government

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

Submitted by arun on Fri, 08/24/2018 - 16:17

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే,

సెప్టెంబర్ 6న ప్రారంభమవుతాయని తెలిసే,

స్పీకర్ కోడెల శివప్రసాద్ మీడియాకు తెలిపే,

మరి చర్చలు వినపడ్తాయో, అరుపులు వినపదతాయో,

చూడాలి...టీవిలో ప్రజలు. శ్రీ.కో. 

ఏపీ హోంగార్డులకు శుభవార్త

Submitted by arun on Fri, 06/15/2018 - 16:10

హోంగార్డుల దినసరి వేతనం మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. హోంగార్డుల మెటర్నిటీ సెలవులను మూడు నెలలకు పెంచుతునట్లు తెలిపారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి హోంగార్డులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి.. వెంటనే పలు నిర్ణయాలను ప్రకటించారు. హోంగార్డులకు జీతం పెంపుతో పాటు..రెండున్నర లక్షల రూపాయల వైద్య సేవలు అందిస్తామన్నారు. గృహనిర్మాణ పథకంలో హోంగార్డులకు ఇళ్ల కేటాయింపు విషయం పరిశీలించాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 

తెలంగాణలో తెలుగు తప్పనిసరి

Submitted by arun on Mon, 06/11/2018 - 16:46

తేనెలొలికే భాష.. అమ్మదనం నిండిన కమ్మనైన భాష.. ప్రాచీన హోదా కలిగిన భాష తెలుగు. అంత గొప్ప బాష.. ఇకనుంచి తెలంగాణలో వెలిగిపోనుంది. మాతృభాష తెలుగుకు పట్టం కట్టేందుకు.. సర్కార్ సిద్ధమయ్యింది. సీబీఎస్‌ఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, కేంబ్రిడ్జి తదితర సిలబస్‌ను అనుసరించి నడిచే పాఠశాలల్లో కూడా.. ఒకటో తరగతి నుంచి తెలుగు తప్పనిసరిగా బోధించనున్నారు. 

హెలికాఫ్టర్ టాక్సీలు

Submitted by arun on Tue, 06/05/2018 - 13:56

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రయానికుల సౌకర్యార్ధం హెలికాఫ్టర్ టాక్సీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ జబ్బర్ హట్టి విమానాశ్రయం వద్ద ఈ హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. ఈ హెలీ టాక్సీల ద్వారా షిమ్లా నుంచి చండీఘర్ వరకు గల దూరాన్ని కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ సేవలు విజయవంతం అయిన తర్వాత రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. పవన్ హన్స్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో హిమాచల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెలీ టాక్సీ సేవలు సోమవారం నుంచి శుక్రవారం వరకు అందుబాటులోకి ఉంటాయి. 20 నిమిషాల పాటు కొనసాగే ఈ ప్రయాణానికి 2999 రూపాయలు వసూలు చేస్తున్నారు.

మోడీ సర్కారుకు ఇదే ఆఖరి పూర్తి స్థాయి బడ్జెట్‌

Submitted by arun on Thu, 02/01/2018 - 10:21

అరుణ్‌ జైట్లీ ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అప్పుడు ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెట్‌ మాత్రమే. దీనికితోడు త్వరలో ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏవైనా తాయిలాలు ఇవ్వాలంటే.. ఈ బడ్జెట్‌లోనే సాధ్యం. ఈ నేపథ్యంలో జైట్లీ గ్రామీణ భారతావనిపై దృష్టి పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

విద్యార్థులకూ రక్షణలేదు!

Submitted by lakshman on Mon, 09/18/2017 - 17:41

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో విద్యను అందిస్తామని చెప్పి...విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలకు లక్షలు ఫీజులు గుంజే ఇంటర్నేషనల్ స్కూళ్లలో రక్షణ ఉండటం లేదని మరోసారి రుజువైంది. దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉండే గురుగ్రామ్‌లో ఓ దారుణం జరిగింది. నగరంలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న చిన్నారి బాలుడిని అత్యంత పాశవికంగా చంపేశారు. ఉదయం టాయ్‌లెట్‌కు వెళ్లిన విద్యార్థులకు రక్తపు మడుగులో ఓ బాలుడి మృతదేహం కనిపించింది. వెంటనే విషయాన్ని స్కూల్ సిబ్బందికి తెలియజేశారు. యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.