vijay devarakonda

ఆ అవకాశం వస్తే.. విజయ్‌ దేవరకొండలా మారిపోతా

Submitted by arun on Mon, 11/26/2018 - 14:42

ఇటీవల విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ సినిమా చేయనున్నట్టు ఒక వార్త షికారు చేసింది. ఆ వార్తలో నిజం లేదు గానీ, జాన్వీ కపూర్ నోట విజయ్ దేవరకొండ మాట వచ్చిందనేది మాత్రం వాస్తవం. కరణ్ జోహర్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' షోకు ఇటీవల శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వెళ్లింది. ఆ సమయంలోనే 'రేపు పొద్దున్న నిద్రలేవగానే నువ్వొక మగాడిగా మారిపోతావ్' అంటే, ఎవరిలా మారిపోవాలని కోరుకుంటావు?' అనే ప్రశ్న జాన్వీకి ఎదురైంది. దీనికి జాన్వీ కపూర్ తడుముకోకుండా.. విజయ్ దేవరకొండ అంటూ సమాధానం ఇచ్చింది. అంతే కాదు తనతో సినిమా చేయాలనే కోరికని కూడా బయట పెట్టింది.

బ్లాక్ బస్టర్ కాదంటున్న దేవరకొండ!

Submitted by chandram on Fri, 11/16/2018 - 17:39

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే సినిమా ఫైరసీ అయిన విషయం తెలిసిందే అయితే ఫిలీం మేకర్స్ మాత్రం టాక్సీవాలాను థీయేటర్లులోనే చూడాలని చెబుతున్నారు. కాగా విజయ్ తాజాగా ఒక ఇంటర్వులో టాక్సీవాల సినీమా గురించి మాట్లాడుతూ పెట్టిన పెట్టుబడి కంటే  నాలుగింతలు ఎక్కువే సంపదించే పెడుతుంది కాని "గీతగోవిందం' స్థాయి సినిమా కాదని స్పష్టం చేశారు. ఈ సినిమా హీరోయిన్ ప్రియాంక మాత్రం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని విజయ్ మంచి నిజమైన నటుడని పొగిడింది. ఇగా ఇంకో ఆర్ర్నేళ్ల పాటు సినిమాను ముట్టుకొనని తెలిపారు.

విజయ్ దేవరకొండ మెసేజ్‌పై సూర్య ఆసక్తికర స్పందన

Submitted by chandram on Wed, 11/14/2018 - 16:44

చాలా తక్కువ కాలంలోనే యువతను ఆకట్టుకుట్టుకొని, తన నటన, భాషతో ఏకకాలంలోనే అందరినీ తన బుట్టలో వేసుకున్నాడు హీరో విజయదేవరకొండ. విజయ్ కి సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అలా యువతలో బ్రాండ్ గా నిలిచిన ఈ యువ హీరో తాజాగా టాక్సివాలా చిత్ర షూటింగ్ పూర్తిచేసుకొని ఈనెల 17న పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే టాక్సీవాలా ట్రయిలర్ కి మంచి ఆధరణ రావడంతో విజయ్ తన ఆనందాన్నిట్వీట్టర్ వేదికగా అభిమానదేవుళ్లకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ నేను భాదలో ఉన్నప్పుడు నాకు దైర్యాన్ని ఇచ్చిది ఎవరో తెలుసా? మీరే.

నోటాకు ఎందుకు టాటా? అసలు ఏముంది ఆ మూవీలో!?

Submitted by arun on Thu, 10/04/2018 - 16:27

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నోటా మూవీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు మరో వైపు నోటా మూవీని అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు నోటాకు ఎందుకు నో చెబుతున్నారు ? నిజంగానే ఓ పార్టీకి అనుకూలంగానే ఈ చిత్రాన్ని నిర్మించారా ? మూవీ విడుదలయితే శాంతి భద్రతలు తలెత్తే ప్రమాదముందా ? లేక ఈ చిత్రం నిజంగానే ప్రేక్షకులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయా ? 

విజయ్ దేవరకొండ 2

Submitted by arun on Fri, 09/28/2018 - 17:03

ఒక హీరో సూపర్ సక్సెస్ అయితే ... అందరికి అందనంత ఎత్తుకు ఎదిగితే... మరి వారి కుటుంబ సబ్యులు కూడా సినిమాల్లో రావటం ఎన్నో సార్లు చూసాం... డిమాండ్ ఎక్కువ... కానీ సప్లై తక్కువ అయిన సందర్బంలో ఇవి తప్పవు... అయితే ... ఇప్పుడు మన ముద్దుల 'అర్జున్ రెడ్డి” తో ఈ నాటి  పోరగాలల్లో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న బంగారు కొండ విజయ్ దేవరకొండకు స్టార్డం పీక్స్ కు చేరింది. విజయ్ డేట్స్ కొన్ని ఏళ్ల వరకూ దొరికే పరిస్థితి లేదంటేనే మనం విజయ్కి వున్నా కమిట్మెంట్స్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే  విజయ్ తన తమ్ముడు ఆనంద్ ను హీరో గా పరిచయం చేస్తున్నాడని ఇండస్ట్రీ లో సీక్రెట్ టాక్..

జగన్ పాత్రలో సెన్సేషనల్ హీరో

Submitted by arun on Fri, 09/14/2018 - 13:24

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా 'యాత్ర' సినిమా రూపొందుతోంది. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ సినిమాలో జగన్ పాత్రలో ఏ హీరో నటించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. సూర్య గానీ .. కార్తీ గాని జగన్ పాత్రలో కనిపించవచ్చనే టాక్ వచ్చింది. వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం కారణంగానే వారిద్దరిలో ఎవరో ఒకరు ఇందులో నటించనున్నారని టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు ఫిలింనగర్‌లో సమాచారం.

విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రంలో న‌టిస్తున్న స్టార్ డైరెక్ట‌ర్‌

Submitted by arun on Wed, 09/12/2018 - 11:19

యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న ద్విభాషా చిత్రం నోటా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగానే రిలీజ్ అయ్యింది. ఇందులో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో దర్శకుడు మురుగదాస్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నోటా దర్శకుడు ఆనంద్‌ శంకర్‌.. మురుగదాస్‌ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేశారు. ఇప్పుడు తన గురువునే డైరెక్ట్‌ చేస్తుండటంపై ఆనంద్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పూరి వేయబోతున్నడట మరో సినిమా దోశ

Submitted by arun on Mon, 09/10/2018 - 11:48

పూరి వేయబోతున్నడట మరో  సినిమా దోశ,

దేవరకొండతో రుచించునని ఈ మసాలా ఆశ,

ఈనాటి ఇడియట్ కొడతాడట మాటల బాషా,

అంతా ఆ గోవిందుడి చేతిలోని తమాషా. శ్రీ.కో. 

మిమ్మల్ని సతాయిస్తే బాగుంటుంది కదా

Submitted by arun on Fri, 08/24/2018 - 10:48

నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. 'గీత గోవిందం' చిత్ర బృందాన్ని అభినందించారు. గురువారం కవిత ఈ సినిమా చూశారట. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌లను కలిశారు. ఈ సందర్భంగా తాను గీతగోవిందం సినిమాను రెండు సార్లు చూసినట్టు కవిత వెల్లడించారు. సినిమా చూశారా? ఎలా ఉంది? అని కవితను విజయ్ దేవరకొండ అడగ్గా.. ‘మస్తుంది సినిమా.. మిమ్మల్ని సతాయిస్తే బాగుంటుంది కదా’ అని నవ్వుతూ తెలిపారు. ‘సినిమా రెండు సార్లు చూశాను. ఫస్ట్ నేను చూశాను. తరువాత మా వదినా వాళ్లు చూద్దాం అంటే వెళ్లాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలనుకుంటున్నారు’’ అని తెలిపారు కవిత.

విజయ్ దేవరకొండకు మరో ఎదురుదెబ్బ..

Submitted by arun on Tue, 08/21/2018 - 09:47

ఎన్నికేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా లీకు వీరులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో సీన్లను లీక్ చేసిన దుండగులు.. విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమాను రిలీజ్ కు ముందే బయటపెట్టారు. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమా ‘ట్యాక్సీవాలా’కు షాక్ తగిలింది. ఇంకా రిలీజ్ కాకముందే ఈ సినిమా హెచ్ డీ ప్రింట్ ను కొందరు దుండుగులు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. నిర్మాణ సంస్థ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.