Vikarabad

స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Mon, 11/12/2018 - 10:45

హైదరాబాద్ పేరు మార్చి కొత్త పేరు పెడతాం తెలంగాణలో కొన్ని పట్టణాల పేర్లు మార్చేస్తాం..  ఇది విన్నాక అవునా.. నిజమా అన్న సందేహం వస్తుందా..? అవును తమ పార్టీ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో పలు ప్రాంతాల పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామని రాజకీయ నాయకులు ప్రకటిస్తున్నారు.. ఇంతకీ ఎవరా నేతలు.. ఏంటా కథ.. తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. 

వికారాబాద్‌లో ప్యారాషూట్‌ కలకలం

Submitted by arun on Mon, 10/29/2018 - 13:27

వికారాబాద్ జిల్లాలో  ఓ ప్యారాషూట్‌ అకస్మాత్తుగా కుప్పకూలడం కలకలం రేగింది. ఊటుపల్లి ఫారెస్ట్‌లో పారాచ్యూట్ కూలిపోయింది. దీన్ని చూసిన స్ధానికులు భయంతో పరుగులు పెట్టారు. దీంతో చుట్టుపక్కల వారు  పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే అది వాతావారణ పరిశోధన శాఖకు చెందిన ప్యారాషూట్‌గా అధికారులు గుర్తించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పరిశోధనలో భాగంగానే అటవీ ప్రాంతంలో ప్యారాషూట్‌ని దించామని టీఐఎఫ్‌ఆర్‌ సిబ్బంది పేర్కొంది. ప్యారాషూట్ చెందిన విడిభాగాలు వేర్వేరు గ్రామాల్లో పడిపోయినట్టు గుర్తించారు.

టీసీ నుంచి తప్పించుకోవడానికి రైలు నుంచి దూకి..

Submitted by arun on Sat, 09/15/2018 - 11:22

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. రైల్వే టీసీ ఓవరాక్షన్ ఓ యువకుడి ప్రాణం తీసింది. తాండూరు నాంపల్లి ప్యాసింజర్ ట్రైన్ లో ఈ ఘటన జరిగింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న యువకుడ్ని పట్టుకునేందుకు టీసీ ప్రయత్నించాడు. భయపడి  దూకేయండంతో రైలు కింద పడి మృతి చెందాడు. గొల్లపూడి స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన అనంతరం టికెట్‌ కలెక్టర్‌ను ప్రయాణికులు చితకబాదారు. మృతున్ని వికారాబాద్‌ పరిధి అనంతగిరిపల్లి తండా వాసి కాట్రావత్‌ శివగా గుర్తించారు.
 

Tags

మిస్టరీ డెత్... లింగంపల్లిలో రైలెక్కిన తర్వాత ఏం జరిగింది..?

Submitted by arun on Thu, 04/19/2018 - 12:37

బ్యుటీషియన్ జ్యోతి మృతి కేసు విచారణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. దర్యాప్తు ముమ్మరం చేశామంటున్న పోలీసులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. జ్యోతి ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు పడిపోయిందా..? లేదా ఎవరైనా తోసేశారా..? ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు.. లవర్ సందీప్‌కు నిజంగానే ప్రమేయం ఉందా..? ఆ రోజు జ్యోతి వెంట ఎవరైనా ఉన్నారా..? అసలు సోమవారం నాడు ఏం జరిగింది..? ఇప్పటివరకు సమాధానం దొరకని ఈ ప్రశ్నల చుట్టే.. పోలీసుల విచారణ సాగుతోంది. 

బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి

Submitted by arun on Mon, 04/16/2018 - 14:54

వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ధారూర్ మండలం మైలారం రైల్వే స్టేషన్‌లో ఓ బ్యూటీషియన్ హత్యకు గురైంది. హైదరాబాద్ లో బ్యూటీషియన్  గా పనిచేస్తున్న జ్యోతి.. అమ్మమ్మ వాళ్లింటికి వెళ్తుండగా హత్యకు గురైంది. అయితే జ్యోతి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. జ్యోతి ప్రేమికుడు సందీప్‌పై ఆమె అక్క శోభ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

బండ కింద పాముల పుట్ట

Submitted by arun on Sat, 03/31/2018 - 13:06

ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో పాముల పిల్లలు. అది కూడా ఒకే బండరాయి కింద బయటపడ్డాయ్. వందల సంఖ‌్యలో పాములను చూసిన గ్రామస్తులే విస్తుపోవాల్సి పరిస్థితి ఎదురైంది. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జలాల్‌పూర్‌కు చెందిన మొగులప్ప సోదరుడికి కాలు విరగడంతో ఇంటి ముందున్న బండరాయిపై చెట్ల పసురు తీస్తుండగా ఓ పాము బయటికి వచ్చింది.