Uttam Kumar

ఉత్తమ్.. కేటీఆర్... ఓ వృద్ధ జంట

Submitted by arun on Wed, 06/13/2018 - 10:42

ఉన్నది పది అడుగుల గుడెస... తాళ్లు పేనుకుంటూ జీవనయాత్ర సాగిస్తున్న వృద్ధ దంపతులు, ఆదుకునే బిడ్డలు లేదు.. అన్నం పెట్టే నాధుడు లేడు.. రోజూ నాలుగువేళ్లూ నోట్లోకి వెళ్లే పరిస్థితి లేదు.. కానీ దోచుకునే అధికారులు పక్కనే ఉన్నారు.. గుడిసెపై 500 ఆస్తి పన్ను వేశారు అధికారులు.. ఇదేంటి బాబూ అంటూ కాళ్లా వేళ్లా పడినా కనికరించలేదు... వృద్ధుడికి వచ్చే నెలవారీ ఫించన్ నుంచి కట్ చేసుకొని మిగిలింది ఇచ్చారు.. ఈ సంఘటన కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్లూర్‌ మండలం కర్దెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. 

ఉత్తమ్‌ ఆలోచన వెనుక ఉన్న అసలు కథేంటి?

Submitted by arun on Tue, 04/03/2018 - 12:12

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... బస్సుయాత్ర రూట్‌ను అతి జాగ్రత్తగా ప్లాన్ చేసకుంటున్నారా? వివాదాలు, విభేదాలు లేని ప్రాంతాల్లోనే యాత్ర చేయాలన్నది ఆలోచనా? ఇప్పటి వరకు జరిగిన బస్సుయాత్ర రూట్ చూస్తే అలానే అనిపిస్తుందా? ఉత్తమ్‌ ఆలోచన వెనుక ఉన్న అసలు కథేంటి?

సీనియర్లంతా ఏకమై వ్యతిరేకించినా పంతం నెగ్గించుకొని బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు ఉత్తమ్‌కుమార్‌. తేదీల్లో మార్పులు చేయమని సలహా ఇచ్చినా సెంటిమెంట్‌ పేరుతో తాను అనుకున్న తేదీకే యాత్ర  ప్రారంభించారు. మొదటి దశలో ఎదురైన సవాళ్లను రెండో విడతలో ఎదురవకుండా అతి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.