన్ని ఎత్తివేసింది. గురువారం సాయంత్రం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ప్రెస్ మీట్ లో మా అధ్యక్షుడు శివాజీరాజా, నటులు నరేష్, జెమిని కిరణ్, భరద్వాజ, డైరెక్టర్ శంకర్ పాల్గొన్నారు. ఆరోజున ఆమె చేసిన పని కారణంగా ఆవేశంతో అలా మాట్లాడమన్న మా అధ్యక్షుడు.. ఆమెను తమలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పాడు. 'మా లాగే ఎంతో మంది ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని మంచి పేరు తెచ్చుకోవాలని.. రెండు రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది అవకాశాలు ఇప్పించలేదు. దర్శకులు..

దిల్ రాజుపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్!

Submitted by arun on Wed, 04/11/2018 - 16:15

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న నటి శ్రీ రెడ్డి తాజాగా నిర్మాత దిల్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అనూహ్యంగా నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రకంపనలు రేపుతోంది. టాలీవుడ్ నుంచి దిల్ రాజు పోతే శని వదిలిపోతుందని, ఆయన కుల రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించింది. ఆయన చేతుల్లో ఎంతో మంది నలిగిపోతున్నారని ఆరోపించింది. ‘కుల రాజకీయాలు వద్దన్నా. ఆడ పిల్లలన్నా. బతకనిద్దామన్నా పాపం. దిల్ రాజు (రెడ్డి) గారూ...