Actress Sri Reddy

చెన్నైలో సంచలన ప్రకటన చేసిన శ్రీరెడ్డి...

Submitted by arun on Tue, 08/21/2018 - 09:17

తెలుగు చిత్ర పరిశ్రమలో నటి శ్రీరెడ్డి ఎలాంటి సంచలనమో అందరికి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి సృష్టించిన హడావిడి అంతా ఇంతా కాదు. సినీప్రముఖులపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. తనకు తానుగా పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల తమిళ మీడియాలో హల్ చల్ చేసిన శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. ‘రెడ్డి డైరీ’ పేరుతో ఆమె స్వీయ చరిత్రను తమిళంలో తెరకెక్కించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు చెన్నై ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అల్లావుద్దీన్‌ మాట్లాడుతూ...

శ్రీ రెడ్డిని చూస్తే జాలేస్తోంది: లారెన్స్‌

Submitted by arun on Mon, 07/30/2018 - 16:36

సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పేసి తనని మోసం చేశారంటూ, కోలీవుడ్ లోని కొంతమంది హీరోలపైన .. దర్శక నిర్మాతలపైన శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో లారెన్స్ పేరు కూడా వుంది .. దాంతో తాజాగా ఆయన స్పందించాడు. "శ్రీరెడ్డి ఆరోపణలను గురించి అంతా నన్ను అడుగుతున్నారు .. అదే పనిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దాంతో ఆమెతో ఉన్న వివాదానికి ముగింపు పలకాలని అనుకొంటున్నాను’ అని రాఘవ ట్వీట్‌లో పేర్కొన్నారు.

పవన్ వ్యాఖ్యలు.. శ్రీరెడ్డి కౌంటర్ ఎటాక్

Submitted by arun on Mon, 04/16/2018 - 11:12

అన్యాయం జరిగినప్పుడు చట్టపరంగా ముందుకెళ్లాలిగానీ, మీడియా వద్దకు వెళ్తే ఎలాంటి ఉపయోగం లేదన్న పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యింది. మహిళలకు సంబంధించిన సమస్యలను గుర్తించినందుకు సంతోషంగా వుందంటూనే పవన్‌కి మరో చురక వేసింది శ్రీరెడ్డి. పవన్ లాంటి స్టార్‌డమ్ వున్న పొలిటీషియన్లు చట్టాలు, వ్యవస్థలు గట్టిగా పనిచేసేలా కృషి చేయాల్సి వుందంటోంది. తాను పోలీసు కంప్లయింట్ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఫేక్ బుక్ పోస్టులో గుర్తు‌చేసింది.

శ్రీరెడ్డి ఉదంతంపై స్పందించిన పవన్ కల్యాణ్

Submitted by arun on Sat, 04/14/2018 - 15:06

టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై హీరోయిన్ శ్రీరెడ్డి చేసిన పోరాటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జమ్మూలోని ఆసిఫాపై జరిగిన అత్యాచారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆయన కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో అన్యాయం జరిగితే చట్టాలను ఆశ్రయించాలన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా కోర్టుకి వెళ్ళవచ్చని.. అలాంటి వారికి తమలాంటి వారి మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.. కానీ టీవీ చర్చలకు వెళ్ళటం సరైంది కాదని సూచించారు. గతంలో షూటింగ్ సమయంలో చాలా సంఘటనలు జరిగాయని...

కోన వెంకట్ నన్ను శ్మశానం వెనక్కి రమ్మన్నాడు: శ్రీరెడ్డి

Submitted by arun on Thu, 04/12/2018 - 11:09

ఇప్పటివరకూ పలువురిపై ఆరోపణలు చేస్తున్న టాలీవుడ్ నటి శ్రీరెడ్డి.. ఇప్పుడు ఆధారాలను బైట పెట్టడం ప్రారంభించింది. మా అసోసియేషన్ ఆఫీస్ ముందు అర్ధ నగ్న నిరసన చేయడం.. నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను బయట పెట్టడం.. వంటివి చేసిన తరువాత సడెన్ ఈమె గురించి మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. నేషనల్ ఛానళ్లలో కూడా ఈమె ఇంటర్వ్యూలు కనిపిస్తున్నాయి.

శ్రీరెడ్డి... ఈసారి టార్గెట్ కేసీఆర్, బాబు!

Submitted by arun on Tue, 04/10/2018 - 16:23

హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి, ఈసారి తెలుగు రాష్ట్రాల సీఎంలను టార్గెట్ చేసింది. మంగళవారం ఉదయం తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ప్రపంచమంతా నా నిరసన గురించి చర్చించుకుంటోంది. కానీ మన మంత్రులు, ఇద్దరు సీఎంలు మాత్రం దీని గురించి మాట్లాడక పోవడం చాలా విచారకరం’ అంటూ వ్యాఖ్యానించింది.  తనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తంచేసింది శ్రీరెడ్డి. ఐతే, ఆమెకి సభ్యత్వం ఇచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే ‘మా’ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

నా బ్ర‌తుకును బ‌స్టాండ్ చేశారు

Submitted by lakshman on Sun, 04/08/2018 - 23:05

గత కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలోని ‘కాస్టింగ్ కౌచ్’... ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ సోషల్ మీడియా, టీవీ డిబెట్స్‌‌లలో నానా హంగామా చేస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ దగ్గర హల్ చల్ చేసింది. చాంబర్‌ ఆవరణలో అర్ధనగ్నంగా నిరసన చేసింది.

నేడే చూడండి..రెడ్డిగారి గానా భ‌జానా

Submitted by lakshman on Sat, 04/07/2018 - 12:12

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న న‌టి శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు వారిని వాడుకుని వదిలేస్తున్నారని.. ఛాన్సులు ఇవ్వడం లేదంటూ విరుచుకుపడుతోంది. ఇంటర్వ్యూలు, డిబేట్లలో పాల్గొంటూ టాలీవుడ్‌ని హడలెత్తిస్తోంది. 
అవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న సినీ, టెలివిజన్ ప్రముఖుల గుట్టు విప్పింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌ లైవ్‌లో కొందర్ని టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. 

మరో బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి...ఏకంగా వాట్సాప్ ఛాట్‌ను పోస్ట్ చేసింది

Submitted by arun on Thu, 04/05/2018 - 17:12

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో తనను వేధించి, అవకాశాలు ఇవ్వకుండా చేసిన ఇండస్ట్రీ పెద్దల బండారం ఒక్కొక్కటిగా బయటపెడుతూ ఇండస్ట్రీ పెద్దల్లో దడ పెట్టిస్తోంది శ్రీరెడ్డి. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ గాయకుడు తనతో జరిపిన వాట్సాప్ ఛాట్ ఇదేనంటూ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 

మరో బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి...నిజ జీవితంలో కూడా 'నేచురల్'గా నటిస్తావు

Submitted by arun on Thu, 04/05/2018 - 11:59

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో తనను వేధించి, అవకాశాలు ఇవ్వకుండా చేసిన ఇండస్ట్రీ పెద్దల బండారం ఒక్కొక్కటిగా బయటపెడుతూ ఇండస్ట్రీ పెద్దల్లో దడ పెట్టిస్తోంది శ్రీరెడ్డి. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా ద్వారా మరో లీక్ చేసింది. ఆమె చేసిన ఆరోపణలను ఆమె మాటల్లోనే చూద్దాం.