Akbaruddin Owaisi

తెలంగాణ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదల

Submitted by arun on Tue, 12/11/2018 - 10:09

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. చంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి, అక్బరుద్దీన్‌ ఒవైసీ విజయం సాధించారు. ఆయన వరుసగా ఐదోసారి ఎన్నికల్లో గెలుపొందడం విశేషం. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి సీతారాం రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇసాబినోబైద్ మిస్రీ, బీజేపీ నుంచి సయ్యద్ షహజాదీ పోటీ చేస్తున్నారు. ఎంఐఎంకు కంచుకోట వంటి చాంద్రాయణ గుట్టలో అక్బరుద్దీన్ గెలుపును ముందుగానే అందరూ ఊహించారు.

ఇవే నాకు చివరి ఎన్నికలు కావొచ్చు: అక్బరుద్దీన్ ఒవైసీ

Submitted by chandram on Mon, 12/03/2018 - 11:14

ఈ ఎన్నికలే తన చివరి ఎన్నికలని చెప్పారు చాంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ. ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన తనకు ఆరోగ్యం అస్సలు బాగోలేదని చెప్పారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపారు. తన కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయని, కిడ్నీల దగ్గర కొన్ని తూటాల ముక్కలు ఉన్నాయని చెప్పారు. కొన్ని రోజుల కిందటే పరిస్థితి చేయి దాటిపోయిందని, డయాలసిస్ చేయించుకోవాలని  వైద్యులు చెప్పారని అక్బరుద్దీన్ చెప్పారు. హాస్పిటల్స్, స్కూళ్లు, దారుసలాం బ్యాంకులు చూసుకోవడానికే తనకు సమయం సరిపోతుందని, అనారోగ్యం కారణంగా ఇప్పటికే అక్బర్ కొన్ని ఎన్నికల సభల్లో హజరుకాలేకపోయారట.

అక్బరుద్దీన్‌పై స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు

Submitted by chandram on Mon, 11/26/2018 - 15:57

తాజాగా అక్బరుద్దీన్ హిందుత్వంపై అనుచిత వ్యాఖ్యాలు చేస్తున్న అక్బరుద్దీన్ పై స్వామి పరిపూర్ణానంద తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ వదిలి వెంటనే పాకిస్థాన్‌కు పోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి మూసారంబాగ్‌ డివిజన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ తెలంగాణలో టీఆర్ఎస్,కాంగ్రెస్,ఎంఐఎం ఓడిపోవడం తథ్యమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజీపీ పార్టీ గెలిస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా వెంటనే మారుస్తామని తెలిపారు. మలక్‌పేటలో భూకబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న మజ్లిస్‌ అభ్యర్థి బలాలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు.

నేను కింగ్ కాదు కింగ్ మేకర్..: అక్బరుద్దీన్ ఒవైసీ

Submitted by santosh on Mon, 11/26/2018 - 12:37

తాను సీఎం ఎందుకు కాకూడదంటూ గతంలో వ్యాఖ్యానించి కలకలం రేపిన ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కింగ్ మేకర్ని తానేనంటూ కలకలం సృష్టించారు. డిసెంబర్ 11వ తేదీన ఏం జరగబోతోందో చూడమంటూ మరింత సస్పెన్స్ రేపారు. ఇంతకీ అక్బరుద్దీన్ లెక్కలేంటి.? అక్బరుద్దీన్ కింగ్ మేకర్ అయితే మరి కింగ్ ఎవరు..? కుమార స్వామి సీఎం కాగా లేనిది అక్బరుద్దీన్ ముఖ్యమంత్రి కాలేడా..?ఎంఐఎం ఎవర్నైనా సీఎంను చేస్తుంది..వద్దనుకుంటే దించేస్తుంది.

కింగ్‌ మేకర్స్ ముస్లిమేనా? తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల ప్రభావం ఎంత?

Submitted by santosh on Mon, 11/26/2018 - 12:18

తెలంగాణ ఎన్నికల సీన్‌లో, కింగ్‌ మేకర్‌ అవుతానని అక్బరుద్దీన్‌ ఊహిస్తుంటే, అటు దాదాపు సగం నియోజకవర్గాల్లో ముస్లింల ఓటర్లే జయాపజయాలు డిసైడ్ చేసే, కింగ్‌ మేకర్స్ అని లెక్కలు చెబుతున్నాయి. మార్జిన్‌లో అభ్యర్థుల తలరాతలను మార్చేది, ముస్లిం జనాభేనని సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతకీ తెలంగాణలో ముస్లిం ఓటర్ల సంఖ్యఎంత...ఏయే నియోజకవర్గాల్లో వారి ప్రభావం ఉంటుంది? 53 నియోజకవర్గాల్లో ముస్లింలే కీలకం ముస్లింలను ఆకట్టుకునేందుకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వ్యూహాలు.

ఎన్నికల వేళ కలకలం రేపుతున్న అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 11/23/2018 - 17:32

తాను సీఎం ఎందుకు కాకూడదంటూ గతంలో వ్యాఖ్యానించి కలకలం రేపిన ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం దయ ఉంటేనే ఎవరైనా సీఎంగా ఉండగలరని లేదంటే పక్కకు తప్పుకోవాల్సిందేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఎంఐఎం తలుచుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రి చేయగలదని అన్నారు. చంద్రబాబు మొదలు నేటి కేసీఆర్ వరకు అందరూ ఎంఐఎం దగ్గర తల వంచిన వారేనని అన్నారు. తాను బాద్షాని కాదనీ కానీ కింగ్ మేకర్‌ని మాత్రం తానే అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.

అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 11/23/2018 - 16:14

తాను సీఎం ఎందుకు కాకూడదంటూ గతంలో వ్యాఖ్యానించి కలకలం రేపిన ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం దయ ఉంటేనే ఎవరైనా సీఎంగా ఉండగలరని లేదంటే పక్కకు తప్పుకోవాల్సిందేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఎంఐఎం తలుచుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రి చేయగలదని అన్నారు. తమ దగ్గరికి వచ్చి ఎవరైనా తలవంచాల్సిందేనని చెప్పారు. చంద్రబాబు మొదలు నేటి కేసీఆర్ వరకు అందరూ ఎంఐఎం చెప్పుచేతల్లో ఉన్నవారేనని అన్నారు. తాను బాద్షాని కాదనీ అయితే కింగ్ మేకర్‌ని మాత్రం తానే అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.

నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది

Submitted by arun on Sat, 11/10/2018 - 10:45

తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ. యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తనను చంపుతానంటూ బెదింపు లేఖలు, ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. అహ్మాదాబాద్, కర్ణాటక ప్రాంతాల నుంచి 11 మంది తనను చంపేందుకు హైదరాబాద్‌లో దిగారని ఆయన చెప్పారు.

ముస్లింలకు సీఎం కేసీఆర్ బంధువు: ఓవైసీ

Submitted by arun on Tue, 03/27/2018 - 13:10

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఓవైసీ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ముస్లింలందరి బంధువు అని చెప్పారు. అందుకే టీఆర్‌ఎస్‌తో స్నేహంగా ఉంటున్నామని తెలిపారు. మైనార్టీ సంక్షేమం కోసం భారీగా నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.