pakistan

పాకిస్తాన్ అదుపులో 28 మంది ఆంధ్రా జాలర్లు..

Submitted by arun on Fri, 11/30/2018 - 10:01

బతుకు తెరువు కోసం వలస వెళ్లిన 28 మంది ఆంధ్రా జాలర్లు పాకిస్థాన్‌ కోస్టు గార్డు చెరలో చిక్కుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ తీర ప్రాంత భద్రతా దళం చేతిలో బందీగా మారారు. పాక్ అరెస్టు చేసిన వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన  20 మంది, విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. చేపల వ్యాపారం చేసే ఓ కాంట్రాక్టర్ దగ్గర గుజరాత్‌లో పని చేస్తున్న ఈ 28 మంది పొరబాటున పాకిస్థాన్‌ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వారిని ఆ దేశ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఎ సంవత్సరంలో విడిపోయింది

Submitted by arun on Thu, 11/22/2018 - 13:26

పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఎ సంవత్సరంలో వేరుచేయబడిన్దో మీకు తెలుసా!  పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఈ సంవత్సరంలో వేరుచేయబడిన సంవత్సరం.. 1971. అయితే  25 మార్చి 1971 న పాకిస్తాన్ సైన్యం యొక్క క్రూరమైన ఆపరేషన్ సెర్చ్ లైట్ను బంగ్లాదేశ్ స్వాతంత్రం ప్రకటించింది మరియు 26 మార్చి అర్ధరాత్రి దేశవ్యాప్తంగా ప్రతిఘటనను ప్రకటించింది, ఇది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధాన్ని అధికారికంగా కొన్ని గంటలలో ప్రారంభించడానికి దారితీసింది అని చరిత్రకారులు అంటారు. శ్రీ.కో.

3800 మంది సిక్కుల‌కు పాక్‌ వీసాలు...

Submitted by chandram on Wed, 11/21/2018 - 15:38

ఈ ఏడాది అంగరంగ వైభవంగా లాహోర్‌లోని నాన్‌క‌నా సాహిబ్‌లో 549వ గురునానక్ జయంతికి సర్వంసిద్దం అయిపోయింది. ఉత్సవాల్లో భాగంగా పాకిస్థాన్ సర్కార్ ఒకేసారి 3800 మంది భారతీయులకు వీసాలు జారిచేసింది. సిక్కు యాత్రికుల‌కు అధిక సంఖ్యలో వీసాలు జారీ చేయ‌డం ఇదే మొట్ట మొద‌టిసారి పాకిస్థాన్ హై క‌మీష‌న్ వెల్లడించింది. ప్రతిఏటా లాగానే సిక్కులకు వీసాలు జారీ చేస్తారు కాగా పెద్ద సంఖ్యలో వీసాలు ఇవ్వడం ప్రత్యేకమైందని పాక్ హై క‌మీష‌న‌ర్ వెల్లడించారు. పక్కదేశాల్లో ఉన్న సిక్కుల కూడా పాక్ సర్కార్ వీసాలు ఇచ్చింది.

కాల్పుల ఒప్పందానికి పాక్ తూట్లు..జవాన్ మృతి

Submitted by chandram on Sat, 11/10/2018 - 13:47

కాల్పుల ఒప్పందానికి మరో సారి పాక్ తూట్లు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రత్యేర్థే టార్గెట్ గా పాక్ సైన్యం విరుచుకపడుతుంది. నేటి ఉదయం సుందర్ బానీ సెక్టార్ లో పాక్ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను తీవ్రగాయాలతో కోన ఉపిరితో కొట్టు మిట్టడుతూ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇదే సమయంగా పాక్ కాల్పులను భారత్ సైన్యం తిప్పికొట్టింది.   
 

పాక్‌కు ఆర్మీ చీఫ్ రావత్ హెచ్చరిక

Submitted by arun on Sat, 10/27/2018 - 14:32

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ జమ్మూకశ్మీర్‌ అభివృద్ధిని అడ్డుకోవాలని పాకిస్థాన్ చేస్తున్న దుష్ట ప్రయత్నాలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్  నిప్పులు చెరిగారు. ఇన్‌ఫ్యాంట్రీ డే ను పురస్కరించుకుని ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద ఆర్మీ చీఫ్ జనరల్ నివాళులర్పించిన ఆయన పాక్ కుయుక్తులు పారవని హెచ్చరించారు. ఉగ్రదాడులు ద్వారా విజయం సాధించలేమన్న విషయం పాకిస్థాన్‌కు కూడా బాగా తెలుసునని అన్నారు. కశ్మీర్‌ అభివృద్ధిని అడ్డుకునేందుకు పాకిస్థాన్ చేసే ప్రయత్నాలన్నింటినీ అంతే దీటుగా తిప్పికొడతామని... ఎలాంటి ఆపరేషన్లు చేపట్టడానికైనా తాము సంసిద్ధతంగా  ఉన్నామన్నారు.

భారత్‌పై విషం చిమ్మిన ఇమ్రాన్ ఖాన్

Submitted by arun on Mon, 09/24/2018 - 12:33

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ నోరు పారేసుకున్నారు. ముందు చూపు లేని తక్కువ స్థాయి వ్యక్తులు ఉన్నత స్థానాల్లో ఉన్నారంటూ మోడీని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. పాక్‌తో చర్చలకు భారత్‌ నో చెప్పినందుకు ఇమ్రాన్‌ విషం చిమ్మారు. పాకిస్థాన్ తో చర్చలకు భారత్ వెనక్కి తగ్గడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు సిద్దమన్న తమ ప్రతిపాదనను తిరస్కరించడం నిరాశకు గురిచేసిందన్నారు. తన ప్రతిపాదనపై వెనక్కితగ్గడంతో భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఇమ్రాన్‌ ఖాన్‌ ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు.

పాకిస్థాన్‌ పని పట్టిన భారత్‌ ...ఆసియా కప్ లో దుమ్మురేపిన భారత్

Submitted by arun on Thu, 09/20/2018 - 09:45

చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. అది కూడా మామూలుగా కాదు దాడి చేసేందుకు అవకాశం ఇవ్వలేదు కోలుకునేందుకు క్షణం అయినా సమయం ఇవ్వకుండా బౌలింగ్‌, బ్యాటింగ్‌తో ఉతికారేసింది ఆసియా కప్‌లో దాయాదుల మధ్య జరిగిన పోరులో రోహిత్‌ గ్యాంగ్ గ్రాండ్ విక్షరీ కొట్టింది పాకిస్తాన్ ను చిత్తు చేసి.. టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. 

నవాజ్ షరీఫ్‌కు జైలు శిక్ష రద్దు : పాక్‌ కోర్టు తీర్పు

Submitted by arun on Wed, 09/19/2018 - 17:31

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అవెన్‌ ఫీల్డ్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో అకౌంటబులిటీ కోర్టు విధించిన జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మరియం నవాజ్‌ను జైలు నుంచి విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అవెన్‌ ఫీల్డ్ ప్రాపర్టీ కేసులో షరీఫ్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆయన కూతురు మరియంకు 8 ఏళ్ల శిక్ష పడింది. ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పుతో అడియాలా జైలులో ఉన్న నవాజ్ షరీఫ్‌ విడుదల కానున్నారు. 5 లక్షల బాండ్ పూచీకత్తుపై కేసులో శిక్షను అనుభవిస్తున్న వారిని  రిలీజ్ చేయాలంటూ ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

సచిన్ టెండూల్కర్ ఒకసారి పాకిస్తాన్ కోసం ఆడాడు

Submitted by arun on Sat, 09/15/2018 - 17:00

మీకు తెలుసా! సచిన్ టెండూల్కర్ ఒకసారి పాకిస్తాన్ కోసం ఆడాడు, 1987 టెస్ట్ సీరీసు కన్నా ముందు ఒక ప్రదర్శనా మ్యాచ్లో భారతదేశం మరియు పాకిస్తాన్ ఆడాయి,  ఇమ్రాన్ ఖాన్ జట్టు నాయకుడు గా వున్నా ఆ ప్రదర్శన పోటీలో,పాకిస్తాన్  ఫీల్డర్లు గ్రౌండ్లో తక్కువ ఉండటం వల్ల, మన సచిన్ పాకిస్తాన్ టీం తరఫున ఫీల్డింగ్ చేసాడట. అప్పుడు సచిన్ వయస్సు 13 ఏళ్ల మాత్రమే. శ్రీ.కో.
 

పాకిస్థాన్ రూపాయి ఇండియాలో!

Submitted by arun on Fri, 09/07/2018 - 14:19

మీకు తెలుసా! పాకిస్థాన్ దేశంగా ఏర్పడ్డ తరవాత కుడా రూపాయల ముద్రణకి  సౌకర్యాలు లేక, రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియానే, పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క ముద్రతో వారి రూపాయలను తాత్కాలికంగా జారీ చేసింది. ఆ తరువాత వారు 1948 లో ముద్రించారట. శ్రీ.కో.