telugu

తమిళంలో కన్నా తెలుగులో పైసా వసూల్

Submitted by arun on Wed, 09/26/2018 - 17:01

కొన్ని సిన్మాలు తీసిన బాషలో కన్నా, ఇతర బాషలలో డబ్బింగ్ చేసినపుడు అవి బాగా నడుస్తాయి... అలా నడవటం వల్ల ఆ సినిమా నిర్మాతలకి కొంత లాభం కలుగుతుంది. అలా 7/జీ బృందావన్ కాలనీ, అపరిచితుడు,  బిచ్చగాడు, వంటి సినిమాలు తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ విజయవంతమయ్యాయి.  అందుకునేమో ప్రతి హీరో తన మార్కెట్ని పెంచుకోవాలని తపిస్తువుంటారు. శ్రీ.కో.

ద్రవిడ నిధి మన దక్షిణామూర్తి

Submitted by arun on Wed, 08/08/2018 - 12:44

ద్రవిడ యోధుడు మన దక్షిణామూర్తి,

ఇకలేడు,తిరిగిరాని లోకాలకి ఎగినాడు,

తెలుగు బిడ్డ, తమిళ మహా నాయకుడు ,

పేదల అండ దండ అంతిమ శ్వాస వదిలాడు. శ్రీ.కో

కరుణానిధి మన తెలుగింటి బిడ్డే...మాతృభాష కూడా తెలుగే

Submitted by arun on Wed, 08/08/2018 - 10:22

తమిళ సాహిత్యంపై పట్టు సాధించారు రచయితగా చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు. అక్కడి రాజకీయాలను శాసించారు ముఖ్యమంత్రిగా ఏలారు. అరవ ప్రజల హ్రుదయాలను గెలుచుకున్నారు వారి మన్నలను కూడా పొందారు. అలాంటి కరుణానిధి తమిళుడేనా..? ఆయన మూలాలు ఎక్కడ..? ఆయన తెలుగువారంటే నమ్ముతారా..? 

 ద్రవిడ రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు అరవ రాజకీయాలను శాసించిన ధీరుడు తమిళ సూరీడు కరుణానిధి. మనకు తెలిసినంత వరకు కరుణానిధి అంటే పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తే. కానీ అది నిజం కాదు. కరుణానిధి అచ్చంగా తెలుగువారే. తమిళ సాహిత్యంపై అసమాన ముద్ర వేసిన కరుణానిధి మాతృభాష కూడా తెలుగే. 

బిగ్ బాస్-2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలో టాప్ హీరోయిన్..

Submitted by arun on Tue, 06/12/2018 - 10:40

నాని హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్-2 మొదలైంది. మొదటిరోజు పరిచయ కార్యక్రమంతోనే ముగియగా కంటెస్టంట్స్ ఒక్కరోజులో కొన్ని తేడాలు గమనించడం జరిగింది. ఈసారి 16 మంది కంటెస్టంట్స్ లో ముగ్గురు కామన్ మెన్ కావడంతో కొద్దిగా చేంజ్ కనబడుతుంది. మిగతా వారంతా ఎలాగోలా సినిమాకు సంబందించిన వారే కాని ఈ ముగ్గురు బాబు గోనినేనితో కలిపి నలుగురు కాస్త కొత్తగా అనిపిస్తున్నారు. మరో వారం రోజులు చూసి, వీలైనంత తొందరగా వైల్డ్ కార్డ్ ఎంట్రీని రంగంలోకి దించాలని చూస్తోందట స్టార్ మా. ఈ మేరకు ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు పరిశీలించిన యాజమాన్యం.. ఓ ముద్దుగుమ్మను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు..

తెలుగు త‌ల్లికి వంద‌నం

Submitted by lakshman on Mon, 09/18/2017 - 20:10
తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా.. తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా.. అంటూ తెలుగు అందాలను అధ్బుతంగా వర్ణించారు ప్రముఖ సినీకవి ఆచార్య ఆత్రేయ. నిజంగానే తెలుగు భాష తియ్యదనం అలాంటిది మరి. అందుకే  తెలుగు భాష ప్రాధాన్యాన్ని అలనాటి శ్రీకృష్ణదేవరాయలి నుంచి నేటి పాలకుల వరకు...