ISRO

మరో చరిత్ర సృష్టించిన ఇస్రో

Submitted by arun on Wed, 11/14/2018 - 17:46

ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్క్-3 డీ2 వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. జీశాట్-29 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి వాహక నౌక ప్రవేశపెట్టింది. మొత్తం 3,423 కిలోల బరువున్న జీశాట్-29 ఉపగ్రహం అన్న దశలను పూర్తి చేసుకొని నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది.

శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం!

Submitted by arun on Mon, 11/05/2018 - 17:06

ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగలలో బారతదేశం చాల ముందడుగు వేస్తువుంది.. అయితే అంతరిక్ష ప్రయోగలలో శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏధో మీకు తెలుసా.... ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం రోహిణి.శ్రీ.కో.

మరో మైలురాయి చేరిన ఇస్రో

Submitted by arun on Thu, 04/12/2018 - 11:23

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం.. ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. దేశీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఉద్దేశించిన పీఎస్‌ఎల్‌వీ-సి41 రాకెట్‌ ప్రయోగం.. విజ‍యవంతమైంది. ఈ తెల్లవారుజామున 4 గంటలా 4 నిముషాలకు ప్రయోగించిన రాకెట్.. 19 నిముషాల 19 సెకన్ల వ్యవధిలో IRNSS-1 ఐ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. 

రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ41

Submitted by arun on Wed, 04/11/2018 - 14:43

మరో అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో సిద్ధమయ్యింది. పీఎస్‌ఎల్వీ సీ - 41 కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యింది గురువారం వేకువజామున 4గంటల 04 నిమిషాలకు నింగిలోకి దూసుకెళుతుంది. పీఎస్‌ఎల్వీ-సీ41 రాకెట్ ఐఆర్‌ఎన్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది.

Tags

మరో ప్రయోగానికి ఇస్రో రెడీ

Submitted by arun on Mon, 04/09/2018 - 15:03

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 12న పిఎస్‌ఎల్‌వి సి41 ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు సంబంధించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు.

ఇస్రోకు ఎదురుదెబ్బ

Submitted by arun on Mon, 04/02/2018 - 13:24

జీశాట్‌-6ఎ శాటిలైట్‌. 2వేల 66 టన్నుల బరువు 270 కోట్ల ఖర్చుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. GSLV రాకెట్‌ ద్వారా గురువారం నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాన్ని మల్టీ బీమ్‌ కవరేజీ సౌకర్యం ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్‌ కమ్యూనికేషన్‌ను అందించేలా తయారుచేశారు. అయితే చివరి దశలో కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి.

GSLV_F08 ప్రయోగం విజయవంతం

Submitted by arun on Thu, 03/29/2018 - 17:30

మొబైల్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించే దిశగా ఇస్రో మరో ముందడు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన GSLV F-08 రాకెట్ ద్వారా ఓ ప్రత్యేక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్  ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 

నేడు శ్రీహరికోట నుంచి నింగిలోకి జీశాట్-6ఏ

Submitted by arun on Thu, 03/29/2018 - 12:42

మొబైల్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించే దిశగా ఇస్రో అడుగులేస్తోంది. ఇందుకోసం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన GSLV F-08 రాకెట్ ద్వారా ఓ ప్రత్యేక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు రంగం సిద్ధమైంది. ఈ సాయంత్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు శాస్ర్తవేత్తలు.